Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
31 : 2

وَعَلَّمَ اٰدَمَ الْاَسْمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَی الْمَلٰٓىِٕكَةِ فَقَالَ اَنْۢبِـُٔوْنِیْ بِاَسْمَآءِ هٰۤؤُلَآءِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

మరియు ఆదం(అలైహిస్సలాం) యొక్క ఘనతను తెలియజేయటానికి అల్లాహ్ సమస్త జంతువుల మరియు సమస్త వస్తువుల,పదార్ధాల పేర్లను,వాటి అర్ధాలను నేర్పించాడు. తరువాత వాటిని దైవదూతల ముందు ప్రదర్శించి:ఒక వేళ మీరు ఈ (మానవ) సృష్టి కన్నా ఉత్తములన్న మీ ప్రతిపాదనలో సత్యవంతులైతే వీటి పేర్లను తెలపండి అని అన్నాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• الواجب على المؤمن إذا خفيت عليه حكمة الله في بعض خلقه وأَمْرِهِ أن يسلِّم لله في خلقه وأَمْرِهِ.
ఒక విశ్వాసిపై అల్లాహ్ యొక్క సృష్టితాల మరియు ఆదేశాల పరమార్ధం తెలియనప్పుడు వాటి సృష్టిని మరియు ఆదేశాలను శిరసావహించటం తప్పనిసరి. info

• رَفَعَ القرآن الكريم منزلة العلم، وجعله سببًا للتفضيل بين الخلق.
దివ్యఖుర్ఆన్ జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని పెంచింది.మరియు జ్ఞానాన్ని సృష్టిరాశులలో గౌరవ ప్రతిష్టతలకు కొలమానంగా పరిగణించింది. info

• الكِبْرُ هو رأس المعاصي، وأساس كل بلاء ينزل بالخلق، وهو أول معصية عُصِيَ الله بها.
గర్వమే ప్రతి అవిధేయతకు మూలం మరియు సృష్టిరాశులపై అవతరించే ప్రతి ఆపదకు మూలకారకం మరియు ఇదే అల్లాహ్ విషయంలో అవిధేయతకు పాల్పడిన మొట్టమొదటి నేరం. info