Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
89 : 2

وَلَمَّا جَآءَهُمْ كِتٰبٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ ۙ— وَكَانُوْا مِنْ قَبْلُ یَسْتَفْتِحُوْنَ عَلَی الَّذِیْنَ كَفَرُوْا ۚ— فَلَمَّا جَآءَهُمْ مَّا عَرَفُوْا كَفَرُوْا بِهٖ ؗ— فَلَعْنَةُ اللّٰهِ عَلَی الْكٰفِرِیْنَ ۟

మరియు ఎప్పుడైతే తౌరాతులో మరియు ఇంజీలులో ఉన్న సాధారణమైన సరైన నియమములకు అనుగుణంగా ఉండే దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు వచ్చినదో మరియు వారు దాని అవతరణకు మునుపు ఇలా పలికే వారు : మేము ముష్రికులపై విజయం సాధిస్తాము, మరియు ఒక ప్రవక్తను పంపినప్పుడు అది మనకు తెరవబడుతుంది, కాబట్టి మనం ఆయనను విశ్వసించి ఆయనను అనుసరిస్తాము. ఎప్పుడైతే వారి వద్దకు వారికి తెలిసిన గుణములు కల ఖుర్ఆన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారికి తెలిసిన సత్యము వచ్చినదో వారు దాన్ని తిరస్కరించారు. అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించే వారిపై అల్లాహ్ శాపము కురియుగాక. info
التفاسير:
Benefits of the verses in this page:
• اليهود أعظم الناس حسدًا؛ إذ حملهم حسدهم على الكفر بالله وردِّ ما أنزل، بسبب أن الرسول صلى الله عليه وسلم لم يكن منهم.
యూదులు ప్రజల్లోకెల్ల పెద్ద అసూయపరులు అందుకనే వారి అసూయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో నుంచి కాక పోవటం వలన అల్లాహ్ పట్ల అవిశ్వాసం పై మరియు ఆయన అవతరించిన దాన్ని ఖండించటం పై పురిగొల్పింది. info

• أن الإيمان الحق بالله تعالى يوجب التصديق بكل ما أَنزل من كتب، وبجميع ما أَرسل من رسل.
అల్లాహ్ పై సత్యవిశ్వాసం ఆయన అవతరింపజేసిన గ్రంధములన్నింటిని మరియు ఆయన పంపించిన ప్రవక్తలందరిని దృవీకరించటమును అనివార్యం చేస్తుంది. info

• من أعظم الظلم الإعراض عن الحق والهدى بعد معرفته وقيام الأدلة عليه.
పెద్ద దుర్మార్గముల్లో ఒకటి సత్యాన్ని,మార్గదర్శకత్వమును తెలుసుకున్న తరువాత దాని నుండి విముఖత చూపటం మరియు దానికి వ్యతిరేకంగా ఆధారాలను ఏర్పాటు చేయటం. info

• من عادة اليهود نقض العهود والمواثيق، وهذا ديدنهم إلى اليوم.
ఒప్పొందాలను,ప్రమాణములను విచ్ఛిన్నం చేయటం యూదుల అలవాటులలో ఒకటి. మరియు ఇది ఈ రోజు వరకు వారి అలవాటుగానే ఉన్నది. info