Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

Page Number:close

external-link copy
17 : 40

اَلْیَوْمَ تُجْزٰی كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ ؕ— لَا ظُلْمَ الْیَوْمَ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟

ఆ రోజు ప్రతీ మనిషి తాను చేసుకున్న కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతాడు. ఒక వేళ అది మంచిగా ఉంటే (ప్రతిఫలం) మంచిగా ఉంటుంది. ఒక వేళ అది చెడుగా ఉంటే (ప్రతిఫలం) చెడుగా ఉంటుంది. ఆ రోజు అన్యాయం చేయబడదు. ఎందుకంటే తీర్పునిచ్చేవాడు అల్లాహ్ యే న్యాయాధిపతి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల కొరకు వారిని తన జ్ఞానం పరంగా చుట్టుముట్టి ఉండటం వలన త్వరగా లెక్క తీసుకునేవాడు. info
التفاسير:

external-link copy
18 : 40

وَاَنْذِرْهُمْ یَوْمَ الْاٰزِفَةِ اِذِ الْقُلُوْبُ لَدَی الْحَنَاجِرِ كٰظِمِیْنَ ؕ۬— مَا لِلظّٰلِمِیْنَ مِنْ حَمِیْمٍ وَّلَا شَفِیْعٍ یُّطَاعُ ۟ؕ

ఓ ప్రవక్తా మీరు వారిని ప్రళయదినము నుండి భయపెట్టండి. దగ్గరకు వచ్చిన ఈ ప్రళయము వస్తున్నది. మరియు ప్రతీ వచ్చేది దగ్గరవుతుంది. ఆ రోజున హృదయములు దాని భయాందోళనల వలన పైకి వచ్చేస్తాయి చివరికి అవి తమ యజమానుల గొంతుల వరకు వచ్చేస్తాయి. ఎవరైతే మౌనంగా ఉంటారో వారిలో నుండి ఎవరూ మాట్లాడరు కాని కరుణామయుడు ఎవరికి అనుమతిస్తే తప్ప. మరియు షిర్కు,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై హింసకు పాల్పడే వారి కొరకు ఏ స్నేహితుడు గాని దగ్గరి బంధువు గాని ఉండడు. మరియు అతని కొరకు సిఫారసు చేయటానికి నియమించబడినప్పుడు అతని మాట చెలామణి చేసుకొనబడే సిఫారసు చేసేవాడు ఎవడూ ఉండడు. info
التفاسير:

external-link copy
19 : 40

یَعْلَمُ خَآىِٕنَةَ الْاَعْیُنِ وَمَا تُخْفِی الصُّدُوْرُ ۟

చూసేవారి కళ్ళు గోప్యంగా మోసం చేసి తీసుకునే వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. మరియు హృదయములు దాచే వాటి గురించి ఆయనకు తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. info
التفاسير:

external-link copy
20 : 40

وَاللّٰهُ یَقْضِیْ بِالْحَقِّ ؕ— وَالَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا یَقْضُوْنَ بِشَیْءٍ ؕ— اِنَّ اللّٰهَ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟۠

మరియు అల్లాహ్ న్యాయముగా తీర్పునిస్తాడు. ఆయన ఏ ఒక్కరిని అతని పుణ్యాలను తగ్గించి మరియు అతని పాపములను అధికం చేసి హింసించడు. మరియు ఎవరినైతే ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారో వారు దేని గురించి తీర్పునివ్వరు. ఎందుకంటే వాటికి దేని అధికారము లేదు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల మాటలను బాగా వినేవాడును, వారి సంకల్పాలను,వారి కర్మలను చూసేవాడును. మరియు ఆయన వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
21 : 40

اَوَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ كَانُوْا مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْا هُمْ اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاٰثَارًا فِی الْاَرْضِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ ؕ— وَمَا كَانَ لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ ۟

