Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad

Nummer der Seite:close

external-link copy
48 : 43

وَمَا نُرِیْهِمْ مِّنْ اٰیَةٍ اِلَّا هِیَ اَكْبَرُ مِنْ اُخْتِهَا ؗ— وَاَخَذْنٰهُمْ بِالْعَذَابِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟

మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన (ఆయాత్), దానికి ముందు చూపినటువంటి దాని (అద్భుత సూచన) కంటే మించినదిగా ఉండేది.[1] మరియు మేము వారిని శిక్షకు గురి చేశాము. బహుశా, ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని![2] info

[1] అద్భుత సూచనల కోసం చూడండి, 7:133-135.
[2] అల్లాహ్ (సు.తా.) వైపునకు మరలటం మానవుడు అల్లాహ్ (సు.తా.) ఉనికిని గ్రహించే స్వాభావిక లక్షణం. కాని మానవుడు అల్లాహ్ (సు.తా.) నుండి మరలిపోవటం అతని మానసిక పతనం, ఆధ్యాత్మిక భ్రష్టత్వం. చూడండి, 7:172-173.

التفاسير:

external-link copy
49 : 43

وَقَالُوْا یٰۤاَیُّهَ السّٰحِرُ ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَ ۚ— اِنَّنَا لَمُهْتَدُوْنَ ۟

మరియు వారు (మూసాతో) ఇలా అన్నారు: "ఓ మాంత్రికుడా! (నీ ప్రభువు) నీతో చేసిన ఒప్పందం ప్రకారం నీ ప్రభువును ప్రార్థించు, మేము తప్పక సన్మార్గులమవుతాము." info
التفاسير:

external-link copy
50 : 43

فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الْعَذَابَ اِذَا هُمْ یَنْكُثُوْنَ ۟

కాని మేము వారి పై నుండి ఆ శిక్షను తొలగించిన వెంటనే వారు తమ వాగ్దానాన్ని భంగపరచే వారు. info
التفاسير:

external-link copy
51 : 43

وَنَادٰی فِرْعَوْنُ فِیْ قَوْمِهٖ قَالَ یٰقَوْمِ اَلَیْسَ لِیْ مُلْكُ مِصْرَ وَهٰذِهِ الْاَنْهٰرُ تَجْرِیْ مِنْ تَحْتِیْ ۚ— اَفَلَا تُبْصِرُوْنَ ۟ؕ

మరియు, ఫిర్ఔన్ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈజిప్టు (మిస్ర్) యొక్క సామ్రాజ్యాధిపత్యం నాది కాదా? మరియు ఈ సెలయేళ్ళు నా క్రింద ప్రవహించటం లేదా? ఇది మీకు కనిపించటం లేదా? info
التفاسير:

external-link copy
52 : 43

اَمْ اَنَا خَیْرٌ مِّنْ هٰذَا الَّذِیْ هُوَ مَهِیْنٌ ۙ۬— وَّلَا یَكَادُ یُبِیْنُ ۟

ఈ తుచ్ఛమైన వాడు మరియు (తన మాటను) స్పష్టంగా వివరించలేని వాడి (మూసా) కంటే నేను శ్రేష్ఠుడిని కానా?[1] info

[1] మూసా('అ.స.) సరిగ్గా మాట్లాడలేక పోయేవారు. నత్తినత్తిగా మాట్లాడే వారు (Stammer). దానికి చూడండి, 20:27-28.

