Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad

Nummer der Seite: 458:458 close

external-link copy
6 : 39

خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَاَنْزَلَ لَكُمْ مِّنَ الْاَنْعَامِ ثَمٰنِیَةَ اَزْوَاجٍ ؕ— یَخْلُقُكُمْ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ خَلْقًا مِّنْ بَعْدِ خَلْقٍ فِیْ ظُلُمٰتٍ ثَلٰثٍ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— فَاَنّٰی تُصْرَفُوْنَ ۟

ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు. తరువాత అతని నుండి అతని జంట (జౌజ్) ను పుట్టించాడు. [1] మరియు మీ కొరకు ఎనిమిది జతల (ఆడ మగ) పశువులను పుట్టించాడు. [2] ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో మూడు చీకటి తెరలలో ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇచ్చాడు. [3] ఆయనే అల్లాహ్! మీ ప్రభువు. విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాంటప్పుడు మీరు ఎలా (సత్యం నుండి) తప్పించబడుతున్నారు? info

[1] చూడండి, 4:1. 'జౌజ: అంటే, జంట, జత, సహచరి, సహవాసి అనే అర్థాలున్నాయి.
[2] అంటే గొర్రె, మేక, ఆవు మరియు ఒంటె. ఇవ్ ఆడ-మగ కలిసి ఎనిమిది అవుతాయి, వివరాలు 6:143-144లలో వచ్చాయి.
[3] ఈ తెరలు : 1) తల్లి కడుపు (Abdominal Wall), 2) గర్భాశయం (Uterine Wall), 3) మావిపొర (Amniotic Membrane). ఇంకా చూడండి, 22:5, 23:12-14.

التفاسير:

external-link copy
7 : 39

اِنْ تَكْفُرُوْا فَاِنَّ اللّٰهَ غَنِیٌّ عَنْكُمْ ۫— وَلَا یَرْضٰی لِعِبَادِهِ الْكُفْرَ ۚ— وَاِنْ تَشْكُرُوْا یَرْضَهُ لَكُمْ ؕ— وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ؕ— ثُمَّ اِلٰی رَبِّكُمْ مَّرْجِعُكُمْ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ؕ— اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟

ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, నిశ్చయంగా, అల్లాహ్ మీ అక్కరలేని వాడు. [1] మరియు ఆయన తన దాసులు సత్యతిరస్కార వైఖరిని అవలంబించడాన్ని ఇష్ట పడడు. మరియు మీరు కృతజ్ఞులైనట్లయితే ఆయన మీ పట్ల ఎంతో సంతోషపడతాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. [2] చివరకు మీరందరికీ, మీ ప్రభువు వైపునకే మరల వలసి ఉంది! అప్పుడు ఆయన, మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు. info

[1] చూడండి, 14:8.
[2] ఈ వాక్యం ఖుర్ఆన్ లో ఐదుసార్లు వచ్చింది. ఇక్కడ మరియు 6:164, 17:15, 35:18, మరియు 53:38. ఇది : 'ఏసు క్రీస్తు, క్రైస్తవులందరి పాపభారాన్ని భరిస్తారు.' అని క్రైస్తవులు అనే సిద్ధాంతాన్ని ఖండిస్తోంది.

التفاسير:

external-link copy
8 : 39

وَاِذَا مَسَّ الْاِنْسَانَ ضُرٌّ دَعَا رَبَّهٗ مُنِیْبًا اِلَیْهِ ثُمَّ اِذَا خَوَّلَهٗ نِعْمَةً مِّنْهُ نَسِیَ مَا كَانَ یَدْعُوْۤا اِلَیْهِ مِنْ قَبْلُ وَجَعَلَ لِلّٰهِ اَنْدَادًا لِّیُضِلَّ عَنْ سَبِیْلِهٖ ؕ— قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِیْلًا ۖۗ— اِنَّكَ مِنْ اَصْحٰبِ النَّارِ ۟

మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంలో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత ఆయన (అల్లాహ్) అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి నప్పుడు, అతడు పూర్వం దేనిని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచిపోతాడు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించి, (ఇతరులను) ఆయన మార్గం నుండి తప్పిస్తాడు. [1] (అలాంటి వానితో) ఇలా అను: "నీవు, నీ సత్యతిరస్కార వైఖరితో కొంత కాలం సంతోషపడు. నిశ్చయంగా, నీవు నరకవాసుల్లోని వాడవవుతావు!" info

[1] చూడండి, 2:22.

التفاسير:

external-link copy
9 : 39

اَمَّنْ هُوَ قَانِتٌ اٰنَآءَ الَّیْلِ سَاجِدًا وَّقَآىِٕمًا یَّحْذَرُ الْاٰخِرَةَ وَیَرْجُوْا رَحْمَةَ رَبِّهٖ ؕ— قُلْ هَلْ یَسْتَوِی الَّذِیْنَ یَعْلَمُوْنَ وَالَّذِیْنَ لَا یَعْلَمُوْنَ ؕ— اِنَّمَا یَتَذَكَّرُ اُولُوا الْاَلْبَابِ ۟۠

ఏమీ? ఎవడైతే శ్రద్ధతో రాత్రి ఘడియలలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు నిలిచి (నమాజ్) చేస్తూ, పరలోక (జీవిత)మును గురించి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటాడో! (అలాంటి వాడు, అలా చేయని వాడితో సమానుడా)? వారి నడుగు: "ఏమీ? విజ్ఞానులు మరియు అజ్ఞానులు సరిసమానులు కాగలరా? వాస్తవానికి బుద్ధిమంతులే హితబోధ స్వీకరిస్తారు." info
التفاسير:

external-link copy
10 : 39

قُلْ یٰعِبَادِ الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوْا رَبَّكُمْ ؕ— لِلَّذِیْنَ اَحْسَنُوْا فِیْ هٰذِهِ الدُّنْیَا حَسَنَةٌ ؕ— وَاَرْضُ اللّٰهِ وَاسِعَةٌ ؕ— اِنَّمَا یُوَفَّی الصّٰبِرُوْنَ اَجْرَهُمْ بِغَیْرِ حِسَابٍ ۟

(ఓ ముహమ్మద్!) అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని) అను: "ఓ విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైతే ఈ లోకంలో సత్పురుషులై ఉంటారో (వారికి పరలోకంలో) మేలు జరుగుతుంది. మరియు అల్లాహ్ భూమి చాలా విశాలమైనది. [1] నిశ్చయంగా, సహనం వహించిన వారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది." info

[1] పాపం మరియు సత్యతిరస్కారం నుండి - పుణ్యం, సత్యం మరియు అల్లాహ్ (సు.తా.) వైపునకు - మరలే అవకాశం ఎల్లప్పుడూ ఉంది. ఇదే వాస్తవమైన 'హిజ్రత్' వలసపోవటం. ఇంకా చూడండి, 4:97. ఒక వ్యక్తికి తన నివాసస్థలంలో ఉంటూ ఈమాన్ పై ఉండటం దుర్భరమైతే! అతడు ఇతర చోట్లకు హిజ్రత్ చేసి తన ధర్మాన్ని కాపాడుకోవాలి.

التفاسير: