Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad

ఫుశ్శిలత్

external-link copy
1 : 41

حٰمٓ ۟ۚ

హా - మీమ్[1]. info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
2 : 41

تَنْزِیْلٌ مِّنَ الرَّحْمٰنِ الرَّحِیْمِ ۟ۚ

దీని (ఈ ఖుర్ఆన్) అవతరణ అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత తరఫు నుండి జరిగింది. info
التفاسير:

external-link copy
3 : 41

كِتٰبٌ فُصِّلَتْ اٰیٰتُهٗ قُرْاٰنًا عَرَبِیًّا لِّقَوْمٍ یَّعْلَمُوْنَ ۟ۙ

ఇదొక గ్రంథం, దీని సూచనలు (ఆయాత్) తెలివి గలవారి కొరకు, అరబ్బీ [1] భాషలో స్పష్టమైన ఉపన్యాసంగా (ఖుర్ఆన్ గా) వివరించబడ్డాయి. info

[1] చూడండి, 12:2.

التفاسير:

external-link copy
4 : 41

بَشِیْرًا وَّنَذِیْرًا ۚ— فَاَعْرَضَ اَكْثَرُهُمْ فَهُمْ لَا یَسْمَعُوْنَ ۟

(స్వర్గపు) శుభవార్తనిచ్చేదిగా మరియు హెచ్చరించేదిగా; అయినా చాలా మంది దీని పట్ల విముఖత చూపుతున్నారు, కాబట్టి వారు వినటం లేదు. info
التفاسير:

external-link copy
5 : 41

وَقَالُوْا قُلُوْبُنَا فِیْۤ اَكِنَّةٍ مِّمَّا تَدْعُوْنَاۤ اِلَیْهِ وَفِیْۤ اٰذَانِنَا وَقْرٌ وَّمِنْ بَیْنِنَا وَبَیْنِكَ حِجَابٌ فَاعْمَلْ اِنَّنَا عٰمِلُوْنَ ۟

మరియు వారు ఇలా అన్నారు: "నీవు దేనివైపునకైతే మమ్మల్ని పిలుస్తున్నావో, దాని పట్ల మా హృదయాల మీద తెరలు కప్పబడి ఉన్నాయి; మరియు మా చెవులలో చెవుడు ఉంది మరియు నీకూ మాకూ మధ్య ఒక అడ్డు తెర ఉంది; [1] కావున నీవు నీ పని చేయి, మేము మా పని చేస్తాము." info

[1] చూడండి, 7:46, 6:25.

التفاسير:

external-link copy
6 : 41

قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ فَاسْتَقِیْمُوْۤا اِلَیْهِ وَاسْتَغْفِرُوْهُ ؕ— وَوَیْلٌ لِّلْمُشْرِكِیْنَ ۟ۙ

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "నిశ్చయంగా నేను కూడా మీలాంటి ఒక మానవుణ్ణి మాత్రమే! [1] నాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: 'నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు, ఒకే ఒక్క దేవుడు (అల్లాహ్); కావున మీరు నేరుగా ఆయన వైపునకే మరలండి మరియు ఆయననే క్షమాపణకై వేడుకోండి.' " మరియు ఆయన (అల్లాహ్) కు సాటి కల్పించే వారికి వినాశం ఉంది. info

[1] చూడండి, 6:50.

التفاسير:

external-link copy
7 : 41

الَّذِیْنَ لَا یُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ كٰفِرُوْنَ ۟

వారికి, ఎవరైతే విధిదానం (జకాత్) ఇవ్వరో మరియు పరలోకాన్ని తిరస్కరిస్తారో! [1] info

[1] అ'జ్జకాతు: మదీనాలో 2వ హిజ్రీలో విధిగా నియమించబడింది. కావున ఇక్కడ 'జకాత్ అంటే దానం. మొదట ఉదయం మరియు సాయంత్రం రెండు నమాజులు విధిగా చేయబడి ఉండేవి. హిజ్ రత్ కు ఒకటిన్నర సంవత్సరం ముందు మే'రాజ్ లో ఐదు నమా'జ్ లు విధిగా చేయబడ్డాయి. (ఇబ్నె-కసీ'ర్).

التفاسير:

external-link copy
8 : 41

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ اَجْرٌ غَیْرُ مَمْنُوْنٍ ۟۠

నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారికి ఎడతెగని ప్రతిఫలం (స్వర్గం) ఉంటుంది. info
التفاسير:

external-link copy
9 : 41

قُلْ اَىِٕنَّكُمْ لَتَكْفُرُوْنَ بِالَّذِیْ خَلَقَ الْاَرْضَ فِیْ یَوْمَیْنِ وَتَجْعَلُوْنَ لَهٗۤ اَنْدَادًا ؕ— ذٰلِكَ رَبُّ الْعٰلَمِیْنَ ۟ۚ

వారితో ఇలా అను: "ఏమీ? మీరు, భూమిని రెండు రోజులలో సృష్టించిన ఆయన (అల్లాహ్) ను తిరస్కరించి, ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా? సర్వలోకాలకు పోషకుడు ఆయనే కదా?" [1] info

[1] సృష్టిని ఆరు రోజులలో సృష్టించాడు. చూడండి, 7:54.

التفاسير:

external-link copy
10 : 41

وَجَعَلَ فِیْهَا رَوَاسِیَ مِنْ فَوْقِهَا وَبٰرَكَ فِیْهَا وَقَدَّرَ فِیْهَاۤ اَقْوَاتَهَا فِیْۤ اَرْبَعَةِ اَیَّامٍ ؕ— سَوَآءً لِّلسَّآىِٕلِیْنَ ۟

మరియు ఆయన దానిలో (భూమిలో) దాని పైనుండి స్థిరమైన పర్వతాలను నెలకొలిపాడు [1] మరియు అందులో శుభాలను అనుగ్రహించాడు మరియు అర్థించేవారి కొరకు, వారి అవసరాలకు సరిపోయేటట్లు జీవనోపాధిని సమకూర్చాడు, ఇదంతా నాలుగు రోజులలో పూర్తి చేశాడు. info

[1] భూమిలో నుండి పర్వతాలను పుట్టించి వాటిని దానిపై నాటాడు, భూమి కదలిపోకుండా.

التفاسير:

external-link copy
11 : 41

ثُمَّ اسْتَوٰۤی اِلَی السَّمَآءِ وَهِیَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْاَرْضِ ائْتِیَا طَوْعًا اَوْ كَرْهًا ؕ— قَالَتَاۤ اَتَیْنَا طَآىِٕعِیْنَ ۟

అప్పుడే [1] ఆయన కేవలం పొగగా [2] ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరల్చి, దానిని మరియు భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు: "మీరిద్దరు (ఉనికిలోకి) రండి మీకు ఇష్టమున్నా, ఇష్టం లేక పోయినా!" అవి రెండూ: "మేమిద్దరమూ విధేయులమై (ఉనికిలోకి) వస్తాము." అని అన్నాయి. info

[1] సు'మ్మ: 'అరబ్బీ భాషలో ఒకే విషయాన్ని బోధించే రెండు వాక్యాలను కలుపుటకు గూడా ఈ శబ్దం సు'మ్మ వాడబడుతోంది. ఇక్కడ వాడబడినట్లు.
[2] దఖానున్: పొగ, ఇది హైడ్రోజన్ గ్యాస్ కావచ్చు. దీని నుండియే ప్రపంచంలోని మూలపదార్థాలు (Elements) అన్నీ రూపొందించబడ్డాయి. చూడండి, 2:29.

التفاسير: