Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
80 : 6

وَحَآجَّهٗ قَوْمُهٗ ؕ— قَالَ اَتُحَآجُّوْٓنِّیْ فِی اللّٰهِ وَقَدْ هَدٰىنِ ؕ— وَلَاۤ اَخَافُ مَا تُشْرِكُوْنَ بِهٖۤ اِلَّاۤ اَنْ یَّشَآءَ رَبِّیْ شَیْـًٔا ؕ— وَسِعَ رَبِّیْ كُلَّ شَیْءٍ عِلْمًا ؕ— اَفَلَا تَتَذَكَّرُوْنَ ۟

ముష్రికులైన ఆయన జాతివారు అల్లాహ్ సుబహానహు తఆలా తౌహీదు (ఏక దైవోపాసన) విషయంలో ఆయనతో వాదించారు.వారు తమ విగ్రహాల ద్వారా ఆయనను భయపెట్టారు.అప్పుడు ఆయన వారితో ఇలా పలికారు : ఏ మీరు అల్లాహ్ యొక్క తౌహీద్ విషయంలో,ఆరాధనలో ఆయన ఒక్కడే అన్న విషయంలో నాతో వాదిస్తున్నారా.వాస్తవానికి నా ప్రభువు నాకు దానిని అనుగ్రహించాడు.నేను మీ విగ్రహాలతో భయపడను.ఎందుకంటే వారికి నన్ను నష్టం,లాభం కలిగించే శక్తి లేదు.కాని అల్లాహ్ తలుచుకుంటే జరిగిద్ది.అల్లాహ్ ఏది తలచుకుంటే అది అయిపోతుంది.ప్రతి వస్తువు అల్లాహ్ జ్ఞానంలో ఉన్నది.భూమ్యాకాశాల్లో ఉన్న ఏ వస్తువు ఆయన నుండి గోప్యంగా ఉండదు.అయితే ఓ నా జాతివారా అల్లాహ్ పై అవిశ్వాసం,ఆయనతోపాటు సాటి కల్పిస్తున్న మీరు ఏకైక అల్లాహ్ ను విశ్వసించి హితబోధనను గ్రహించరా?. info
التفاسير:
Benefits of the verses in this page:
• الاستدلال على الربوبية بالنظر في المخلوقات منهج قرآني.
సృష్టితాల్లో దృష్టిని సారించి తౌహీదె రుబూబియ్యత్ గురించి ఆధారం చూపటం ఇది ఖుర్ఆన్ పద్దతి. info

• الدلائل العقلية الصريحة توصل إلى ربوبية الله.
స్పష్టమైన బౌద్ధిక ఆధారాలు తౌహీదె రుబూబియ్యత్ నకు చేరవేస్తున్నాయి. info