Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad

Nummer der Seite:close

external-link copy
65 : 5

وَلَوْ اَنَّ اَهْلَ الْكِتٰبِ اٰمَنُوْا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَلَاَدْخَلْنٰهُمْ جَنّٰتِ النَّعِیْمِ ۟

మరియు వాస్తవానికి గ్రంథ ప్రజలు విశ్వసించి, దైవభీతి కలిగి వుంటే! నిశ్చయంగా, మేము వారి పాపాలను తొలగించి, వారిని శ్రేష్ఠమైన స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము. info
التفاسير:

external-link copy
66 : 5

وَلَوْ اَنَّهُمْ اَقَامُوا التَّوْرٰىةَ وَالْاِنْجِیْلَ وَمَاۤ اُنْزِلَ اِلَیْهِمْ مِّنْ رَّبِّهِمْ لَاَكَلُوْا مِنْ فَوْقِهِمْ وَمِنْ تَحْتِ اَرْجُلِهِمْ ؕ— مِنْهُمْ اُمَّةٌ مُّقْتَصِدَةٌ ؕ— وَكَثِیْرٌ مِّنْهُمْ سَآءَ مَا یَعْمَلُوْنَ ۟۠

మరియు వాస్తవానికి వారు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు వారి ప్రభువు తరఫు నుండి వారిపై (ఇప్పుడు) అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించి ఉండినట్లైతే, వారి కొరకు వారిపై (ఆకాశం) నుండి మరియు కాళ్ళ క్రింది నుండి (భూమి నుండి) జీవనోపాధి పొందేవారు.[1] వారిలో కొందరు సరైన మార్గాన్ని అవలంబించే వారున్నారు.[2] కాని వారిలో అనేకులు చేసేవి చెడు (పాప) కార్యాలే! info

[1] చూడండి, 7:96. [2] 'అబ్దుల్లాహ్ బిన్ సల్లాం మరికొందరు 8-9 మంది మదీనాలోని యూదులు మాత్రమే విశ్వసించారు.

التفاسير:

external-link copy
67 : 5

یٰۤاَیُّهَا الرَّسُوْلُ بَلِّغْ مَاۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ ؕ— وَاِنْ لَّمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَالَتَهٗ ؕ— وَاللّٰهُ یَعْصِمُكَ مِنَ النَّاسِ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الْكٰفِرِیْنَ ۟

ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి.[1] మరియు నీవట్టు చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు. info

[1] 'ఆయి'షహ్ (ర.'అన్హా) కథనం : "ఏ వ్యక్తి అయినా ము'హమ్మద్ ('స'అస) వ'హీ నుండి ఏమైనా దాచారు." అని సందేహపడితే ఆ వ్యక్తి నిశ్చయంగా, అసత్యం పలికాడు. ('స'హీ'హ్ బు'ఖారీ, 'హ. నం. 4855).

التفاسير:

external-link copy
68 : 5

قُلْ یٰۤاَهْلَ الْكِتٰبِ لَسْتُمْ عَلٰی شَیْءٍ حَتّٰی تُقِیْمُوا التَّوْرٰىةَ وَالْاِنْجِیْلَ وَمَاۤ اُنْزِلَ اِلَیْكُمْ مِّنْ رَّبِّكُمْ ؕ— وَلَیَزِیْدَنَّ كَثِیْرًا مِّنْهُمْ مَّاۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ طُغْیَانًا وَّكُفْرًا ۚ— فَلَا تَاْسَ عَلَی الْقَوْمِ الْكٰفِرِیْنَ ۟

ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించనంత వరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!" మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని మరియు సత్యతిరస్కారాన్ని మాత్రమే పెంచుతుంది.[1] కావున నీవు సత్యతిరస్కార ప్రజలను గురించి విచారించకు. info

[1] చూడండి, 41:44 మరియు 17:82.

التفاسير:

external-link copy
69 : 5

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَادُوْا وَالصّٰبِـُٔوْنَ وَالنَّصٰرٰی مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟

నిశ్చయంగా, ఈ (గ్రంథాన్ని) విశ్వసించిన వారు (ముస్లింలు) మరియు యూదులు మరియు సాబీయూలు మరియు క్రైస్తవులు, ఎవరైనా సరే అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తే, సత్కార్యాలు చేస్తే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా.[1] info

[1] చూడండి, 2:62 మరియు 3:85.

التفاسير:

external-link copy
70 : 5

لَقَدْ اَخَذْنَا مِیْثَاقَ بَنِیْۤ اِسْرَآءِیْلَ وَاَرْسَلْنَاۤ اِلَیْهِمْ رُسُلًا ؕ— كُلَّمَا جَآءَهُمْ رَسُوْلٌۢ بِمَا لَا تَهْوٰۤی اَنْفُسُهُمْ ۙ— فَرِیْقًا كَذَّبُوْا وَفَرِیْقًا یَّقْتُلُوْنَ ۟ۗ

వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారి నుండి ఒక గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము మరియు వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని ఏ ప్రవక్త అయినా వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని తెచ్చినపుడల్లా, వారు కొందరిని అసత్యవాదులని తిరస్కరించారు, మరి కొందరిని హత్య చేశారు. info
التفاسير: