Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans

Nummer der Seite:close

external-link copy
59 : 24

وَاِذَا بَلَغَ الْاَطْفَالُ مِنْكُمُ الْحُلُمَ فَلْیَسْتَاْذِنُوْا كَمَا اسْتَاْذَنَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟

పెద్దవారి విషయంలో ముందు ప్రస్తావించినట్లే మీలో నుండి పిల్లలు ప్రజ్ఞా వయస్సుకు చేరుకున్నప్పుడు అన్ని వేళల్లో ఇండ్లలో ప్రవేశించేటప్పుడు అనుమతి తీసుకోవాలి. ఏ విధంగానైతే అల్లాహ్ అనుమతి తీసుకునే ఆదేశాలను మీకు స్పష్టపరచాడో మీకు అల్లాహ్ తన ఆయతులను స్పష్టపరిచాడు. మరియు అల్లాహ్ కు తన దాసుల ప్రయోజనాల గురించి బాగా తెలుసు,వారి కొరకు ఆయన ధర్మ సమ్మతం చేస్తున్న వాటి విషయంలో వివేకవంతుడు. info
التفاسير:

external-link copy
60 : 24

وَالْقَوَاعِدُ مِنَ النِّسَآءِ الّٰتِیْ لَا یَرْجُوْنَ نِكَاحًا فَلَیْسَ عَلَیْهِنَّ جُنَاحٌ اَنْ یَّضَعْنَ ثِیَابَهُنَّ غَیْرَ مُتَبَرِّجٰتٍ بِزِیْنَةٍ ؕ— وَاَنْ یَّسْتَعْفِفْنَ خَیْرٌ لَّهُنَّ ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟

మరియు ఆ వృద్ధ స్త్రీలు ఎవరైతే తమ వృద్ధాప్యం వలన ఋతుస్రావం నుండి,గర్భందాల్చటం నుండి కూర్చున్నారో వారు,వివాహంలో ఆశ లేని స్త్రీలు తమ వస్త్రాలైన దుప్పట,ముసుగు వంటి వాటిని తీసి వేయటంలో వారిపై ఎటువంటి పాపం లేదు. వారిని వేటినైతే కప్పివేయమని ఆదేశించబడినదో ఆ దాయబడిన అలంకరణలను బహిర్గతం చేసే విధంగా ఉండకూడదు. ఎక్కువగా పరదా,నిగ్రహము పాటించటంలో వారు ఆ వస్త్రములను విడవటమును వదిలివేయటం విడవటం కన్న వారికి ఎంతో మంచిది. మరియు అల్లాహ్ మీ మాటలను వినేవాడుని,మీ కర్మలను తెలుసుకునే వాడును. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన మీకు వాటి పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
61 : 24

لَیْسَ عَلَی الْاَعْمٰی حَرَجٌ وَّلَا عَلَی الْاَعْرَجِ حَرَجٌ وَّلَا عَلَی الْمَرِیْضِ حَرَجٌ وَّلَا عَلٰۤی اَنْفُسِكُمْ اَنْ تَاْكُلُوْا مِنْ بُیُوْتِكُمْ اَوْ بُیُوْتِ اٰبَآىِٕكُمْ اَوْ بُیُوْتِ اُمَّهٰتِكُمْ اَوْ بُیُوْتِ اِخْوَانِكُمْ اَوْ بُیُوْتِ اَخَوٰتِكُمْ اَوْ بُیُوْتِ اَعْمَامِكُمْ اَوْ بُیُوْتِ عَمّٰتِكُمْ اَوْ بُیُوْتِ اَخْوَالِكُمْ اَوْ بُیُوْتِ خٰلٰتِكُمْ اَوْ مَا مَلَكْتُمْ مَّفَاتِحَهٗۤ اَوْ صَدِیْقِكُمْ ؕ— لَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَنْ تَاْكُلُوْا جَمِیْعًا اَوْ اَشْتَاتًا ؕ— فَاِذَا دَخَلْتُمْ بُیُوْتًا فَسَلِّمُوْا عَلٰۤی اَنْفُسِكُمْ تَحِیَّةً مِّنْ عِنْدِ اللّٰهِ مُبٰرَكَةً طَیِّبَةً ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟۠

