Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

Page Number:close

external-link copy
19 : 14

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ ؕ— اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ وَیَاْتِ بِخَلْقٍ جَدِیْدٍ ۟ۙ

ఓ మానవుడా అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని సత్యముతో సృష్టించాడని నీకు తెలియదా ?. అయితే ఆయన ఆ రెండింటిని వృధాగా సృష్టించ లేదు. ఓ ప్రజలారా ఒక వేళ ఆయన మిమ్మల్ని నసింపజేసి మీకు బదులుగా ఆయనను ఆరాధించే మరియు ఆయనపై విధేయత చూపే ఇతర సృష్టిని తీసుకుని రాదలచుకుంటే ఆయన మిమ్మల్ని నసింపజేసి ఆయనను ఆరాధించే మరియు ఆయనపై విధేయత చూపే ఇతర సృష్టిని తీసుకుని వస్తాడు.అప్పుడు ఆ విషయం ఆయనపై సులభమైనది మరియు తేలికైనది. info
التفاسير:

external-link copy
20 : 14

وَّمَا ذٰلِكَ عَلَی اللّٰهِ بِعَزِیْزٍ ۟

మరియు మిమ్మల్ని తుదిముట్టించి ఇతరులను సృష్టించి తీసుకుని రావటం పరిశుద్ధుడైన ఆయనను అశక్తుడిని చేయదు. ఆయన ప్రతీ దానిపై సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏది అశక్తుడిని చేయదు. info
التفاسير:

external-link copy
21 : 14

وَبَرَزُوْا لِلّٰهِ جَمِیْعًا فَقَالَ الضُّعَفٰٓؤُا لِلَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا مِنْ عَذَابِ اللّٰهِ مِنْ شَیْءٍ ؕ— قَالُوْا لَوْ هَدٰىنَا اللّٰهُ لَهَدَیْنٰكُمْ ؕ— سَوَآءٌ عَلَیْنَاۤ اَجَزِعْنَاۤ اَمْ صَبَرْنَا مَا لَنَا مِنْ مَّحِیْصٍ ۟۠

వాగ్ధానం చేయబడిన దినమున (ప్రళయదినాన) ప్రజలంతా తమ సమాదుల నుండి బయటకు వచ్చి అల్లాహ్ వైపునకు తరలి వెళుతారు. అప్పుడు బలహీనులైన అనుచరులు నాయకులతో,పెద్దవారితో ఇలా అంటారు : ఓ నాయకులారా నిశ్చయంగా మేము మీ ఆదేశాలను పాటించి,మీరు వారించిన వాటిని విడనాడి మిమ్మల్ని అనుసరించాము. అయితే మీరు అల్లాహ్ శిక్షను కొద్దిగైనా మా నుండి దూరం చేయగలరా ?. నాయకులు,పెద్దవారు ఇలా పలుకుతారు : ఒక వేళ అల్లాహ్ మాకు సన్మార్గమును ప్రసాధించి ఉంటే మేము మిమ్మల్ని దాని మార్గదర్శకం చేసేవారము. అప్పుడు మనమందరము అతని శిక్ష నుండి బ్రతికి బయటపడే వాళ్ళము. కాని మేము మార్గభ్రష్టులయ్యాము,మరియు మేము మిమ్మల్ని మార్గ భ్రష్టుల్ని చేశాము. మేము శిక్షను మోయటం నుండి బలహీన పడటం లేదా సహనం చూపటం మాపై మీపై ఒక్కటే. శిక్ష నుండి పారిపోయే ప్రదేశం ఏదీ మన కొరకు లేదు. info
التفاسير:

external-link copy
22 : 14

وَقَالَ الشَّیْطٰنُ لَمَّا قُضِیَ الْاَمْرُ اِنَّ اللّٰهَ وَعَدَكُمْ وَعْدَ الْحَقِّ وَوَعَدْتُّكُمْ فَاَخْلَفْتُكُمْ ؕ— وَمَا كَانَ لِیَ عَلَیْكُمْ مِّنْ سُلْطٰنٍ اِلَّاۤ اَنْ دَعَوْتُكُمْ فَاسْتَجَبْتُمْ لِیْ ۚ— فَلَا تَلُوْمُوْنِیْ وَلُوْمُوْۤا اَنْفُسَكُمْ ؕ— مَاۤ اَنَا بِمُصْرِخِكُمْ وَمَاۤ اَنْتُمْ بِمُصْرِخِیَّ ؕ— اِنِّیْ كَفَرْتُ بِمَاۤ اَشْرَكْتُمُوْنِ مِنْ قَبْلُ ؕ— اِنَّ الظّٰلِمِیْنَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

