Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung - Abder-Rahim ibn Muhammad

Nummer der Seite:close

external-link copy
220 : 2

فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ؕ— وَیَسْـَٔلُوْنَكَ عَنِ الْیَتٰمٰی ؕ— قُلْ اِصْلَاحٌ لَّهُمْ خَیْرٌ ؕ— وَاِنْ تُخَالِطُوْهُمْ فَاِخْوَانُكُمْ ؕ— وَاللّٰهُ یَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَاَعْنَتَكُمْ ؕ— اِنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟

ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ - మరియు అనాథలను గురించి వారు నిన్ను అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానమివ్వు: "వారి సంక్షేమానికి తోడ్పడటమే మేలైనది." మరియు మీరు వారితో కలిసి మెలిసి[1] ఉంటే (తప్పులేదు), వారు మీ సోదరులే! మరియు చెరచే వాడెవడో, సవరించే వాడెవడో అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కోరితే మిమ్మల్ని కష్టపెట్టి ఉండేవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. info

[1] తు'ఖాలి'తూహుమ్: వారితో కలసి మెలసి ఉండండి. అంటే ఆదాయాలు మరియు ఖర్చులలో, వ్యాపారంలో మొదలైన వాటిలో కలిసి మెలిసి ఉంటే, ఫర్వాలేదు, కాని వారి సంపదలను కబళించుకోవటానికి ప్రయత్నించరాదు. వారి మేలును మీ మేలుగా పరిగణించాలి.

التفاسير:

external-link copy
221 : 2

وَلَا تَنْكِحُوا الْمُشْرِكٰتِ حَتّٰی یُؤْمِنَّ ؕ— وَلَاَمَةٌ مُّؤْمِنَةٌ خَیْرٌ مِّنْ مُّشْرِكَةٍ وَّلَوْ اَعْجَبَتْكُمْ ۚ— وَلَا تُنْكِحُوا الْمُشْرِكِیْنَ حَتّٰی یُؤْمِنُوْا ؕ— وَلَعَبْدٌ مُّؤْمِنٌ خَیْرٌ مِّنْ مُّشْرِكٍ وَّلَوْ اَعْجَبَكُمْ ؕ— اُولٰٓىِٕكَ یَدْعُوْنَ اِلَی النَّارِ ۖۚ— وَاللّٰهُ یَدْعُوْۤا اِلَی الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِاِذْنِهٖ ۚ— وَیُبَیِّنُ اٰیٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟۠

మరియు ముష్రిక్ స్త్రీలు, విశ్వసించనంత వరకు, మీరు వారిని వివాహమాడకండి, ముష్రిక్ స్త్రీ మీకు ఎంత నచ్చినా, ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది[1]. మరియు ముష్రిక్ పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలతో వారి వివాహం చేయించకండి. మరియు ముష్రిక్ పురుషుడు మీకు ఎంత నచ్చినా, అతడి కంటే విశ్వాసి అయిన ఒక బానిస ఎంతో మేలైనవాడు. ఇలాంటి వారు (ముష్రికీన్) మిమ్మల్ని అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నారు. కాని అల్లాహ్! తన అనుమతితో, మిమ్మల్ని స్వర్గం వైపునకు మరియు క్షమాభిక్ష పొందటానికి పిలుస్తున్నాడు. మరియు ఈ విధంగా ఆయన తన సూచనలను ప్రజలకు - బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని - స్పష్టంగా తెలుపుతున్నాడు. info

[1] దైవప్రవక్త 'స'అస) ప్రవచనం : "స్త్రీని వివాహమాడటానికి నాలుగు విషయాలను గమనించాలి. అవి: 1)ఆస్తిపాస్తులు, 2)పుట్టుపూర్వోత్తరాలు, వంశం 3) అందం, ఆకర్షణీయత మరియు 4) ధర్మపరాయణత." మీరు ధర్మపరాణురాలైన స్త్రీనే ఎంచుకోండి. ('స. బు'ఖారీ, కితాబ్ అన్నికా'హ్, 'స. ముస్లిం, కితాబ్ అర్ర'దా'అ).

