Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
49 : 4

اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ یُزَكُّوْنَ اَنْفُسَهُمْ ؕ— بَلِ اللّٰهُ یُزَكِّیْ مَنْ یَّشَآءُ وَلَا یُظْلَمُوْنَ فَتِیْلًا ۟

ఓ ప్రవక్త ఏమీ తమను,తమ కర్మలను పవిత్రులమని కీర్తించుకునే వారి విషయం మీకు తెలియదా ?. కాని ఒక్కడైన అల్లాహ్ యే తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారిని కీర్తిస్తాడు మరియు వారిని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయనకు హృదయాల అంతర్గతాలు తెలుసు. మరియు ఆయన వారి కర్మల పుణ్యములో నుంచి కొంచము కూడా తగ్గించడు ఒక వేళ అది కర్జురపు టెంకపై ఉన్న పొర పరిమాణంలో ఉన్నా సరే. info
التفاسير:
Benefits of the verses in this page:
• كفاية الله للمؤمنين ونصره لهم تغنيهم عما سواه.
విశ్వాసపరులకు అల్లాహ్ సరిపోవటం మరియు వారికి ఆయన సహాయం లభించటం వారికి ఆయన కాకుండా ఇతరుల అక్కర లేకుండా చేస్తుంది. info

• بيان جرائم اليهود، كتحريفهم كلام الله، وسوء أدبهم مع رسوله صلى الله عليه وسلم، وتحاكمهم إلى غير شرعه سبحانه.
యూదుల నేరాల ప్రకటన ఉదాహరణకు అల్లాహ్ వాక్కును వారు వక్రీకరించటం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వారి చెడు ప్రవర్తన మరియు అల్లాహ్ ధర్మం కాకుండా ఇతర వాటి వైపు తమ నిర్ణయాలు తీసుకోవటం. info

• بيان خطر الشرك والكفر، وأنه لا يُغْفر لصاحبه إذا مات عليه، وأما ما دون ذلك فهو تحت مشيئة الله تعالى.
షిర్క్ మరియు కుఫ్ర్ యొక్క ప్రమాద ప్రకటన. మరియు దాన్ని పాల్పడిన వాడు అదే స్థితిలో మరణిస్తే మన్నించబడడు. ఇక అవి కాకుండా వేరేవి మహోన్నతుడైన అల్లాహ్ ఇచ్ఛ క్రిందకు వస్తాయి. info