మరియు స్వర్గ వాసులు స్వర్గములో,నరక వాసులు నరకంలో ప్రవేశించేటప్పుడు ఇబ్లీసు (షైతాను) ఇలా అంటాడు : నిశ్చయంగా అల్లాహ్ మీకు సత్యమైన వాగ్ధానం చేశాడు. అయితే ఆయన మీకు చేసిన వాగ్ధానమును పూర్తి చేశాడు. మరియు నేను మీకు అసత్యమైన వాగ్ధానము చేశాను. మరియు నేను మీకు చేసిన వాగ్ధానమును పూర్తి చేయలేదు. మరియు నేను మిమ్మల్ని ఇహలోకంలో అవిశ్వాసముపై,అప మార్గముపై బలవంతం చేయటానికి నాకు ఎటువంటి శక్తి ఉండేది కాదు. కాని నేను మిమ్మల్ని అవిశ్వాసం వైపునకు పిలిచాను. మరియు నేను మీ కొరకు అవిధేయ కార్యాలను అలంకరించి చూపాను. అప్పుడు మీరు నన్ను అనుసరించటంలో తొందరపడ్డారు. అయితే మీరు మీకు కలిగిన అప మార్గమునకు నన్ను నిదించకండి,మీరు మిమ్మల్నే నిందించుకోండి. అది నిందించుకోవాటానికి సరైనది. నేను మీ నుండి శిక్షను తొలగించడానికి మీకు సహాయపడలేను. మరియు మీరు నా నుండి దాన్ని తొలగించటానికి నన్ను సహాయపడలేరు. నిశ్చయంగా నేను మీరు నన్ను ఆరాధనలో అల్లాహ్ తోపాటు సాటి కల్పించటమును తిరస్కరిస్తున్నాను. నిశ్చయంగా ఇహలోకంలో అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం ద్వారా మరియు ఆయనను అవిశ్వసించటం ద్వారా దుర్మార్గమునకు పాల్పడిన వారి కొరకు బాధాకరమైన శిక్ష ప్రళయదినాన వారి కొరకు నిరీక్షిస్తుంది. info
التفاسير:

external-link copy
23 : 14

وَاُدْخِلَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا بِاِذْنِ رَبِّهِمْ ؕ— تَحِیَّتُهُمْ فِیْهَا سَلٰمٌ ۟

దుర్మార్గుల పరిణామముకు విరుద్ధంగా విశ్వసించి సత్కర్మలు చేసుకున్న వారిని భవనముల,వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహించే స్వర్గ వనాల్లో ప్రవేశింపబడటం జరుగుతుంది. వారు వాటిలో తమ ప్రభువు ఆదేశముతో మరియు అతని చుట్టు ఎల్లప్పుడు శాస్వతంగా ఉంటారు. వారు ఒకరినొకరు సలాం చేసుకుంటూ పలకరించుకుంటారు. మరియు దైవదూతలు వారిని సలాం తో పలకరిస్తారు.మరియు పరిశుద్ధుడైన వారి ప్రభువు మీకు శాంతి కలగు గాక అని ఆహ్వానిస్తాడు. info
التفاسير:

external-link copy
24 : 14

اَلَمْ تَرَ كَیْفَ ضَرَبَ اللّٰهُ مَثَلًا كَلِمَةً طَیِّبَةً كَشَجَرَةٍ طَیِّبَةٍ اَصْلُهَا ثَابِتٌ وَّفَرْعُهَا فِی السَّمَآءِ ۟ۙ

ఓ ప్రవక్తా కలిమయె తౌహీద్ అయిన (ఏకేశ్వర వాక్యము అయిన) లా ఇలాహ ఇల్లల్లాహ్ ను తన మంచి వ్రేళ్ళతో నీళ్ళను త్రాగుతూ భూమి లోపల పాతుకు పోయిన మంచి చెట్టైన ఖర్జూరపు చెట్టుతో అల్లాహ్ ఎలా పోల్చాడో మీకు తెలియదా. మరియు దాని శాఖలు ఎత్తుగా ఆకాశము వైపునకు ఎదిగి మంచును త్రాగుతుంటాయి మరియు మంచి గాలిని పీలుస్తుంటాయి. info
التفاسير:
Benefits of the verses in this page:
• بيان سوء عاقبة التابع والمتبوع إن اجتمعا على الباطل.
అనుసరించేవాడు మరియు అనుసరించబడేవాడి చెడ్డ పరిణామం ప్రకటన ఒక వేళ వారు అసత్యంపై కలిసి వస్తే. info

• بيان أن الشيطان أكبر عدو لبني آدم، وأنه كاذب مخذول ضعيف، لا يملك لنفسه ولا لأتباعه شيئًا يوم القيامة.
షైతాను ఆదమ్ సంతతి కొరకు పెద్ద శతృవు అని మరియు అతడు అబద్దపరుడు,పరాభవం పాలయ్యేవాడు,బలహీనుడు అని,తన స్వయం కొరకు,తనను అనుసరించే వారి కొరకు ప్రళయదినాన దేని అధికారం ఉండదని ప్రకటన. info

• اعتراف إبليس أن وعد الله تعالى هو الحق، وأن وعد الشيطان إنما هو محض الكذب.
మహోన్నతుడైన అల్లాహ్ వాగ్ధానం సత్యమైనదని మరియు షైతాను వాగ్ధానము కేవలం అసత్యమైనదని ఇబ్లీసు ప్రకటన. info

• تشبيه كلمة التوحيد بالشجرة الطيبة الثمر، العالية الأغصان، الثابتة الجذور.
ఏకేశ్వర వాదం (తౌహీద్) పదమును స్థిర వ్రేళ్ళు,ఎత్తైన కొమ్మలు,మంచి ఫలాలు కల చెట్టుతో పోల్చబడింది. info