తన దృష్టిని కోల్పోయిన అంధునిపై ఎటువంటి పాపం లేదు,కుంటివానిపై ఎటువంటి పాపం లేదు, రోగిపై ఎటువంటి పాపం లేదు ఒక వేళ వారు అల్లాహ్ మార్గంలో పోరాడటం లాంటి బాధ్యతలను నెరవేర్చే శక్తి లేని వాటిని వదిలివేస్తే (వారిపై ఎటువంటి పాపం లేదు). ఓ విశ్వాసపరులారా మీరు మీ ఇండ్ల నుండి తినటంలో,మీ పిల్లల ఇండ్ల నుండి గాని ,మీ తండ్రుల లేదా మీ తల్లుల లేదా మీ సోదరుల లేదా మీ సోదరిల లేదా మీ బాబాయిల లేదా మీ మేనత్తల లేదా మీ మేనమామల లేదా మీ పిన్నుల లేదా తోటమాలి లాంటి మీరు పరిరక్షణ కొరకు బాధ్యత వహిస్తున్న ఇండ్ల నుండిగాని తినటంలో ఎటువంటి పాపం లేదు. మీ స్నేహితుని ఇండ్ల నుండి అతని మంచి మనస్సు వలన దానికి అలవాటు ఉంటే తినటంలో ఎటువంటి పాపం లేదు. మరియు మీరు ఒక వేళ కలిసి తిన్నా లేదా ఒంటరిగా తిన్నా మీపై ఎటువంటి పాపం లేదు. ప్రస్తావించబడిన ఇండ్ల లాంటి ఇండ్లలో,ఇతరవాటిలో మీరు ప్రవేశించినప్పుడు వాటిలో ఉన్నవారిపై మీరు అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక) అని పలుకుతూ సలాం చేయండి. ఒక వేళ వాటిలో ఎవరూ లేకపోతే మీరు అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ (మా పై,అల్లాహ్ పుణ్య దాసులపై శాంతి కలుగు గాక) అని పలుకుతూ సలాం చేయండి. ఇది అల్లాహ్ తరపు నుండి సలాం దాన్ని ఆయన మీ కొరకు శుభదాయకంగా ధర్మబద్దం చేశాడు. మీరు మీ మధ్య ప్రేమను,సాన్నిహిత్యమును వ్యాపింపజేయటానికి. పరిశుద్ధమైనది. దాన్ని వినే వాడి మనస్సు పరిశుద్ధమవుతుంది. సూరాలో ముందల ఈ ప్రస్తావించినట్లే మీరు వాటిని అర్ధం చేసుకుని వాటిలో ఉన్న దాన్ని మీరు చేస్తారని ఆశిస్తూ అల్లాహ్ ఆయతులను స్ఫష్టపరుస్తున్నాడు. info
التفاسير:
Die Nutzen der Versen in dieser Seite:
• جواز وضع العجائز بعض ثيابهنّ لانتفاء الريبة من ذلك.
వృద్ధ స్తీలు తమ కొన్ని వస్త్రములను దాని గురించి సందేహం లేకపోవటం వలన తీసి వేయటం సమ్మతము. info

• الاحتياط في الدين شأن المتقين.
ధర్మ విషయంలో జాగ్రత్తగా ఉండటం దైవభీతి కలవారి లక్షణం. info

• الأعذار سبب في تخفيف التكليف.
ప్రతికూలమైన హేతువులు బాధ్యతలను సులభం చేసే విషయంలో ఒక కారణం. info

• المجتمع المسلم مجتمع التكافل والتآزر والتآخي.
ముస్లిం సమాజం సంఘీభావం,సహాయం,సౌభ్రాతృత్వం కలిగిన సమాజం. info