Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
49 : 5

وَاَنِ احْكُمْ بَیْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَآءَهُمْ وَاحْذَرْهُمْ اَنْ یَّفْتِنُوْكَ عَنْ بَعْضِ مَاۤ اَنْزَلَ اللّٰهُ اِلَیْكَ ؕ— فَاِنْ تَوَلَّوْا فَاعْلَمْ اَنَّمَا یُرِیْدُ اللّٰهُ اَنْ یُّصِیْبَهُمْ بِبَعْضِ ذُنُوْبِهِمْ ؕ— وَاِنَّ كَثِیْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ ۟

మరియు ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ మీ వైపు అవతరింపజేసిన శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యండి. మరియు మీరు మనోవాంఛల్లాంటి ఉద్భవించే వారి అభిప్రాయాలను అనుసరించకండి. అల్లాహ్ మీపై అవతరింపజేసిన కొన్ని శాసనాల నుండి వారు మిమ్మల్ని తప్పించకుండా మీరు వారి నుండి జాగ్రత్తగా ఉండండి. వారు ఆ మార్గంలో ఎటువంటి ప్రయత్నం చేయరు. ఒక వేళ వారు మీపై అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పును స్వీకరించటం నుండి విముఖత చూపితే అల్లాహ్ వారిని వారి కొన్ని పాపములకు ప్రాపంచిక శిక్ష విధించదలచాడని మీరు తెలుసుకోండి. మరియు వాటన్నింటికి ఆయన వారిని పరలోకంలో శిక్షిస్తాడు. మరియు నిశ్ఛయంగా ప్రజల్లోంచి చాలా మంది అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయేవారున్నారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• الأنبياء متفقون في أصول الدين مع وجود بعض الفروق بين شرائعهم في الفروع.
దైవ ప్రవక్తలు ఫురూ విషయంలో తమ షరీఅత్ లలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికి ధర్మ నియమాల్లో (ఉసూల్ విషయంలో) ఒక్కటే. info

• وجوب تحكيم شرع الله والإعراض عمّا عداه من الأهواء.
అల్లాహ్ ధర్మ శాసనం ప్రకారం తీర్పునివ్వటం మరియు అవి కాకుండా వేరేవైన మనోవాంఛల నుండి విముఖత చూపటం తప్పనిసరి. info

• ذم التحاكم إلى أحكام أهل الجاهلية وأعرافهم.
అజ్ఞానుల తీర్పులను వారి ఆచారాలను ఖండించటం జరిగింది. info