Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans

Nummer der Seite:close

external-link copy
31 : 35

وَالَّذِیْۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ مِنَ الْكِتٰبِ هُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ ؕ— اِنَّ اللّٰهَ بِعِبَادِهٖ لَخَبِیْرٌ بَصِیْرٌ ۟

ఓ ప్రవక్తా మేము మీ వైపునకు దైవ వాణి ద్వారా అవతరింపజేసిన గ్రంధం ఎటువంటి సందేహము లేని సత్యము. దానినే అల్లాహ్ పూర్వ గ్రంధాలను ధృవీకరించే విధంగా అవతరింపజేశాడు. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల గురించి తెలుసుకునే వాడును,చూసేవాడును. ఆయన ప్రతీ జాతి ప్రవక్తకు వారి కాలంలో తన నుండి వారికి ఏమి అవసరమో దైవవాణి ద్వారా తెలియపరుస్తాడు. info
التفاسير:

external-link copy
32 : 35

ثُمَّ اَوْرَثْنَا الْكِتٰبَ الَّذِیْنَ اصْطَفَیْنَا مِنْ عِبَادِنَا ۚ— فَمِنْهُمْ ظَالِمٌ لِّنَفْسِهٖ ۚ— وَمِنْهُمْ مُّقْتَصِدٌ ۚ— وَمِنْهُمْ سَابِقٌ بِالْخَیْرٰتِ بِاِذْنِ اللّٰهِ ؕ— ذٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِیْرُ ۟ؕ

ఆ తరువాత మేము సమాజాలపై ఎన్నుకున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజమునకు మేము ఖుర్ఆన్ ను ప్రసాదించాము. అయితే వారిలో కొందరు నిషిద్ధ కార్యాలకు పాల్పడి, విధిగావించబడిన వాటిని వదిలివేసి తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడినవారు ఉన్నారు. మరియు వారిలో కొందరు విధిగావించబడిన వాటిని చేసి,నిషిద్ధమైన వాటిని వదిలివేసి దానికి తోడుగా కొన్ని సమ్మతమైన వాటిని వదిలివేసి,కొన్ని సమ్మతం కాని వాటిని చేసి మధ్యస్థంగా ఉండేవారు ఉన్నారు. మరియు వారిలో నుండి కొందరు అల్లాహ్ సెలవుతో సత్కార్యములను చేయటంలో మున్ముందు ఉండేవారు ఉన్నారు. ఈ ప్రస్తావించబడినటువంటి ఈ సమాజము కొరకు ఎంచుకోవటం, దానికి ఖుర్ఆన్ ను ప్రసాదించటం ఇది పెద్ద అనుగ్రహము. దానికి సరితూగే ఏ అనుగ్రహము లేదు. info
التفاسير:

external-link copy
33 : 35

جَنّٰتُ عَدْنٍ یَّدْخُلُوْنَهَا یُحَلَّوْنَ فِیْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّلُؤْلُؤًا ۚ— وَلِبَاسُهُمْ فِیْهَا حَرِیْرٌ ۟

కలకాలం నిలిచే స్వర్గవనాలు వాటిలో ఈ ఎంచుకోబడిన వారందరు ప్రవేశిస్తారు. వారు వాటిలో ముత్యాలను,బంగారపు కంకణములను తొడుగుతారు. మరియు వాటిలో వారి వస్త్రాలు పట్టు వస్త్రాలై ఉంటాయి. info
التفاسير:

external-link copy
34 : 35

وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِیْۤ اَذْهَبَ عَنَّا الْحَزَنَ ؕ— اِنَّ رَبَّنَا لَغَفُوْرٌ شَكُوْرُ ۟ۙ

మరియు వారు స్వర్గంలో ప్రవేశించిన తరువాత ఇలా పలుకుతారు : పొగడ్తలన్ని ఆ అల్లాహ్ కొరకే ఎవరైతే మేము నరకములో ప్రవేశము నుండి మేము భయపడటము వలన కలిగిన దుఃఖమును మా నుండి తొలగించాడో. నిశ్ఛయంగా మా ప్రభువు తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించు వాడును, వారి విధేయతపై వారి కొరకు ఆదరించేవాడును. info
التفاسير:

external-link copy
35 : 35

١لَّذِیْۤ اَحَلَّنَا دَارَ الْمُقَامَةِ مِنْ فَضْلِهٖ ۚ— لَا یَمَسُّنَا فِیْهَا نَصَبٌ وَّلَا یَمَسُّنَا فِیْهَا لُغُوْبٌ ۟

