Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
110 : 11

وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ فَاخْتُلِفَ فِیْهِ ؕ— وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَقُضِیَ بَیْنَهُمْ ؕ— وَاِنَّهُمْ لَفِیْ شَكٍّ مِّنْهُ مُرِیْبٍ ۟

మరియు నిశ్చయంగా మేము మూసాకు తౌరాత్ ను ప్రసాధించాము.అయితే ప్రజలు అందులో విభేధించుకున్నారు.మరియు వారిలో కొందరు దాన్ని విశ్వసించారు మరికొందరు తిరస్కరించారు. ఒకవేళ అల్లాహ్ ఏదైన వివేకము వలన శిక్షను తొందరగా విధించకుండా ప్రళయదినం వరకు దాన్ని వెనుకకు చేయాలని నిర్ణయం ముందే చేసి ఉండకపోతే వారికి విధించవలసిన శిక్షను ఇహలోకములోనే విధించేవాడు.మరియు నిశ్చయంగా యూదుల్లోంచి అవిశ్వాసపరులు మరియు ముష్రికులు ఖుర్ఆన్ విషయంలో సందేహములో,సంశయములో పడి ఉన్నారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• وجوب الاستقامة على دين الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ ధర్మం పై నిలకడ చూపటం అనివార్యము. info

• التحذير من الركون إلى الكفار الظالمين بمداهنة أو مودة.
దుర్మార్గులైన అవిశ్వాసపరుల వైపు నునుపుదనముతో లేదా వాత్సల్యముతో మొగ్గు చూపటం నుండి హెచ్చరిక. info

• بيان سُنَّة الله تعالى في أن الحسنة تمحو السيئة.
సత్కార్యము దుష్కార్యమును తుడిచివేయటములో మహోన్నతుడైన అల్లాహ్ సాంప్రదాయం ప్రకటన. info

• الحث على إيجاد جماعة من أولي الفضل يأمرون بالمعروف، وينهون عن الفساد والشر، وأنهم عصمة من عذاب الله.
మంచిని ఆదేశించే మరియు చెడు నుండి,అల్లకల్లోలము నుండి వారించే ఉన్నతమైన వారి ఒక వర్గము ఉండటం పై ప్రోత్సాహం.మరియు నిశ్చయంగా వారు అల్లాహ్ శిక్ష నుండి రక్షణ లాంటి వారు. info