Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
155 : 4

فَبِمَا نَقْضِهِمْ مِّیْثَاقَهُمْ وَكُفْرِهِمْ بِاٰیٰتِ اللّٰهِ وَقَتْلِهِمُ الْاَنْۢبِیَآءَ بِغَیْرِ حَقٍّ وَّقَوْلِهِمْ قُلُوْبُنَا غُلْفٌ ؕ— بَلْ طَبَعَ اللّٰهُ عَلَیْهَا بِكُفْرِهِمْ فَلَا یُؤْمِنُوْنَ اِلَّا قَلِیْلًا ۪۟

అయితే వారు తమపై ఉన్న ఖచ్చితమైన ప్రమాణమును భంగపరచటం వలన మరియు అల్లాహ్ ఆయతుల పట్ల వారి తిరస్కారము వలన మరియు దైవ ప్రవక్తలను హతమార్చటంపై వారి దుస్సాహసం వలన మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మా హృదయములపై మూతలు ఉన్నాయి మీరు చెప్పేది అవి గుర్తుపెట్టుకోవు అని వారి పలకటం వలన మేము వారిని మా కారుణ్యము నుండి దూరం చేశాము. వారు చెబుతున్నట్లు విషయం కాదు. కాని అల్లాహ్ వారి అవిశ్వాసం వలన వారి హృదయములపై సీలు వేశాడు వాటి వరకు మేలు చేరదు. వారు తమకు ప్రయోజనం కలిగించని కొద్దిపాటి విశ్వాసమును మాత్రమే కలిగి ఉన్నారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• عاقبة الكفر الختم على القلوب، والختم عليها سبب لحرمانها من الفهم.
అవిశ్వాసం యొక్క పర్యవసానం హృదయాలపై ముద్ర మరియు వాటిపై ముద్ర వారిని అవగాహన లేకుండా చేయడానికి ఒక కారణం. info

• بيان عداوة اليهود لنبي الله عيسى عليه السلام، حتى إنهم وصلوا لمرحلة محاولة قتله.
అల్లాహ్ ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాం పట్ల యూదుల శతృత్వము యొక్క ప్రకటన చివరికి వారు ఆయనను హతమార్చటానికి ప్రయత్నం చేసే స్థాయికి చేరిపోయారు. info

• بيان جهل النصارى وحيرتهم في مسألة الصلب، وتعاملهم فيها بالظنون الفاسدة.
క్రైస్తవుల యొక్క అజ్ఞానం మరియు శిలువ వేసిన విషయంలో వారి గందరగోళం మరియు ఆ విషయంలో చెడు అపోహలతో వారి వ్యవహారము యొక్క ప్రకటన. info

• بيان فضل العلم، فإن من أهل الكتاب من هو متمكن في العلم حتى أدى به تمكنه هذا للإيمان بالنبي محمد صلى الله عليه وسلم.
జ్ఞానం యొక్క ప్రాముఖ్యత యొక్క ప్రకటన, ఎందుకంటే గ్రంధవహుల్లోంచి జ్ఞానంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఈ సామర్థ్యం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించటానికి దారితీసింది. info