Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad

ఆలె ఇమ్రాన్

external-link copy
1 : 3

الٓمَّٓ ۟ۙۚ

అలిఫ్-లామ్-మీమ్ [1]. info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
2 : 3

اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْحَیُّ الْقَیُّوْمُ ۟ؕ

అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు (నిత్యుడు), విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు[1]. info

[1] చూడండి, 2:255.

التفاسير:

external-link copy
3 : 3

نَزَّلَ عَلَیْكَ الْكِتٰبَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ وَاَنْزَلَ التَّوْرٰىةَ وَالْاِنْجِیْلَ ۟ۙ

ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో నుండి (మిగిలి వున్న సత్యాన్ని) ధృవపరుస్తోంది[1]. మరియు ఆయనే తౌరాత్ ను మరియు ఇంజీలును[2] అవతరింపజేశాడు. info

[1] చూడండి, 5:46, 48, 61:6. [2] ఇక్కడ (ఖుర్ఆన్ లో) పేర్కొనబడిన ఇంజీల్ మరియు తౌరాత్ గ్రంథాలు అంటే 'ఈసా ('అ.స.) మరియు మూసా ('అ.స.) లపై అవతరింపజేయబడిన దివ్యగ్రంథాలు అని అర్థం. ఆ అసలు దివ్యగ్రంథాలు ఇప్పుడు ప్రపంచంలో లేవు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రాచీన బైబిల్ గ్రంథాలు, గ్రీక్ భాషలో ఉన్న బ్రిటీష్ మ్యూజియంలోని Codex Sinaiticus, Codex Alexandrinus మరియు రోమ్ లోని వాటికాన్ లైబ్రరీలో ఉన్న Codex Vaticanus. ఇవి 'ఈసా ('అ.స.) పైకి సజీవులుగా ఎత్తుకోబడిన దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత, గ్రీక్ భాషలో వ్రాయబడ్డాయి. మూసా మరియు 'ఈసా ('అలైహిమ్. స.) లపై అవతరింపజేయబడిన తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాల బాష గ్రీకు కాదు. వారి మతాచారులు / విద్వాంసులు, వాటిలో ఇంత వరకు ఎన్నో సార్లు, ఎన్నో మార్పులు చేస్తూ వచ్చారు. ఈ రోజు వాడుకలో ఉన్న బైబిల్ లలో, ఆ ప్రవక్తల కొన్ని ప్రవచనాలు మరియు అసలు దివ్య ఆవిష్కృతులైన కొన్ని అంసాలు - వారి మతాచారులు / విద్వాంసులు వ్రాసిన రూపంలో - ఉన్నాయి. కాబట్టి దివ్యఖుర్ఆన్ సూచించేది ఆ ప్రవక్తలపై అవతరింపజేయబడిన ప్రవచనాలను మాత్రమే కానీ ఈ రోజు వాడుకలో ఉన్న బైబిల్ (Revised) Authorized Kind James Version ను కాదు. చూడండి, 4:136, 5:47.

التفاسير:

external-link copy
4 : 3

مِنْ قَبْلُ هُدًی لِّلنَّاسِ وَاَنْزَلَ الْفُرْقَانَ ؕ۬— اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِیْدٌ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ ذُو انْتِقَامٍ ۟ؕ

దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు[1]. నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు. info

[1] చూడండి, 2:53.

التفاسير:

external-link copy
5 : 3

اِنَّ اللّٰهَ لَا یَخْفٰی عَلَیْهِ شَیْءٌ فِی الْاَرْضِ وَلَا فِی السَّمَآءِ ۟ؕ

నిశ్చయంగా, భూమిలో గానీ మరియు ఆకాశాలలో గానీ, అల్లాహ్ కు గోప్యంగా ఉన్నది ఏదీ లేదు. info
التفاسير:

external-link copy
6 : 3

هُوَ الَّذِیْ یُصَوِّرُكُمْ فِی الْاَرْحَامِ كَیْفَ یَشَآءُ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చి దిద్దుతాడు[1]. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. info

[1] ము'సవ్విరు (అల్ - ము'సవ్విరు): The Fashioner. రూపమిచ్చేవాడు. తాను కోరిన విధంగా తన సృష్టి రూపాన్ని తీర్చి దిద్దేవాడు. చూడండి, 59:24. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.

التفاسير:

external-link copy
7 : 3

هُوَ الَّذِیْۤ اَنْزَلَ عَلَیْكَ الْكِتٰبَ مِنْهُ اٰیٰتٌ مُّحْكَمٰتٌ هُنَّ اُمُّ الْكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌ ؕ— فَاَمَّا الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ زَیْغٌ فَیَتَّبِعُوْنَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَآءَ الْفِتْنَةِ وَابْتِغَآءَ تَاْوِیْلِهٖ ؔۚ— وَمَا یَعْلَمُ تَاْوِیْلَهٗۤ اِلَّا اللّٰهُ ۘؐ— وَالرّٰسِخُوْنَ فِی الْعِلْمِ یَقُوْلُوْنَ اٰمَنَّا بِهٖ ۙ— كُلٌّ مِّنْ عِنْدِ رَبِّنَا ۚ— وَمَا یَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ ۟

ఆయన (అల్లాహ్) యే నీపై (ఓ ముహమ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ముహ్ కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి[1]. కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటబడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ, పరిపక్వ జ్ఞానం గలవారు: "మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!" అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు. info

[1] ము'హ్ కమాతున్: అంటే, అల్లాహుతా'ఆలా ఆజ్ఞలను, ఆయన నిషేధించిన వాటిని, 'హలాల్ చేసిన వాటిని, కథలను మొదలైన స్పష్టంగా తెలియజేసే ఆయతులు. ఈ ఆయతుల భావం స్పష్టంగా ఉంటుంది. ఇవి దివ్యగ్రంథ పునాదులు. వీటిని ఉమ్ముల్-కితాబ్ అని అంటారు. ఏ ఆయతుల అర్థంలో సంశయానికి తావు ఉంటుందో వాటిని ముతషాబిహాతున్ అంటారు. ఏ విషయాలైతే మానవ ఇంద్రియాలకు అతీతంగా ఉన్నాయో వాటిని వివరించటానికి, వాటికి దగ్గరగా పోలికవున్న, గోచర విషయాలకు మానవభాషలో లభించే పదాలు ఉపయోగించబడిన ఆయతులు. ఉదా: స్వర్గం, నరకం మొదలైనవి. కావున మానవుడు ముతషాబిహాత్ లను చదివేటప్పుడు వాటిని ము'హ్ కమాత్ ల వెలుగులో అర్తం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఖుర్ఆన్ వాటిని ఉమ్ముల్ కితాబ్ - గ్రంథమూలాలు, అన్నది.

التفاسير:

external-link copy
8 : 3

رَبَّنَا لَا تُزِغْ قُلُوْبَنَا بَعْدَ اِذْ هَدَیْتَنَا وَهَبْ لَنَا مِنْ لَّدُنْكَ رَحْمَةً ۚ— اِنَّكَ اَنْتَ الْوَهَّابُ ۟

(వారు ఇలా అంటారు): "ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తరువాత మా హృదయాలను వక్రమార్గం వైపునకు పోనివ్వకు. మరియు మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు. [1] info

[1] అల్ - వహ్హాబ్: Bestower. సర్వవర ప్రదాత, సర్వప్రదుడు. పరమదాత, ఉదారంగా దానం చేసేవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. ఇంకా చూడండి, 38:35, 38:9.

التفاسير:

external-link copy
9 : 3

رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِیَوْمٍ لَّا رَیْبَ فِیْهِ ؕ— اِنَّ اللّٰهَ لَا یُخْلِفُ الْمِیْعَادَ ۟۠

"ఓ మా ప్రభూ! నిశ్చయంగా నీవే మానవులందరినీ నిస్సందేహంగా రాబోయే ఆ దినమున సమావేశపరచే వాడవు[1]. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగం చేయడు." info

[1] జామి'ఉ (అల్-జామి'ఉ) : The collector of the created beings for the Day of Reckoning. సమావేశపరచేవాడు, ప్రోగుచేసేవాడు, కూడబెట్టేవాడు. పై రెండు అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. ఇంకా చూడండి, 4:140, 77:38.

التفاسير: