Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
12 : 36

اِنَّا نَحْنُ نُحْیِ الْمَوْتٰی وَنَكْتُبُ مَا قَدَّمُوْا وَاٰثَارَهُمْ ؔؕ— وَكُلَّ شَیْءٍ اَحْصَیْنٰهُ فِیْۤ اِمَامٍ مُّبِیْنٍ ۟۠

నిశ్ఛయంగా మేము ప్రళయదినమున లెక్క తీసుకోవటం కొరకు వారిని మరల లేపటం ద్వారా మృతులను జీవింపజేస్తాము. మరియు ఇహలోక వారి జీవితంలో వారు చేసుకున్న సత్కర్మలను,దుష్కర్మలను మేము వ్రాస్తాము. మరియు వారి కొరకు ఉండే వారు మరణించిన తరువాత మిగిలిన వారి చిహ్నము కొనసాగే దానము (సదఖే జారియ) లాంటి సత్కర్మ లేదా అవిశ్వాసం లాంటి దుష్కర్మను వ్రాస్తాము. మరియు నిశ్ఛయంగా మేము ప్రతీ దాన్ని ఒక స్పష్టమైన గ్రంధంలో వ్రాసి ఉంచాము. అది లౌహె మహ్ఫూజ్. info
التفاسير:
Benefits of the verses in this page:
• العناد مانع من الهداية إلى الحق.
మొండితనము సత్యం వైపునకు మార్గం పొందటం నుండి ఆటంకమును కలిగిస్తుంది. info

• العمل بالقرآن وخشية الله من أسباب دخول الجنة.
ఖుర్ఆన్ ప్రకారం ఆచరించటం మరియు అల్లాహ్ భయము స్వర్గములో ప్రవేశించటం యొక్క కారకముల్లోంచివి. info

• فضل الولد الصالح والصدقة الجارية وما شابههما على العبد المؤمن.
విశ్వాసపరుడైన దాసునిపై పుణ్య సంతానము,కొనసాగే దానము మరియు వాటి లాంటి యొక్క అనుగ్రహము. info