التفاسير:

external-link copy
222 : 2

وَیَسْـَٔلُوْنَكَ عَنِ الْمَحِیْضِ ؕ— قُلْ هُوَ اَذًی ۙ— فَاعْتَزِلُوا النِّسَآءَ فِی الْمَحِیْضِ ۙ— وَلَا تَقْرَبُوْهُنَّ حَتّٰی یَطْهُرْنَ ۚ— فَاِذَا تَطَهَّرْنَ فَاْتُوْهُنَّ مِنْ حَیْثُ اَمَرَكُمُ اللّٰهُ ؕ— اِنَّ اللّٰهَ یُحِبُّ التَّوَّابِیْنَ وَیُحِبُّ الْمُتَطَهِّرِیْنَ ۟

మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: "అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి[1]. వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధులు అయిన తరువాత అల్లాహ్ ఆదేశించిన చోటు నుండి మీరు వారి వద్దకు పోవచ్చు." [2] నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాప పడేవారిని ప్రేమిస్తాడు మరియు పరిశుద్ధులుగా ఉండేవారిని ప్రేమిస్తాడు. info

[1] స్త్రీల ఋతుకాలం: ప్రతి చంద్ర మాసంలో 4-5 రోజుల వరకు రక్తం ప్రసరించే కాలం. యూదులు మరియు ఇతర జాతుల వారు ఋతుకాలంలో స్త్రీలను వేరే గదులలో దూరంగా ఉంచేవారు. వారిని వంటింటిలోకి కూడా పోనిచ్చేవారు కాదు. కావున ఈ విషయం గురించి, 'స'హాబీలు ప్రవక్త ('స'అస) గారిని ప్రశ్నించగా, ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ఇందులో స్త్రీలతో ఋతుకాలంలో సంభోగం మాత్రమే నిషేధించబడింది. వారు వంట చేయటం, ఒకే గదిలో భర్తతో కలిసి ఒకే మంచంపై పరుండటం నిషేధించబడలేదు. [2] అల్లాహ్ (సు.తా.) ఆదేశించిన చోటు నుండి అంటే సంతానం పుట్టే చోటు నుండి మాత్రమే. ఇతర ఏ చోట్ల నుండి కూడా కాదు. దీనితో విశదమయ్యేది ఏమిటంటే, భార్యతో కూడా మలమార్గం ద్వారా సంభోగం చేయటం నిషిద్ధం ('హరాం).

التفاسير:

external-link copy
223 : 2

نِسَآؤُكُمْ حَرْثٌ لَّكُمْ ۪— فَاْتُوْا حَرْثَكُمْ اَنّٰی شِئْتُمْ ؗ— وَقَدِّمُوْا لِاَنْفُسِكُمْ ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّكُمْ مُّلٰقُوْهُ ؕ— وَبَشِّرِ الْمُؤْمِنِیْنَ ۟

మీ భార్యలు మీకు పంటపొలాల వంటి వారు, కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు[1]. మరియు మీ స్వయం కొరకు (సత్కార్యాలు) చేసి పంపండి (మీకు మంచి సంతానం కొరకు ప్రార్థించండి). మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు నిశ్చయంగా ఆయనను కలసుకోవలసి ఉందని తెలుసుకోండి. మరియు విశ్వాసులకు శుభవార్తలను వినిపించు. info

[1] ఇక్కడ పంటపొలం అంటే సంతానం ఇచ్చేవారు. ఏ విధంగానైతే పొలం నుండి ఫలం లభిస్తుందో అదే విధంగా స్త్రీల నుండి సంతతి ఫలిస్తుంది. ఇక్కడ కూడా మీరు కొరిన పద్ధతిలో పంటపొలంలోకి మాత్రమే పొండి, కాని ఇతర చోట్ల నుండి పోకండి అంటే స్త్రీ మర్మాంగం నుండే సంభోగం చేయండి. ఇతర మార్గాల ద్వారా చేయకండి అని భావం. (ఇబ్నె-కసీ'ర్).

التفاسير:

external-link copy
224 : 2

وَلَا تَجْعَلُوا اللّٰهَ عُرْضَةً لِّاَیْمَانِكُمْ اَنْ تَبَرُّوْا وَتَتَّقُوْا وَتُصْلِحُوْا بَیْنَ النَّاسِ ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟

మరియు మీరు అల్లాహ్ (పేరుతో) చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి మరియు ప్రజలలలో శాంతి స్థాపించటం నుండి ఆటంకపరిచేవిగా కానివ్వకండి[1]. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. info

[1] మీరు కోపంలో ఉన్నప్పుడు కూడా ఫలానా వ్యక్తికి ఉపకారం చేయనని అల్లాహుతా'ఆలా పేరుతో ప్రమాణం చేయకండి. దీని కఫ్ఫారా 5:89లో విశదీకరించబడింది. చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 621.

التفاسير: