Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad

Nummer der Seite:close

external-link copy
67 : 40

هُوَ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ یُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ثُمَّ لِتَكُوْنُوْا شُیُوْخًا ۚ— وَمِنْكُمْ مَّنْ یُّتَوَفّٰی مِنْ قَبْلُ وَلِتَبْلُغُوْۤا اَجَلًا مُّسَمًّی وَّلَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟

ఆయనే, మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. [1] తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత పిండంతో (రక్తముద్దతో), ఆ తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. ఆ తరువాత మిమ్మల్ని యుక్తవయస్సులో బలం గలవారిగా చేస్తాడు; చివరకు మిమ్మల్ని ముసలివారిగా మార్చుతాడు. మీలో కొందరు దీనికి ముందే చనిపోతారు. మరియు మీరంతా మీ నియమిత కాలం వరకే నివసిస్తారు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని (ఇదంతా మీకు వివరించబడుతోంది). info

[1] చూడండి, 3:59, 11:61, 22:5, 30:20. ఈ ఆయత్ లో, 'తురాబ్' తో సృష్టించాడని ఉంది.

التفاسير:

external-link copy
68 : 40

هُوَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ ۚ— فَاِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟۠

జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! ఆయన ఏదైనా చేయాలనుకున్నప్పుడు, కేవలం దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే అది ఆయిపోతుంది. info
التفاسير:

external-link copy
69 : 40

اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ ؕ— اَنّٰی یُصْرَفُوْنَ ۟ۙۛ

ఏమీ? నీకు తెలియదా? అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) గురించి వాదులాడేవారు ఏ విధంగా (సత్యం నుండి) తప్పించబడుతున్నారో? info
التفاسير:

external-link copy
70 : 40

الَّذِیْنَ كَذَّبُوْا بِالْكِتٰبِ وَبِمَاۤ اَرْسَلْنَا بِهٖ رُسُلَنَا ۛ۫— فَسَوْفَ یَعْلَمُوْنَ ۟ۙ

ఎవరైతే ఈ గ్రంథాన్ని అసత్యమని తిరస్కరించారో మరియు మేము మా సందేశహరులకు ఇచ్చి పంపిన దానిని (తిరస్కరించారో), వారు తప్పక త్వరలోనే (తమ పర్యవసానం) తెలుసుకుంటారు; info
التفاسير:

external-link copy
71 : 40

اِذِ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ وَالسَّلٰسِلُ ؕ— یُسْحَبُوْنَ ۟ۙ

ఎప్పుడైతే వారి మెడలలో సంకెళ్ళు [1] (ఇనుప పట్టీలు) మరియు గొలుసులు వేయబడతాయో మరియు వారు ఈడ్చబడతారో! info

[1] మెడలలో సంకెళ్ళ - కొరకు, చూడండి, 13:5, 34:33 మరియు 36:8.

التفاسير:

external-link copy
72 : 40

فِی الْحَمِیْمِ ۙ۬— ثُمَّ فِی النَّارِ یُسْجَرُوْنَ ۟ۚ

సలసలకాగే నీళ్ళలోకి; తరువాత నరకాగ్నిలోకి కాల్చబడటానికి. info
التفاسير:

external-link copy
73 : 40

ثُمَّ قِیْلَ لَهُمْ اَیْنَ مَا كُنْتُمْ تُشْرِكُوْنَ ۟ۙ

అప్పుడు వారితో అనబడుతుంది: "మీరు సాటి కల్పించే (భాగస్వాములు) ఇప్పుడు ఎక్కడున్నారు? info
التفاسير:

external-link copy
74 : 40

مِنْ دُوْنِ اللّٰهِ ؕ— قَالُوْا ضَلُّوْا عَنَّا بَلْ لَّمْ نَكُنْ نَّدْعُوْا مِنْ قَبْلُ شَیْـًٔا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ الْكٰفِرِیْنَ ۟

(ఎవరినైతే) మీరు అల్లాహ్ ను వదలి (ప్రార్థిస్తూ ఉన్నారో)!" వారంటారు: "వారు మమ్మల్ని త్యజించారు! అలా కాదు దీనికి పూర్వం మేము ఎవరినీ ప్రార్థించేవారమే కాదు." [1] ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారులను మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. info

[1] చూడండి, 6:23.

التفاسير:

external-link copy
75 : 40

ذٰلِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَمْرَحُوْنَ ۟ۚ

(వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు అన్యాయంగా, భూమిలో విర్రవీగుతూ ఉన్నందుకు మరియు దురభిమానంతో ప్రవర్తించినందుకూ! info
التفاسير:

external-link copy
76 : 40

اُدْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ— فَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟

(కావున ఇప్పుడు) నరక ద్వారాలలో ప్రవేశించండి, అందులో శాశ్వతంగా ఉండటానికి. దురహంకారంతో ప్రవర్తించిన వారి నివాస స్థలం ఎంత దుర్భరమైనది!" info
التفاسير:

external-link copy
77 : 40

فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ ۚ— فَاِمَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِلَیْنَا یُرْجَعُوْنَ ۟

కావున (ఓ ప్రవక్తా!) నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం. మేము వారికి చేసిన వాగ్దానాల (శిక్ష) నుండి కొంత నీకు చూపినా! లేదా (దానికి ముందు) నిన్ను మరణింపజేసినా వారందరూ మా వైపునకే కదా మరలింపబడతారు! [1] info

[1] చూడండి, 10:46.

التفاسير: