Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

Page Number:close

external-link copy
20 : 47

وَیَقُوْلُ الَّذِیْنَ اٰمَنُوْا لَوْلَا نُزِّلَتْ سُوْرَةٌ ۚ— فَاِذَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ مُّحْكَمَةٌ وَّذُكِرَ فِیْهَا الْقِتَالُ ۙ— رَاَیْتَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ یَّنْظُرُوْنَ اِلَیْكَ نَظَرَ الْمَغْشِیِّ عَلَیْهِ مِنَ الْمَوْتِ ؕ— فَاَوْلٰى لَهُمْ ۟ۚ

మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారు అల్లాహ్ తన ప్రవక్తపై యుద్ధ ఆదేశమును కలిగిన ఏదైన సూరాను అవతరింపజేయాలని ఆశిస్తూ ఇలా పలికారు : ఎందుకని అల్లాహ్ యుద్ద ప్రస్తావనను కలిగిన ఏదైన సూరాను అవతరింపజేయలేదు ?. ఎప్పుడైతే అల్లాహ్ ఏదైన స్పష్టమైన సూరా అందులో యుద్ధ ఆదేశముల ప్రస్తావన కలిగినది అవతరింపజేసినప్పుడు ఓ ప్రవక్తా హృదయముల్లో రోగము కలిగిన కపటులు మీ వైపునకు తనపై భయము,ఆందోళన కమ్ముకున్న వాడిలా చూస్తారు. వారు యుద్ధం నుండి మరలిపోవటం వలన మరియు దాని నుండి భయపడటం వలన వారి శిక్ష వారికి ఆసన్నమైనదని మరియు వారికి దగ్గరైనదని అల్లాహ్ వారికి వాగ్దానం చేశాడు. info
التفاسير:

external-link copy
21 : 47

طَاعَةٌ وَّقَوْلٌ مَّعْرُوْفٌ ۫— فَاِذَا عَزَمَ الْاَمْرُ ۫— فَلَوْ صَدَقُوا اللّٰهَ لَكَانَ خَیْرًا لَّهُمْ ۟ۚ

వారు అల్లాహ్ ఆదేశమును అనుసరించటం మరియు మంచి మాటను పలకటం అందులో ఎటువంటి తిరస్కారం లేకపోవటం వారి కొరకు మేలైనది. యుద్ధం అనివార్యమైనప్పుడు మరియు కృషి చేసినప్పుడు ఒక వేళ వారు అల్లాహ్ పై తమ విశ్వాసమును మరియు ఆయన పై తమ విధేయతను నిజం చేసి చూపిస్తే కపటత్వం కన్న,అల్లాహ్ ఆదేశములను ఉల్లంఘించటం కన్న వారి కొరకు ఎంతో మేలైనది. info
التفاسير:

external-link copy
22 : 47

فَهَلْ عَسَیْتُمْ اِنْ تَوَلَّیْتُمْ اَنْ تُفْسِدُوْا فِی الْاَرْضِ وَتُقَطِّعُوْۤا اَرْحَامَكُمْ ۟

ఒక వేళ మీరు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం నుండి,ఆయన పై విధేయత చూపటం నుండి విముఖత చూపితే అవిశ్వాసం మరియు పాపకార్యములతో భూమిలో మీరు ఉపద్రవాలను తలపెట్టటం అజ్ఞాన కాలంలో మీ స్థితి ఉన్నట్లుగా మీ స్థితిపై ఆధిక్యతను చూపుతుంది. info
التفاسير:

external-link copy
23 : 47

اُولٰٓىِٕكَ الَّذِیْنَ لَعَنَهُمُ اللّٰهُ فَاَصَمَّهُمْ وَاَعْمٰۤی اَبْصَارَهُمْ ۟

భూమిలో ఉపద్రవాలను తలపెట్టటం మరియు బంధుత్వాలను త్రెంచటం లాంటి లక్షణాలు కలిగిన వారందరినే అల్లాహ్ తన కారుణ్యము నుండి దూరం చేశాడు. మరియు సత్యమును స్వీకరించే,అంగీకరించే ఉద్దేశంతో వినటం నుండి వారి చెవులను చెవిటిగా చేశాడు. గుణపాటం నేర్చుకునే ఉద్దేశంతో దాన్ని చూడటం నుండి వారి కళ్ళను అంధులుగా చేశాడు. info
التفاسير:

external-link copy
24 : 47

اَفَلَا یَتَدَبَّرُوْنَ الْقُرْاٰنَ اَمْ عَلٰی قُلُوْبٍ اَقْفَالُهَا ۟

విముఖత చూపే వీరందరు ఖుర్ఆన్ గరించి ఎందుకు యోచన చేయటం లేదు మరియు అందులో ఉన్న విషయాల గురించి ఆలోచించటం లేదు ?!. ఒక వేళ వారు దాని గురించి యోచన చేస్తే ఆయన (అల్లాహ్) వారికి ప్రతీ మేలును సూచించేవాడు. మరియు వారిని ప్రతీ కీడు నుండి దూరం చేసేవాడు. లేదా వారందరి హృదయాలపై తాళాలు ఉండి వాటిని దృఢంగా కట్టివేయబడి ఉన్నాయా ? అందుకని వాటి వరకు హితోపదేశం చేరటం లేదు మరియు వాటికి హితోపదేశం ప్రయోజనం కలిగించటం లేదు. info
التفاسير:

external-link copy
25 : 47

اِنَّ الَّذِیْنَ ارْتَدُّوْا عَلٰۤی اَدْبَارِهِمْ مِّنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْهُدَی ۙ— الشَّیْطٰنُ سَوَّلَ لَهُمْ ؕ— وَاَمْلٰی لَهُمْ ۟

