Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
79 : 2

فَوَیْلٌ لِّلَّذِیْنَ یَكْتُبُوْنَ الْكِتٰبَ بِاَیْدِیْهِمْ ۗ— ثُمَّ یَقُوْلُوْنَ هٰذَا مِنْ عِنْدِ اللّٰهِ لِیَشْتَرُوْا بِهٖ ثَمَنًا قَلِیْلًا ؕ— فَوَیْلٌ لَّهُمْ مِّمَّا كَتَبَتْ اَیْدِیْهِمْ وَوَیْلٌ لَّهُمْ مِّمَّا یَكْسِبُوْنَ ۟

ఎవరైతే తమ చేతులతో పుస్తకమును వ్రాసి ఆ తరువాత ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని అబద్దమును పలుతుతున్నారో వారి కొరకు వినాశనము మరియు కఠినమైన శిక్ష నిరీక్షిస్తున్నది. వారు సత్యమునకు మరియు సన్మార్గమును అనుసరించటమునకు బదులుగా ధనము,రాజ్యము లాంటి ఇహలోకంలో అల్పమైన ధరను ఆశిస్తున్నారు. తమ చేతులారా వ్రాసి దాన్ని అల్లాహ్ వద్ద నుండి అని అబద్దమును కల్పించటం పై వారి కొరకు వినాశనము మరియు కఠినమైన శిక్ష కలదు. దీని వెనుక వారు సంపాదించిన సంపద మరియు రాజ్యమునకు బదులుగా వారి కొరకు వినాశనము మరియు కఠినమైన శిక్ష కలదు. info
التفاسير:
Benefits of the verses in this page:
• بعض أهل الكتاب يدّعي العلم بما أنزل الله، والحقيقة أن لا علم له بما أنزل الله، وإنما هو الوهم والجهل.
కొంత మంది గ్రంధవహులు అల్లాహ్ అవతరింపజేసిన వాటి గురించి జ్ఞానమున్నదని వాదిస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ అవతరించిన వాటి గురించి వారికి జ్ఞానం లేదు. అది భ్రమ,అజ్ఞానం మాత్రమే. info

• من أعظم الناس إثمًا من يكذب على الله تعالى ورسله ؛ فينسب إليهم ما لم يكن منهم.
ప్రజల్లోంచి పెద్ద పాపాత్ముడు ఎవడంటే అతడే మహోన్నతుడైన అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై అబద్ధము పలికి వారిలో నుంచి కాని వాటిని వారికి ఆపాదించువాడు. info

• مع عظم المواثيق التي أخذها الله تعالى على اليهود وشدة التأكيد عليها، لم يزدهم ذلك إلا إعراضًا عنها ورفضًا لها.
మహోన్నతుడైన అల్లాహ్ యూదులతో పెద్ద ప్రమాణాలు తీసుకుని వాటి గురించి కఠినంగా తాకీదు చేసినా కూడా అవి వారికి వాటి నుండి విముఖతను మరియు తిరస్కారమును మాత్రమే అధికం చేసినవి. info