Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
268 : 2

اَلشَّیْطٰنُ یَعِدُكُمُ الْفَقْرَ وَیَاْمُرُكُمْ بِالْفَحْشَآءِ ۚ— وَاللّٰهُ یَعِدُكُمْ مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟

షైతాను మిమ్మల్ని పేదరికానికి భయపడేలా చేసి, పిసినారితనం వైపు ప్రేరేపిస్తాడు. ఇంకా వాడు మిమ్మల్ని పాపకార్యాల వైపు ఆహ్వానిస్తాడు. మరోవైపు అల్లాహ్ మీ పాపాలు క్షమిస్తానని మరియు మరింత ఉపాధి ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ ఎంతో ఔదార్యము గలవాడు మరియు తన దాసుల పరిస్థితి బాగా ఎరిగినవాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• المؤمنون بالله تعالى حقًّا واثقون من وعد الله وثوابه، فهم ينفقون أموالهم ويبذلون بلا خوف ولا حزن ولا التفات إلى وساوس الشيطان كالتخويف بالفقر والحاجة.
అల్లాహ్ ను విశ్వసించే నిజమైన విశ్వాసులు ఆయన వాగ్దానం మరియు ప్రతిఫలం గురించి ఖచ్చితమైన నమ్మకం కలిగి ఉంటారు: వారు తమ సంపదను ఎలాంటి భయం లేదా దుఃఖం లేకుండా,షైతాన్ దుష్ప్రేరణల వైపు చూడకుండా - ఉదాహరణకు పేదరికం,అవసరం గురించి భయపెట్టటం - ఖర్చు చేస్తారు. info

• الإخلاص من أعظم ما يبارك الأعمال ويُنمِّيها.
చిత్తశుద్ధి ఆచరణలలో శుభాలను కలిగించే మరియు వాటిని పెంపొందించే గొప్ప సాధనం. info

• أعظم الناس خسارة من يرائي بعمله الناس؛ لأنه ليس له من ثواب على عمله إلا مدحهم وثناؤهم.
తన మంచి పనులను, పుణ్యకార్యాలను ప్రజల ముందు ప్రదర్శించే వ్యక్తి అందరి కంటే ఎక్కువగా నష్టపోతాడు. ఎందుకంటే అతనికి లభించే ప్రతిఫలం కేవలం ప్రజల ప్రశంసలు మాత్రమే. info