التفاسير:

external-link copy
53 : 43

فَلَوْلَاۤ اُلْقِیَ عَلَیْهِ اَسْوِرَةٌ مِّنْ ذَهَبٍ اَوْ جَآءَ مَعَهُ الْمَلٰٓىِٕكَةُ مُقْتَرِنِیْنَ ۟

అయితే ఇతనికి బంగారు కంకణాలు ఎందుకు వేయబడలేదు? లేదా, ఇతనికి తోడుగా ఇతనితో పాటు దేవదూతలు ఎందుకు రాలేదు?"[1] info

[1] ప్రాచీన కాలంలో ఈజిప్టులో బంగారు కంకణాలు, మెడలో బంగారు ఆభరణాలు పెద్దరికాన్ని సూచించేవి. (ఆదికాండము-Genesis, 12:42) అంటే మూ'సా ('అ.స.) అల్లాహ్ (సు.తా.) సందేశహరుడైతే అల్లాహ్ (సు.తా.), అతనికి, అతని గొప్పతనానికి తగినట్లు బంగారు ఆభరణాలు, కంకణాలు, ఎందుకు ప్రసాదించలేదు? ఇదే విధమైన ప్రశ్నలు ముష్రిక్ ఖురైషులు దైవప్రవక్త ('స'అస) ను కూడా అడిగారు.

التفاسير:

external-link copy
54 : 43

فَاسْتَخَفَّ قَوْمَهٗ فَاَطَاعُوْهُ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ ۟

ఈ విధంగా, అతడు (ఫిర్ఔన్) తన జాతి వారిని ప్రేరేపింప జేయటం వలన వారు అతనిని అనుసరించారు. నిశ్చయంగా వారు దుర్జనులు (ఫాసిఖీన్). info
التفاسير:

external-link copy
55 : 43

فَلَمَّاۤ اٰسَفُوْنَا انْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ اَجْمَعِیْنَ ۟ۙ

ఈ విధంగా, వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల మేము వారికి ప్రతీకారం చేశాము. మరియు వారందరినీ ముంచి వేశాము. info
التفاسير:

external-link copy
56 : 43

فَجَعَلْنٰهُمْ سَلَفًا وَّمَثَلًا لِّلْاٰخِرِیْنَ ۟۠

ఇక మేము, వారిని తర్వాత వచ్చే వారి కొరకు ఒక గడిచిన నిదర్శనంగా మరియు ఒక ఉదాహరణగా చేశాము. info
التفاسير:

external-link copy
57 : 43

وَلَمَّا ضُرِبَ ابْنُ مَرْیَمَ مَثَلًا اِذَا قَوْمُكَ مِنْهُ یَصِدُّوْنَ ۟

మరియు మర్యమ్ కుమారుడు ఒక ఉదాహరణగా పేర్కొనబడినప్పుడు (ఓ ముహమ్మద్!) నీ జాతి ప్రజలు అతనిని గురించి కేకలు వేస్తారు. info
التفاسير:

external-link copy
58 : 43

وَقَالُوْۤا ءَاٰلِهَتُنَا خَیْرٌ اَمْ هُوَ ؕ— مَا ضَرَبُوْهُ لَكَ اِلَّا جَدَلًا ؕ— بَلْ هُمْ قَوْمٌ خَصِمُوْنَ ۟

మరియు అంటారు: "మా దేవుళ్ళు మంచివా లేక అతడా (ఈసానా)?" వారు ఈ విషయం నీ ముందు పెట్టేది కేవలం జగడమాడటానికే. వాస్తవానికి వారు కలహ ప్రియులైన జనులు. info
التفاسير:

external-link copy
59 : 43

اِنْ هُوَ اِلَّا عَبْدٌ اَنْعَمْنَا عَلَیْهِ وَجَعَلْنٰهُ مَثَلًا لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ

అతను (ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహిచాము. మరియు మేము అతనిని ఇస్రాయీల్ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము. info
التفاسير:

external-link copy
60 : 43

وَلَوْ نَشَآءُ لَجَعَلْنَا مِنْكُمْ مَّلٰٓىِٕكَةً فِی الْاَرْضِ یَخْلُفُوْنَ ۟

మరియు మేము కోరితే మీకు బదులుగా, దేవదూతలను భూమిపై ఉత్తరాధికారులుగా చేసే వారము. info
التفاسير: