Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad

Nummer der Seite:close

external-link copy
11 : 42

فَاطِرُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— جَعَلَ لَكُمْ مِّنْ اَنْفُسِكُمْ اَزْوَاجًا وَّمِنَ الْاَنْعَامِ اَزْوَاجًا ۚ— یَذْرَؤُكُمْ فِیْهِ ؕ— لَیْسَ كَمِثْلِهٖ شَیْءٌ ۚ— وَهُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟

ఆయనే ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయన మీలో నుండే మీ కొరకు జంటల్ని మరియు పశువులలో కూడా జంటల్ని చేశాడు. [1] ఈ విధంగా, ఆయన మిమ్మల్ని వ్యాపింప జేస్తున్నాడు. ఆయనకు పోలింది ఏదీ లేదు. [2] మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. info

[1] చూడండి, 16:72.
[2] చూఆయన (సు.తా.) తో పోల్చదగినది విశ్వంలో ఏదీ లేదు. చూడండి, 6:100, 112:4.

التفاسير:

external-link copy
12 : 42

لَهٗ مَقَالِیْدُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ ؕ— اِنَّهٗ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟

ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క తాళపు చెవులు ఆయన వద్దనే వున్నాయి. ఆయన తాను కోరిన వానికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వానికి) దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయనకు ప్రతిదానిని గురించి బాగా తెలుసు. info
التفاسير:

external-link copy
13 : 42

شَرَعَ لَكُمْ مِّنَ الدِّیْنِ مَا وَصّٰی بِهٖ نُوْحًا وَّالَّذِیْۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ وَمَا وَصَّیْنَا بِهٖۤ اِبْرٰهِیْمَ وَمُوْسٰی وَعِیْسٰۤی اَنْ اَقِیْمُوا الدِّیْنَ وَلَا تَتَفَرَّقُوْا فِیْهِ ؕ— كَبُرَ عَلَی الْمُشْرِكِیْنَ مَا تَدْعُوْهُمْ اِلَیْهِ ؕ— اَللّٰهُ یَجْتَبِیْۤ اِلَیْهِ مَنْ یَّشَآءُ وَیَهْدِیْۤ اِلَیْهِ مَنْ یُّنِیْبُ ۟ؕ

ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని [1] మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు. [2] info

[1] అద్దీను: ధర్మం అంటే అల్లాహ్ (సు.తా.) ను విశ్వసించి ఆయన అద్వితీయాన్ని నమ్మి, ఆయన ప్రవక్తలను అనుసరించి, ఆయన షరీయత్ పై నడవటం. ప్రవక్తలందరి ధర్మం ఇదే! చూడండి, 2:213. కాని వారి షరీయత్ లలో కొన్ని భేదాలుండవచ్చు. (చూడండి, 5:48) అందుకే దైవప్రవక్త ('స'అస) అన్నారు : 'మేము (ప్రవక్తలం) అంతా సోదరులం. మా అందరి ధర్మం ఒక్కటే ఇస్లాం!' ('స'హీ'హ్ బు'ఖారీ)
[2] అల్లాహ్ (సు.తా.) అతనికే మార్గదర్శకత్వం చేస్తాడు, ఎవడైతే స్వయంగా, అల్లాహ్ (సు.తా.) వైపునకు మరలుతాడో ! ఇక ఎవడైతే మార్గభ్రష్టత్వాన్ని ఎన్నుకుంటాడో, ఆయన, అతనిని దానిలో వదలుతాడు. అల్లాహ్ (సు.తా.) దృష్టిలో, ఆయనకు విధేయత (ఇస్లాం) మాత్రమే నిజమైన ధర్మం. చూడండి, 3:19, 3:85, 21:92 చూడండి, 23:52.

التفاسير:

external-link copy
14 : 42

وَمَا تَفَرَّقُوْۤا اِلَّا مِنْ بَعْدِ مَا جَآءَهُمُ الْعِلْمُ بَغْیًا بَیْنَهُمْ ؕ— وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی لَّقُضِیَ بَیْنَهُمْ ؕ— وَاِنَّ الَّذِیْنَ اُوْرِثُوا الْكِتٰبَ مِنْ بَعْدِهِمْ لَفِیْ شَكٍّ مِّنْهُ مُرِیْبٍ ۟

మరియు వారి వద్దకు (సత్య) జ్ఞానం వచ్చిన తరువాతనే - వారి పరస్పర ద్వేషం వల్ల - వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. మరియు ఒక నిర్ణీత కాలపు వాగ్దానం నీ ప్రభువు తరపు నుండి చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. [1] మరియు నిశ్చయంగా, వారి తర్వాత గ్రంథాన్ని వారసత్వంలో పొందిన వారు దానిని (ఇస్లాంను) గురించి గొప్ప సంశయంలో పడి ఉన్నారు. info

[1] చూడండి, 10:19.

التفاسير:

external-link copy
15 : 42

فَلِذٰلِكَ فَادْعُ ۚ— وَاسْتَقِمْ كَمَاۤ اُمِرْتَ ۚ— وَلَا تَتَّبِعْ اَهْوَآءَهُمْ ۚ— وَقُلْ اٰمَنْتُ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ مِنْ كِتٰبٍ ۚ— وَاُمِرْتُ لِاَعْدِلَ بَیْنَكُمْ ؕ— اَللّٰهُ رَبُّنَا وَرَبُّكُمْ ؕ— لَنَاۤ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْ ؕ— لَا حُجَّةَ بَیْنَنَا وَبَیْنَكُمْ ؕ— اَللّٰهُ یَجْمَعُ بَیْنَنَا ۚ— وَاِلَیْهِ الْمَصِیْرُ ۟ؕ

కావున నీవు (ఓ ముహమ్మద్!) దీని (ఈ సత్యధర్మం) వైపునకే వారిని పిలువు. మరియు నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు. మరియు వారి కోరికలను అనుసరించకు. మరియు వారితో ఇలా అను: "అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నే నేను విశ్వసించాను. మరియు మీ మధ్య న్యాయం చేయమని నేను ఆజ్ఞాపించబడ్డాను. అల్లాహ్ యే మా ప్రభువు! మరియు మీ ప్రభువు కూడాను, మా కర్మలు మాకూ మరియు మీ కర్మలు మీకూ, మా మధ్య మరియు మీ మధ్య ఎలాంటి వివాదం ఉండనవసరం లేదు. అల్లాహ్ మనందరినీ సమావేశపరుస్తాడు. మరియు ఆయన వైపే (మనందరి) గమ్యస్థానముంది." info
التفاسير: