Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Abdurahim b. Muhamed

Broj stranice:close

external-link copy
68 : 7

اُبَلِّغُكُمْ رِسٰلٰتِ رَبِّیْ وَاَنَا لَكُمْ نَاصِحٌ اَمِیْنٌ ۟

"నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను మరియు నిశ్చయంగా, నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడను. info
التفاسير:

external-link copy
69 : 7

اَوَعَجِبْتُمْ اَنْ جَآءَكُمْ ذِكْرٌ مِّنْ رَّبِّكُمْ عَلٰی رَجُلٍ مِّنْكُمْ لِیُنْذِرَكُمْ ؕ— وَاذْكُرُوْۤا اِذْ جَعَلَكُمْ خُلَفَآءَ مِنْ بَعْدِ قَوْمِ نُوْحٍ وَّزَادَكُمْ فِی الْخَلْقِ بَصْۜطَةً ۚ— فَاذْكُرُوْۤا اٰلَآءَ اللّٰهِ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟

లేదా ! మిమ్మల్ని హెచ్చరించటానికి మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం - మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? నూహ్ జాతి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి, మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి[1]. ఈ విధంగా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!" info

[1] చూడండి, 89:8 మరియు 41:15.

التفاسير:

external-link copy
70 : 7

قَالُوْۤا اَجِئْتَنَا لِنَعْبُدَ اللّٰهَ وَحْدَهٗ وَنَذَرَ مَا كَانَ یَعْبُدُ اٰبَآؤُنَا ۚ— فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟

వారన్నారు: "మేము అల్లాహ్ ను ఒక్కణ్ణి మాత్రమే ఆరాధించి, మా తండ్రితాతలు ఆరాధించే వాటిని వదలిపెట్టమని (చెప్పటానికి) నీవు మా వద్దకు వచ్చావా? ఒకవేళ నీవు సత్యవంతుడవే అయితే మమ్మల్ని భయపెట్టే దానిని (శిక్షను) తీసుకొనిరా!"[1] info

[1] చూడండి, 8:32. ఇది ముష్రిక్ ఖురైషులు ము'హమ్మద్ ('సఅస) యొక్క ఇస్లాం ఆహ్వానానికి ఇచ్చిన జవాబు.

التفاسير:

external-link copy
71 : 7

قَالَ قَدْ وَقَعَ عَلَیْكُمْ مِّنْ رَّبِّكُمْ رِجْسٌ وَّغَضَبٌ ؕ— اَتُجَادِلُوْنَنِیْ فِیْۤ اَسْمَآءٍ سَمَّیْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّا نَزَّلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍ ؕ— فَانْتَظِرُوْۤا اِنِّیْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِیْنَ ۟

(హూద్) అన్నాడు: "వాస్తవానికి మీపై మీ ప్రభువు యొక్క ఆగ్రహం మరియు శిక్ష విరుచుకుపడ్డాయి, అల్లాహ్ ఏ ప్రమాణం ఇవ్వకున్నా - మీరు మరియు మీ తండ్రితాతలు పెట్టుకున్న (కల్పిత) పేర్ల విషయంలో - నాతో వాదులాడుతున్నారా? సరే, అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటు నేనూ నిరీక్షిస్తాను!" info
التفاسير:

external-link copy
72 : 7

فَاَنْجَیْنٰهُ وَالَّذِیْنَ مَعَهٗ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَمَا كَانُوْا مُؤْمِنِیْنَ ۟۠

కావున తుదకు మేము అతనిని (హూద్ ను) మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో రక్షించాము. మరియు మా సూచనలు అసత్యాలని తిరస్కరించిన వారిని నిర్మూలించాము[1]. ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు. info

[1] వారిపై ఎనిమిది రోజులు, ఏడు రాత్రులు భయంకరమైన తుఫాను గాలి, విరుచుకు పడింది. వారు కోసిన ఖర్జూర చెట్ల వలె పడిపోయారు. చూడండి, 69:6-8, 11:53-56, 46:24-25.

التفاسير:

external-link copy
73 : 7

وَاِلٰی ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا ۘ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— قَدْ جَآءَتْكُمْ بَیِّنَةٌ مِّنْ رَّبِّكُمْ ؕ— هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَكُمْ اٰیَةً فَذَرُوْهَا تَاْكُلْ فِیْۤ اَرْضِ اللّٰهِ وَلَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَیَاْخُذَكُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

ఇక సమూద్ జాతి వారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ ను పంపాము[1]. అతను వారితో! "నా జాతి సోదరులారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన సూచన వచ్చింది. ఇది అల్లాహ్ మీకు ఒక అద్భుత సూచనగా పంపిన ఆడ ఒంటె. కావున దీనిని అల్లాహ్ భూమిపై మేయటానికి వదలిపెట్టిండి. మరియు హాని కలిగించే ఉద్దేశంతో దీనిని ముట్టుకోకండి. ఆలా చేస్తే మిమ్మల్ని బాధాకరమైన శిక్ష పట్టుకుంటుంది.[2] info

[1] నబాతియన్ - తెగకు చెందిన స'మూద్ జాతివారు, 'ఆద్ జాతికి చెందిన వారు. కావున వారు రెండవ 'ఆద్ జాతి వారిగా పిలువబడ్డారు. వారు 'హిజా'జ్ ఉత్తరభాగంలో ఉండే వారు. ఆ ప్రాంతం, వాది అల్-ఖురా అనబడుతొంది. వారు ఆ 'హిజ్ర్ ప్రాంతంలో గుట్టలను తొలిచి గృహాలను నిర్మించారు. వాటి పేరు మదాయిన్ 'సాలి'హ్. ఈ రోజు కూడా అవి ఈ పేరుతోనే పిలుబడతాయి. మదాయన్ 'సాలి'హ్ మదీనా మునవ్వరా మరియు తబూక్ ల మధ్య ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ స'మూద్ జాతి వారు కొండలను తొలిచి నిర్మించిన కట్టడాలు ఉన్నాయి. [2] చూడండి, 54:27.

التفاسير: