[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
[2] ఖుర్ఆన్ అవతరణలో, అవతరించిన మొదటి బీజ అక్షరం ఇది 'నూన్,'. ఈ అక్షరం ముఖ'త్త'ఆత్ లోనిది.
[3] అల్-ఖలమ్: చూడండి, 96:3-5. కొందరు: ఇక్కడ ప్రమాణం చేసే కలం, అంటే ఆ మొట్టమొదట సృష్టించబడి, 'విధివ్రాత' వ్రాయమని ఆజ్ఞాపించబడిన కలము, అని చెబుతారు, సునన్ తిర్మి'జీ - అల్బానీ ప్రమాణీకం (త'స్హీ'హ్).
[1] అంటే అల్లాహ్ (సు.తా.) నీకు ఆదేశించిన మార్గం (ఇస్లాం)లో నీవు ఉన్నావు. దీని మరొక భావం నీవు మొదటి నుండియే ఉత్తమమైన గుణగణాలు గలవాడవు, సత్యసంధుడవు. 'ఆయి'షహ్ (ర.'అన్హా)తో దైవప్రవక్త ('స'అస) యొక్క గుణగణాలు మరియు ప్రవర్తనను గురించి ప్రశ్నించగా ఆమె (ర.'అన్హా) అన్నారు: " 'ఖులుఖుహూ ఖుర్ఆన్" అంటే అతని గుణగణాలు ఖుర్ఆన్ కు ప్రతిరూపాలు, ('స.ముస్లిం).
[1] కొందరు వ్యాఖ్యాతలు ఇక్కడ తస్బీ'హ్ అంటే : ఇన్షా 'అల్లాహ్ - అల్లాహ్ కోరితే! అని అనటమని వ్యాఖ్యానించారు.
[1] ఖుర్ఆన్ అవతరణాక్రమంలో ముస్లిం పదం ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చింది. ముస్లిం అంటే అల్లాహ్ (సు.తా.)కు విధేయుడై, ఆయన (సు.తా.) ఆజ్ఞాపించిన ఏకదైవ సిద్ధాంతంపై ఉండి, ఆరాధనను కేవలం ఆయన (సు.తా.)కే ప్రత్యేకించుకొని, ఆరాధనలో ఎవ్వరినీ కూడా ఆయన (సు.తా.)కు సాటిగా నిలబెట్టకుండా ఉండేవాడు. తనను తాను కేవలం అల్లాహ్ (సు.తా.) దాస్యానికి మాత్రమే అంకితం చేసుకున్నవాడు. దీని మూల పదం సలాం, అంటే శాంతి.
[1] యూనుస్ ('అ.స.) యొక్క వివరాల కోసం చూడండి, 21:87 మరియు 37:140.
[1] దీని మరొక తాత్పర్యం ఇలా ఉంది: "ఒకవేళ అతనిపై అతని ప్రభువు (సు.తా.) అనుగ్రహమే గనక లేకుంటే! నిశ్చయంగా, అతను అవమానకరమైన స్థితిలో బంజరు మైదానంలో విసరివేయబడేవాడు." మరొక వ్యాఖ్యానం: "అల్లాహ్ (సు.తా.) అతనికి పశ్చాత్తాపపడే సద్బుద్ధి గనక ఇవ్వకుండా ఉంటే మరియు అతని ప్రార్థన అంగీకరించబడకుండా ఉంటే అతను సముద్రపు అంచున వేయబడకుండా ఉంటే - ఎక్కడైతే అతనికి ఆహారం ఇచ్చాడో మరియు తీగ పెంచాడో - బంజరు భూమిలో విసిరివేయబడి ఉండేవాడు. మరియు అల్లాహ్ (సు.తా.) వద్ద అతని పరిస్థితి అవమానకరమైనదై ఉండేది. కాని అతని ప్రార్థన అంగీకరించబడిన తరువాత అతను అనుగ్రహించబడ్డాడు." ఇంకా చూడండి, 37:143.
[1] ఒకవేళ నీకు అల్లాహ్ (సు.తా.) రక్షణయే గనక లేకుంటా! వారిదిష్టి నీకు తగిలేది. (ఇబ్నె-కసీ'ర్). ఇబ్నె-కసీ'ర్ ఇంకా ఇలా వ్రాసారు. దిష్టి తగలటం మరియు అల్లాహ్ (సు.తా.) అనుమతితో దానివల్ల నష్టం కలగటం నిజమే. కావున 'హదీస్' లలో దీని నుండి విముక్తి పొందటానికి దు'ఆలు ఇవ్వబడ్డాయి మరియు ఈ సలహాలు కూడా ఇవ్వబడ్డాయి : ఏదైనా మంచి వస్తువును చూస్తే దిష్టి తగలకుండా ఉండటానికి : 'మాషా అల్లాహ్' లేక 'బారకల్లాహ్' అనాలి. ఒకవేళ దిష్టి తగిలితే : దిష్టి పెట్టినవాడు ఒక పాత్రలో స్నానం చేసి ఆ నీటిని దిష్టి తగిలినవాడి మీద పోయాలి. (ఇబ్నె-కసీ'ర్).