ఏమిటీ ఈ ముష్రికులందరు భూమిలో సంచరించలేదా వారికన్న ముందు తిరస్కరించిన జాతుల వారి ముగింపు ఏమయిందో వారు యోచన చేయటానికి. నిశ్ఛయంగా ముగింపు దుర్బరంగా అయినది. ఆ జాతుల వారు వీరందరి కన్న అధిక బలము కలవారు. మరియు వారు భూమిలో నిర్మాణములు ఏర్పరచి వారందరు వదలనన్ని గుర్తులను వదిలి వెళ్ళారు. అప్పుడు అల్లాహ్ వారి పాపముల వలన వారిని నాశనం చేశాడు. మరియు వారి కొరకు అల్లాహ్ శిక్ష నుండి వారిని ఆపేవాడు ఎవడూ లేకపోయాడు. info
التفاسير:

external-link copy
22 : 40

ذٰلِكَ بِاَنَّهُمْ كَانَتْ تَّاْتِیْهِمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَكَفَرُوْا فَاَخَذَهُمُ اللّٰهُ ؕ— اِنَّهٗ قَوِیٌّ شَدِیْدُ الْعِقَابِ ۟

వారికి కలిగిన ఈ శిక్ష వారికి మాత్రమే కలిగినది. ఎందుకంటే వారి వద్దకు వారి ప్రవక్తలు అల్లాహ్ వద్ద నుండి స్పష్టమైన సూచనలను మరియు అద్భుతమైన వాదనలను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయన ప్రవక్తలను తిరస్కరించారు. మరియు వారు దానికి తోడుగా అధిక బలమును కలిగి ఉన్నారు. అప్పుడు అల్లాహ్ వారిని పట్టుకుని తుదిముట్టించాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన మహా బలశాలి,తనపట్ల అవిశ్వాసమునకు పాల్పడి తన ప్రవక్తను తిరస్కరించే వాడిని కఠినంగా శిక్షించేవాడు. info
التفاسير:

external-link copy
23 : 40

وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ

మరియు నిశ్ఛయంగా మేము మూసా అలైహిస్సలాం ను మా స్పష్టమైన సూచనలతో మరియు ఖచ్చితమైన ఆధారములతో పంపించాము. info
التفاسير:

external-link copy
24 : 40

اِلٰی فِرْعَوْنَ وَهَامٰنَ وَقَارُوْنَ فَقَالُوْا سٰحِرٌ كَذَّابٌ ۟

ఫిర్ఔన్,అతని మంత్రి హామాన్ మరియు ఖారూన్ వద్దకు. అప్పుడు వారు ఇలా పలికారు : మూసా తాను ప్రవక్త అని వాదిస్తున్న విషయంలో మంత్రజాలకుడు,అసత్యవాది. info
التفاسير:

external-link copy
25 : 40

فَلَمَّا جَآءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوا اقْتُلُوْۤا اَبْنَآءَ الَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ وَاسْتَحْیُوْا نِسَآءَهُمْ ؕ— وَمَا كَیْدُ الْكٰفِرِیْنَ اِلَّا فِیْ ضَلٰلٍ ۟

మూసా అలైహిస్సలాం వారి వద్దకు తన నజాయితీపై సూచించే ఆధారాలను తీసుకొచ్చినప్పుడు ఫిర్ఔన్ ఇలా పలికాడు : అతని తో పాటు విశ్వసించిన వారి మగ సంతానమును హతమార్చి వారి ఆడవారిని వారికి అవవమానము కొరకు వదిలివేయండి. విశ్వాసపరుల సంఖ్యా బలమును తగ్గించే ఆదేశముతో అవిశ్వాసపరుల కుట్ర మాత్రం నాశనమయింది,వెళ్ళిపోయింది. దాని ఎటువంటి ప్రభావం లేకపోయింది. info
التفاسير:
Benefits of the verses in this page:
• التذكير بيوم القيامة من أعظم الروادع عن المعاصي.
ప్రళయదినము ద్వారా హితబోధన పాపకార్యముల నుండి గొప్ప మరలింపులో నుండి. info

• إحاطة علم الله بأعمال عباده؛ خَفِيَّة كانت أم ظاهرة.
అల్లాహ్ యొక్క జ్ఞానము తన దాసుల కర్మలకు చుట్టుముట్టి యుండటం అవి గోప్యమైనవైన లేదా బహిర్గతమైనవైన. info

• الأمر بالسير في الأرض للاتعاظ بحال المشركين الذين أهلكوا.
భూమిలో సంచరించే ఆదేశము నాశనమైన ముష్రికుల స్థితి నుండి హితోపదేశం గ్రహించటానికి. info