Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Abdurahim b. Muhamed

అల్-బలద్

external-link copy
1 : 90

لَاۤ اُقْسِمُ بِهٰذَا الْبَلَدِ ۟ۙ

కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)! info
التفاسير:

external-link copy
2 : 90

وَاَنْتَ حِلٌّۢ بِهٰذَا الْبَلَدِ ۟ۙ

మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.[1] info

[1] కొందరు: "తండ్రి (మూలపురుషుడు) అంటే ఆదమ్ ('అ.స.) మరియు అతని సంతానం అంటే మానవజాతి." అన్నారు.

التفاسير:

external-link copy
3 : 90

وَوَالِدٍ وَّمَا وَلَدَ ۟ۙ

మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా! info
التفاسير:

external-link copy
4 : 90

لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ فِیْ كَبَدٍ ۟ؕ

వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము. info
التفاسير:

external-link copy
5 : 90

اَیَحْسَبُ اَنْ لَّنْ یَّقْدِرَ عَلَیْهِ اَحَدٌ ۟ۘ

ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా? info
التفاسير:

external-link copy
6 : 90

یَقُوْلُ اَهْلَكْتُ مَالًا لُّبَدًا ۟ؕ

అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.[1] info

[1] లుబదన్: కసీ'ర్, చాలా

التفاسير:

external-link copy
7 : 90

اَیَحْسَبُ اَنْ لَّمْ یَرَهٗۤ اَحَدٌ ۟ؕ

ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?[1] info

[1] అంటే అతడు చేసే వృథా ఖర్చును ఎవ్వరూ చూడటం లేదని భావిస్తున్నాడా? అల్లాహ్ (సు.తా.) అంతా చూస్తున్నాడు.

التفاسير:

external-link copy
8 : 90

اَلَمْ نَجْعَلْ لَّهٗ عَیْنَیْنِ ۟ۙ

ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా? info
التفاسير:

external-link copy
9 : 90

وَلِسَانًا وَّشَفَتَیْنِ ۟ۙ

మరియు నాలుకను మరియు రెండు పెదవులను. info
التفاسير:

external-link copy
10 : 90

وَهَدَیْنٰهُ النَّجْدَیْنِ ۟ۚ

మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.[1] info

[1] చూడండి, 76:3 అన్-నజ్ దు: అంటే ఎత్తైన స్థలం. అన్-నజ్ దైన్: అంటే రెండు మార్గాలు.

التفاسير:

external-link copy
11 : 90

فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ ۟ؗۖ

కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు![1] info

[1] చూఅల్-'అఖబహ్: కొండ శిఖరం (పైకి ఎక్కడం) కొందరు దీనికి కనుమ అనే అర్థం ఇచ్చారు. అంటే రెండు కొండల నడిమి త్రోవ, సందు. కఠినమైన కనుమ అంటే ఒక బానిసను బంధం నుండి విముక్తి చేయించడం, లేక తాను ఆకలితో ఉండి కూడా ఒక అనాథకి అన్నం పెట్టడం.

التفاسير:

external-link copy
12 : 90

وَمَاۤ اَدْرٰىكَ مَا الْعَقَبَةُ ۟ؕ

మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? info
التفاسير:

external-link copy
13 : 90

فَكُّ رَقَبَةٍ ۟ۙ

అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.[1] info

[1] చూడండి, 2:177.

التفاسير:

external-link copy
14 : 90

اَوْ اِطْعٰمٌ فِیْ یَوْمٍ ذِیْ مَسْغَبَةٍ ۟ۙ

లేదా! (స్వయంగా) ఆకలి గొని[1] ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం. info

[1] మస్'గతున్: ఆకలి.

التفاسير:

external-link copy
15 : 90

یَّتِیْمًا ذَا مَقْرَبَةٍ ۟ۙ

సమీప అనాథునికి గానీ; info
التفاسير:

external-link copy
16 : 90

اَوْ مِسْكِیْنًا ذَا مَتْرَبَةٍ ۟ؕ

లేక, దిక్కులేని నిరుపేదకు గానీ![1] info

[1] జా-'మత్ రబతున్: మట్టిపై పడి ఉండే పేదవాడు. ఎవడికైతే ఇల్లు ఉండదో!

التفاسير:

external-link copy
17 : 90

ثُمَّ كَانَ مِنَ الَّذِیْنَ اٰمَنُوْا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ ۟ؕ

మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం. info
التفاسير:

external-link copy
18 : 90

اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْمَیْمَنَةِ ۟ؕ

ఇలాంటి వారే కుడిపక్షం వారు.[1] info

[1] అతడు విశ్వాసి అయిఉంటేనే, చేసిన పుణ్యాల ఫలితం దొరుకుతుంది లేకపోతే పరలోకంలో అవి వృథా అయిపోతాయి.

التفاسير:

external-link copy
19 : 90

وَالَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِنَا هُمْ اَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۟ؕ

ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు. info
التفاسير:

external-link copy
20 : 90

عَلَیْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ ۟۠

వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.[1] info

[1] ము'అసదతన్': ము'గ్ లఖతున్, అంటే చుట్టుకుంటుంది. చూడండి, 104:6-8.

التفاسير: