Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
38 : 3

هُنَالِكَ دَعَا زَكَرِیَّا رَبَّهٗ ۚ— قَالَ رَبِّ هَبْ لِیْ مِنْ لَّدُنْكَ ذُرِّیَّةً طَیِّبَةً ۚ— اِنَّكَ سَمِیْعُ الدُّعَآءِ ۟

అల్లాహ్ ఆమెకు (మర్యంకు) అసాధారణంగా ప్రసాదిస్తున్న ఆహారాన్ని చూసిన తరువాత, తను ముసలివాడైనప్పటికీ మరియు తన భార్య గొడ్రాలు అయినప్పటికీ, తప్పకుండా అల్లాహ్ తనకు కూడా బిడ్డను ప్రసాదిస్తాడనే ఆశ ప్రవక్త జకరియ్యాలో చిగురించింది. అప్పుడు జకరియ్యా అల్లాహ్ తో ఇలా మొరపెట్టుకున్నాడు, “ఓ ప్రభూ! నాకు మంచి బిడ్డను ప్రసాదించు. నిన్ను అర్థించే వాని ప్రార్థన నీవు తప్పకుండా వింటావు మరియు నీకు నా పరిస్థితి బాగా తెలుసు”. info
التفاسير:
Benefits of the verses in this page:
• عناية الله تعالى بأوليائه، فإنه سبحانه يجنبهم السوء، ويستجيب دعاءهم.
చెడుపనుల నుండి రక్షించడం ద్వారా మరియు వారి ప్రార్థనలకు స్పందించడం ద్వారా అల్లాహ్ తన స్నేహితుల పట్ల చాలా ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు మరియు వారి ప్రార్థనలకు స్పందిస్తాడు. info

• فَضْل مريم عليها السلام حيث اختارها الله على نساء العالمين، وطهَّرها من النقائص، وجعلها مباركة.
ఇస్లాం ధర్మంలో మర్యం కొరకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఎందుకంటే ఇతర స్త్రీలందరిపై అల్లాహ్ ఆమెను ఎంచుకున్నాడు, అన్నీరకాల లోపాల నుండి ఆమెను శుద్ధి చేసాడు మరియు ఆమెను శుభదాయకంగా చేశాడు. info

• كلما عظمت نعمة الله على العبد عَظُم ما يجب عليه من شكره عليها بالقنوت والركوع والسجود وسائر العبادات.
అల్లాహ్ తన దాసుడిపై ఎంత ఎక్కువగా అనుగ్రహిస్తే, అతడు అంత ఎక్కువగా అల్లాహ్ కు కృతజ్ఞతలు చూపాలి విధేయత చూపుతూ,రుకూ,సజదా మరియు అన్ని ఆరాధనలు చేస్తూ. info

• مشروعية القُرْعة عند الاختلاف فيما لا بَيِّنة عليه ولا قرينة تشير إليه.
ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు, పరిష్కారం కోసం ఎలాంటి ఆధారం, సూచన లభించక పోతే, లాట్లు తీయడం ద్వారా పరిష్కరించడాన్ని పవిత్ర చట్టం ఆమోదిస్తున్నది. info