Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
64 : 3

قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ تَعَالَوْا اِلٰی كَلِمَةٍ سَوَآءٍ بَیْنَنَا وَبَیْنَكُمْ اَلَّا نَعْبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشْرِكَ بِهٖ شَیْـًٔا وَّلَا یَتَّخِذَ بَعْضُنَا بَعْضًا اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِ ؕ— فَاِنْ تَوَلَّوْا فَقُوْلُوا اشْهَدُوْا بِاَنَّا مُسْلِمُوْنَ ۟

ఓ ప్రవక్తా! ఇలా ప్రకటించండి : “గ్రంథ ప్రజలలోని యూదులు మరియు క్రైస్తవులారా! రండి, న్యాయమైన మరియు మనందరి కొరకు సమానమైన ఒక స్వచ్ఛమైన పదంపై మనమందరం ఏకీభవిద్దాము. అదేమిటంటే, మనం కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుదాము. మరియు ఆయనతో పాటు ఎవ్వరినీ ఆరాధించకుండా ఉందాము. అలాంటి వారి స్థితి, అంతస్తు, హోదా ఎంత గొప్పగా ఉన్నా సరే; మరియు అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ కు సాటిగా వేరొకరిని మనం ఆరాధించే మరియు అనుసరించే ప్రభువులుగా చేసుకోకుండా ఉందాము”. ఒకవేళ మీరు వారిని పిలుస్తున్న సత్యం మరియు న్యాయం నుండి మరలిపోతే, ఓ విశ్వాసులారా! వారితో ఇలా చెప్పండి - మేము అల్లాహ్ కు సమర్పించుకున్నామని మరియు ఆయనకు విధేయులుగా ఉన్నామని మీరు సాక్ష్యులుగా ఉండండి. info
التفاسير:
Benefits of the verses in this page:
• أن الرسالات الإلهية كلها اتفقت على كلمة عدل واحدة، وهي: توحيد الله تعالى والنهي عن الشرك.
దైవ సందేశాలన్నీ ఒకే ఒక ముఖ్యాంశాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి – అది అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ప్రకటించడం మరియు అల్లాహ్ తో భాగస్వాములు కల్పించడాన్ని నిషేధించడం. info

• أهمية العلم بالتاريخ؛ لأنه قد يكون من الحجج القوية التي تُرَدُّ بها دعوى المبطلين.
చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే కొన్నిసార్లు అది తప్పుడు వాదనలు తిరస్కరించడానికి ఋజువుగా ఉపయోగించబడుతుంది. info

• أحق الناس بإبراهيم عليه السلام من كان على ملته وعقيدته، وأما مجرد دعوى الانتساب إليه مع مخالفته فلا تنفع.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం యొక్క విశ్వాసాలు మరియు ధార్మిక సిద్ధాంతాలను నమ్మేవారే అతనికి చెందిన వారని ప్రకటించు కోవడానికి అత్యంత అర్హులు. కేవలం అతనికి చెందిన వారమని వాదిస్తూ, అతనికి వ్యతిరేకంగా విశ్వసించడం, ఆచరించడం వలన ఎలాంటి ఉపయోగమూ ఉండదు. info

• دَلَّتِ الآيات على حرص كفرة أهل الكتاب على إضلال المؤمنين من هذه الأمة حسدًا من عند أنفسهم.
గ్రంథప్రజలలోని అవిశ్వాసులు తమ ఈర్ష్యాసూయాల కారణంగా ఈ సమాజంలోని విశ్వాసులను తప్పుదోవ పట్టించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారని ఈ ఆయతులు సూచిస్తున్నాయి. info