[1] అల్ - అర్'హాము, ర'హిమున్ యొక్క బహువచనం: అంటే గర్భకోశం. దాని నుండియే బంధుత్వాలు ఏర్పడుతాయి. కాబట్టి: "బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి) మరియు వారి (బంధువుల) హక్కులను చెల్లించండి." అని ఎన్నో హదీసులు ఉన్నాయి. [2] రఖీబున్ (అర్-రఖీబు) : చూడండి, 5:117. The Watcher, Observer, Guardian, Keeper from whom nothing is hidden. పరిశీలకుడు, కనిపెట్కొని ఉండేవాడు. గమనించేవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
[1] ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది: "మీరు వారి (స్త్రీల) మధ్య న్యాయం చేయలేమనే భయం ఉంటే ఒకామెను మాత్రమే వివాహమాడండి." అని. నలుగురి కంటే ఎక్కువ వివాహమాడ కండని మరియు అంత కంటే ఎక్కువ భార్యలను ఏక కాలంలో ఉంచుకోరాదని, దివ్యఖుర్ఆన్ తప్ప, ఇతర ఏ మత గ్రంథంలో కూడా వ్రాయబడ లేదు. అందుకే పూర్వకాలంలో చాలా మంది భార్యలు ఉండటం అన్ని ధర్మాల వారి ఆచారమై ఉండెను. ఇంకా ముందు దివ్యఖుర్ఆన్ లో ఇలా చెప్పబడింది: "మీరు ఎంత ప్రయత్నం చేసినా వారి (భార్యల) మధ్య న్యాయం చేయటం చాలా కష్టం అట్టి సమయంలో ఒకామెను పూర్తిగా ఉపేక్షించకండి." (చూడండి 4:129). ఈ విధంగా ఖుర్ఆన్ లో స్త్రీలకు ఇవ్వబడినంత గౌరవం, రక్షణ, హక్కులు ఇతర మత గ్రంథాలలో పేర్కొనబడ లేదు. బానిసత్వాన్ని, బానిసత్వ వ్యాపారాన్ని నిర్మూలిస్తూ, కేవలం యుద్ధఖైదీలను తప్ప ఇతరులను బానిసలుగా ఉంచగూడదని కూడా ఖుర్ఆన్ 1400 సంవత్సరాల ముందు ఆదేశించింది. ముస్లింలు అయిన బానిస స్త్రీలతో వివాహమాడటాన్ని కూడా ప్రోత్సహించింది. చూడండి, 1400 సంవత్సరాల ముందు ఇస్లాంలో మానవహక్కులు (Human Rights) మరియు స్త్రీల హక్కులు ఏ విధంగా రక్షింపబడ్డాయో! [2] చూడండి, 24:32.
[1] చూడండి, 'స. బు'ఖారీ, పు - 3, 'హ. నం. 591.
[1] అల్-'హసీబు : Reckoner, Taker of Accounts, Sufficer, or giver of what is sufficient. లెక్కతీసుకునే, పరిగణించే వాడు. అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 4:86.