ఆయనే తన అనుగ్రహముతో శాశ్వత నివాసము, దాని తరువాత ఎటువంటి తరలింపు లేని దాన్ని మనకు ప్రసాదించాడు. మాకు ఎటువంటి సామర్ధ్యము గాని శక్తి గాని లేదు. అందులో మాకు ఎటువంటి అలసట గాని,సమస్య గాని తలెత్తదు. info
التفاسير:

external-link copy
36 : 35

وَالَّذِیْنَ كَفَرُوْا لَهُمْ نَارُ جَهَنَّمَ ۚ— لَا یُقْضٰی عَلَیْهِمْ فَیَمُوْتُوْا وَلَا یُخَفَّفُ عَنْهُمْ مِّنْ عَذَابِهَا ؕ— كَذٰلِكَ نَجْزِیْ كُلَّ كَفُوْرٍ ۟ۚ

మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరుస్తారో వారి కొరకు నరకాగ్ని గలదు,వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారు మరణించి శిక్ష నుండి ప్రశాంతతను పొందటానికి వారిపై మరణ తీర్పు ఇవ్వబడదు. మరియు వారి నుండి నరకము శిక్ష కొంచెము కూడా తగ్గించబడదు. ఈ ప్రతిఫలం ప్రసాదించినట్లే ప్రళయదినాన మేము తన ప్రభువు యొక్క అనుగ్రహాలను తిరస్కరించే వాడికి ప్రసాదిస్తాము. info
التفاسير:

external-link copy
37 : 35

وَهُمْ یَصْطَرِخُوْنَ فِیْهَا ۚ— رَبَّنَاۤ اَخْرِجْنَا نَعْمَلْ صَالِحًا غَیْرَ الَّذِیْ كُنَّا نَعْمَلُ ؕ— اَوَلَمْ نُعَمِّرْكُمْ مَّا یَتَذَكَّرُ فِیْهِ مَنْ تَذَكَّرَ وَجَآءَكُمُ النَّذِیْرُ ؕ— فَذُوْقُوْا فَمَا لِلظّٰلِمِیْنَ مِنْ نَّصِیْرٍ ۟۠

మరియు వారు అందులో తమ బిగ్గర స్వరాలతో మొర పెట్టుకుంటూ ఇలా పలుకుతూ అరుస్తారు : ఓ మా ప్రభూ నీవు మమ్మల్ని నరగాగ్ని నుండి వెలికి తీ మేము నీ మన్నతను పొంది నీ శిక్ష నుండి భద్రంగా ఉండటానికి మేము ఇహలోకములో చేసిన కర్మలకు భిన్నంగా సత్కర్మను చేస్తాము. అప్పుడు అల్లాహ్ వారికి ఇలా సమాధానమిస్తాడు : ఏ మేము మీకు హితబోధనను గ్రహించదలిచేవాడు హితబోధన గ్రహించి,అల్లాహ్ ముందు పశ్చాత్తాప్పడి,సత్కర్మను చేసేంత వయస్సును ఇవ్వ లేదా ?. మరియు మీకు అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిస్తూ ప్రవక్త మీ వద్దకు రాలేదా ?. వీటన్నిటి తరువాత మీకు ఎటువంటి వాదన గాని వంక గాని లేదు. కాబట్టి మీరు అగ్ని శిక్షను చవిచూడండి. అవిశ్వాసము ద్వారా,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై హింసకు పాల్పడే వారి కొరకు అల్లాహ్ శిక్ష నుండి వారిని రక్షించటానికి లేదా దాన్ని వారి నుండి తేలిక చేయటానికి ఎటువంటి సహాయకుడు ఉండడు. info
التفاسير:

external-link copy
38 : 35

اِنَّ اللّٰهَ عٰلِمُ غَیْبِ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟

నిశ్చయంగా అల్లాహ్ ఆకాశముల,భూమి యొక్క అగోచరమును తెలిసినవాడు. దానిలో నుంచి ఏదీ అతని నుండి తప్పిపోదు. నిశ్ఛయంగా ఆయన తన దాసులు తమ హృదయముల్లో గోప్యంగా ఉంచే మేలును,చెడును తెలిసినవాడు. info
التفاسير:
Die Nutzen der Versen in dieser Seite:
• فضل أمة محمد صلى الله عليه وسلم على سائر الأمم.
సమాజాలన్నింటి పై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజము యొక్క ప్రాముఖ్యత. info

• تفاوت إيمان المؤمنين يعني تفاوت منزلتهم في الدنيا والآخرة.
విశ్వాసపరుల విశ్వాసము యొక్క అసమానత అంటే ఇహపరాల్లో వారి స్థానము యొక్క అసమానత. info

• الوقت أمانة يجب حفظها، فمن ضيعها ندم حين لا ينفع الندم.
సమయం అమానత్ వంటిది దాన్ని పరిరక్షించాలి. దాన్ని వృధా చేసేవాడు పశ్చాత్తాప్పడుతాడు అప్పుడు పశ్ఛాత్తాపము ప్రయోజనం చేకూర్చదు. info

• إحاطة علم الله بكل شيء.
ప్రతీ వస్తువును అల్లాహ్ జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది. info