Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
75 : 10

ثُمَّ بَعَثْنَا مِنْ بَعْدِهِمْ مُّوْسٰی وَهٰرُوْنَ اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ بِاٰیٰتِنَا فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا مُّجْرِمِیْنَ ۟

ఆ పిదప ఈ ప్రవక్తలందరి తరువాత చాలా కాలం తరువాత మేము మిసర్ రాజైన ఫిర్ఔన్,అతని జాతి పెద్ద నాయకుల వద్దకు మూసాను,అతని సోధరుడైన హారూన్ ను పంపించినాము.వారిద్దరి నిజాయితీని దృవీకరించే ఆయతులను ఇచ్చి మేము వారిద్దరిని పంపించాము.వారిద్దరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి వారందరు దురఅహంకారమును చూపారు.అల్లాహ్ పట్ల వారి తిరస్కారము,ఆయన ప్రవక్తల పట్ల వారి తిరస్కారం వలన వారందరు అపరాదులైపోయారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• سلاح المؤمن في مواجهة أعدائه هو التوكل على الله.
విశ్వాసపరుడు తన శతృవులను ఎదుర్కోవటంలో అతని ఆయుధము అది అల్లాహ్ పై నమ్మకము. info

• الإصرار على الكفر والتكذيب بالرسل يوجب الختم على القلوب فلا تؤمن أبدًا.
అవిశ్వాసము పై మొండి వైఖరి,ప్రవక్తలపట్ల తిరస్కారము హృదయాలపై ముద్రను అనివార్యము చేస్తుంది.అవి (హృదయములు) ఎన్నటికి విశ్వసించవు. info

• حال أعداء الرسل واحد، فهم دائما يصفون الهدى بالسحر أو الكذب.
ప్రవక్తల శతృవుల స్థితి ఒక్కటే.వారందరు ఎల్లప్పుడు సన్మార్గమును మంత్రజాలముతో లేదా అసత్యముతో పోల్చుతారు. info

• إن الساحر لا يفلح أبدًا.
నిశ్ఛయంగా మాంత్రికుడు ఎన్నటికీ సాఫల్యం చెందడు. info