Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
276 : 2

یَمْحَقُ اللّٰهُ الرِّبٰوا وَیُرْبِی الصَّدَقٰتِ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ كُلَّ كَفَّارٍ اَثِیْمٍ ۟

అల్లాహ్ వడ్డీని సమూలంగా నాశనం చేయడం ద్వారా లేదా దానిలో నుండి తన దీవెనలను తొలగించడం ద్వారా దానిని తుడిచి వేస్తాడు. అయితే, ఆయన దానధర్మాల ప్రతిఫలాన్ని పెంచుతాడు. ఆయన వారి దానధర్మాల ప్రతిఫలాన్ని పది రెట్ల నుండి ఏడు వందల రెట్లు లేదా అంతకంటే ఎక్కువ మోతాదుకు పెంచుతాడు మరియు తమ సంపదలో నుండి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసేవారిని ఆశీర్వదిస్తాడు. అల్లాహ్ నిషేధించిన వాటిని చట్టబద్ధమైనవిగా భావించే మరియు నిరంతరం పాపాలలో కొనసాగే మొండి, మూర్ఖపు అవిశ్వాసిని అల్లాహ్ అస్సలు ఇష్టపడడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• من أعظم الكبائر أكل الربا، ولهذا توعد الله تعالى آكله بالحرب وبالمحق في الدنيا والتخبط في الآخرة.
అత్యంత తీవ్రమైన ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం వడ్డీ తినడం. ఈ కారణంగా, అల్లాహ్ వడ్డీ తినే వాడిని యుద్ధానికి,ఇహలోకంలో నష్టానికి మరియు పరలోకంలో గందరగోళానికి గురి కావడానికి తయారుగా ఉండమని హెచ్చరించాడు. info

• الالتزام بأحكام الشرع في المعاملات المالية ينزل البركة والنماء فيها.
వ్యాపార లావాదేవీలలో పవిత్ర షరీఅహ్ చట్టాన్ని అనుసరిస్తే, అల్లాహ్ యొక్క ఆశీర్వాదం మరియు వృద్ధి లభిస్తుంది. info

• فضل الصبر على المعسر، والتخفيف عنه بالتصدق عليه ببعض الدَّين أو كله.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిపై సహనం చూపడం మరియు అతనికి ఇచ్చిన అప్పును పాక్షికంగా లేదా పూర్తిగా క్షమించడం ద్వారా అతనికి సౌలభ్యాన్ని కలగ జేయడం అనేది ఒక ఉత్తమమైన ఆచరణ. info