Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
75 : 4

وَمَا لَكُمْ لَا تُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ وَالْمُسْتَضْعَفِیْنَ مِنَ الرِّجَالِ وَالنِّسَآءِ وَالْوِلْدَانِ الَّذِیْنَ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اَخْرِجْنَا مِنْ هٰذِهِ الْقَرْیَةِ الظَّالِمِ اَهْلُهَا ۚ— وَاجْعَلْ لَّنَا مِنْ لَّدُنْكَ وَلِیًّا ۙۚ— وَّاجْعَلْ لَّنَا مِنْ لَّدُنْكَ نَصِیْرًا ۟ؕ

ఓ విశ్వాసపరులారా అల్లాహ్ వాక్కును ఉన్నత శిఖరాలకు చేర్చుటకు మరియు బలహీనులైన పురుషులు,స్త్రీలు మరియు పిల్లలకు ఎవరైతే ఇలా పలుకుతూ : ఓ మా ప్రభూ మక్కా నుండి మమ్మల్ని బయటకు తీయి అక్కడి వాసులు అల్లాహ్ కి సాటి కల్పించి,ఆయన దాసులపై హద్దుమీరి ప్రవర్తించి దుర్మార్గమునకు పాల్పడటం వలన,మరియు నీ వద్ద నుండి మా వ్యవహారమును దాక్షిణ్యం ద్వారా,పరిరక్షణ ద్వారా పరిరక్షించే వారిని,మా నుండి నష్టమును తొలగించే సహాయకుడిని నియమించు అని అల్లాహ్ తో వేడుకుంటున్నారో వారికి విముక్తి కలిగించటం కొరకు ఆయన మార్గంలో ధర్మపోరాటం చేయటం నుండి మిమ్మల్ని ఏది ఆపుతుంది. info
التفاسير:
Benefits of the verses in this page:
• وجوب القتال لإعلاء كلمة الله ونصرة المستضعفين، وذم الخوف والجبن والاعتراض على أحكام الله.
అల్లాహ్ వాక్కును ఉన్నత శిఖరాలకు చేరవేయటానికి మరియు బలహీనులకు సహాయం చేయటానికి యుద్ధం తప్పనిసరి అవటం మరియు అల్లాహ్ ఆదేశముల విషయంలో భయపడటం,పిరికతనం,విముఖత చూపటం యొక్క దూషణ. info

• الدار الآخرة خير من الدنيا وما فيها من متاع وشهوات لمن اتقى الله تعالى وعمل بطاعته.
అల్లాహ్ తఆలాతో భయపడి,ఆయన విధేయతకు అనుగుణంగా ఆచరించే వారి కొరకు పరలోక నివాసము ఇహలోకము మరియు అందులో ఉన్న సామగ్రి,కోరికల కన్న మేలైనది. info

• الخير والشر كله بقدر الله، وقد يبتلي الله عباده ببعض السوء في الدنيا لأسباب، منها: ذنوبهم ومعاصيهم.
మంచి మరియు చెడు అంతా అల్లాహ్ విధి వ్రాత ప్రకారం ఉంటుంది. మరియు అల్లాహ్ తన దాసులను కొన్ని కారణాల వలన ఇహలోకంలో కొన్ని కీడుల ద్వారా పరీక్షిస్తాడు. వారి పాపములు,వారి అవిధేయ కార్యాలు వాటిలో నుండే. info