నిశ్చయంగా ఎవరైతే తమపై వాదన నిరూపితమై,ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిజాయితీ తమకు స్పష్టమైన తరువాత కూడా తమ విశ్వాసము నుండి అవిశ్వాసము వైపునకు,కపటత్వము వైపునకు మరలి వెళ్ళి పోయారో. షైతానే వారికి అవిశ్వాసమును,కపటత్వమును అలంకరించి చూపించి దాన్ని వారి కొరకు శులభతరం చేశాడు. మరియు వాడు వారికి సుదీర్ఘ ఆశలను కలిగించాడు. info
التفاسير:

external-link copy
26 : 47

ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْا لِلَّذِیْنَ كَرِهُوْا مَا نَزَّلَ اللّٰهُ سَنُطِیْعُكُمْ فِیْ بَعْضِ الْاَمْرِ ۚ— وَاللّٰهُ یَعْلَمُ اِسْرَارَهُمْ ۟

ఈ మార్గవిహీనత వారికి కలగటానికి కారణం వారు ఆయన తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన దివ్యవాణిని అసహ్యించుకున్న ముష్రికులతో గోప్యుంగా ఇలా పలకటం : యుద్ధం నుండి ఆగిపోవటం లాంటి కొన్ని విషయములలో మేము మీకు విధేయత చూపుతాము. మరియు వారు దాచేది,వారు బహిర్గతం చేసేది అల్లాహ్ కు తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. అయితే ఆయన దానిలో నుండి తాను తలచినది తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బహిర్గతం చేస్తాడు. info
التفاسير:

external-link copy
27 : 47

فَكَیْفَ اِذَا تَوَفَّتْهُمُ الْمَلٰٓىِٕكَةُ یَضْرِبُوْنَ وُجُوْهَهُمْ وَاَدْبَارَهُمْ ۟

వారి ఆత్మలను స్వాధీనం చేసుకునే బాధ్యతను కలిగిన దైవదూతలు వారి ముఖములపై మరియు వారి వీపులపై లోహపు సమిటెలతో కొడుతూ వారి ఆత్మలను స్వాధీనం చేసుకునేటప్పుడు వారు అనుభవించే శిక్షను మరియు భయంకరమైన పరిస్థితులను మీరు ఎలా చూస్తారు ?. info
التفاسير:

external-link copy
28 : 47

ذٰلِكَ بِاَنَّهُمُ اتَّبَعُوْا مَاۤ اَسْخَطَ اللّٰهَ وَكَرِهُوْا رِضْوَانَهٗ فَاَحْبَطَ اَعْمَالَهُمْ ۟۠

ఈ శిక్ష కలగటానికి కారణం వారు తమపై అల్లాహ్ కు క్రోదమును కలిగించే అవిశ్వాసం,కపటత్వం మరియు అల్లాహ్ ని,ఆయన ప్రవక్తని వ్యతిరేకించటం లాంటి వాటన్నింటిని అనుసరించారు. మరియు వారు తమ ప్రభువు సాన్నిధ్యమును కలిగించే వాటిని,తమపై ఆయన మన్నతను దించే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం మరియు ఆయన ప్రవక్తను అనుసరించటం లాంటి వాటిని అసహ్యించుకున్నారు. కావున ఆయన వారి కర్మలను వృధా చేశాడు. info
التفاسير:

external-link copy
29 : 47

اَمْ حَسِبَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ اَنْ لَّنْ یُّخْرِجَ اللّٰهُ اَضْغَانَهُمْ ۟

ఏమీ తమ హృదయముల్లో సందేహము కలిగిన కపటులు అల్లాహ్ వారి ద్వేషాలను వెలికి తీసి వాటిని బహిర్గతం చేయడని భావిస్తున్నారా ?! అసత్యపరుడి నుండి సత్య విశ్వాసపరుడు వేరయి విశ్వాసపరుడు స్పష్టమై కపటుడు బహిర్గతం కావటానికి ఆయన తప్పకుండా వాటిని పరీక్షల ద్వారా,కష్టాల ద్వారా వెలికి తీస్తాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• التكليف بالجهاد في سبيل الله يميّز المنافقين من صفّ المؤمنين.
అల్లాహ్ మార్గములో ధర్మపోరాటము ద్వారా బాధ్యత వహించటం కపటులను విశ్వాసపరుల శ్రేణి నుండి వేరు చేస్తుంది. info

• أهمية تدبر كتاب الله، وخطر الإعراض عنه.
అల్లాహ్ గ్రంధంలో యోచన చేయటం యొక్క ప్రాముఖ్యత మరియు దాని నుండి విముఖత చూపటం యొక్క ప్రమాదము. info

• الإفساد في الأرض وقطع الأرحام من أسباب قلة التوفيق والبعد عن رحمة الله.
భూమిలో సంక్షోభములను తలపెట్టటం,బంధుత్వములను త్రెంచటం అల్లాహ్ కారుణ్య భాగ్యము తగ్గటానికి మరియు దాని నుండి దూరమవటానికి కారణము. info