Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Abdurahim b. Muhamed

external-link copy
7 : 3

هُوَ الَّذِیْۤ اَنْزَلَ عَلَیْكَ الْكِتٰبَ مِنْهُ اٰیٰتٌ مُّحْكَمٰتٌ هُنَّ اُمُّ الْكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌ ؕ— فَاَمَّا الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ زَیْغٌ فَیَتَّبِعُوْنَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَآءَ الْفِتْنَةِ وَابْتِغَآءَ تَاْوِیْلِهٖ ؔۚ— وَمَا یَعْلَمُ تَاْوِیْلَهٗۤ اِلَّا اللّٰهُ ۘؐ— وَالرّٰسِخُوْنَ فِی الْعِلْمِ یَقُوْلُوْنَ اٰمَنَّا بِهٖ ۙ— كُلٌّ مِّنْ عِنْدِ رَبِّنَا ۚ— وَمَا یَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ ۟

ఆయన (అల్లాహ్) యే నీపై (ఓ ముహమ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ముహ్ కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి[1]. కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటబడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ, పరిపక్వ జ్ఞానం గలవారు: "మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!" అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు. info

[1] ము'హ్ కమాతున్: అంటే, అల్లాహుతా'ఆలా ఆజ్ఞలను, ఆయన నిషేధించిన వాటిని, 'హలాల్ చేసిన వాటిని, కథలను మొదలైన స్పష్టంగా తెలియజేసే ఆయతులు. ఈ ఆయతుల భావం స్పష్టంగా ఉంటుంది. ఇవి దివ్యగ్రంథ పునాదులు. వీటిని ఉమ్ముల్-కితాబ్ అని అంటారు. ఏ ఆయతుల అర్థంలో సంశయానికి తావు ఉంటుందో వాటిని ముతషాబిహాతున్ అంటారు. ఏ విషయాలైతే మానవ ఇంద్రియాలకు అతీతంగా ఉన్నాయో వాటిని వివరించటానికి, వాటికి దగ్గరగా పోలికవున్న, గోచర విషయాలకు మానవభాషలో లభించే పదాలు ఉపయోగించబడిన ఆయతులు. ఉదా: స్వర్గం, నరకం మొదలైనవి. కావున మానవుడు ముతషాబిహాత్ లను చదివేటప్పుడు వాటిని ము'హ్ కమాత్ ల వెలుగులో అర్తం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఖుర్ఆన్ వాటిని ఉమ్ముల్ కితాబ్ - గ్రంథమూలాలు, అన్నది.

التفاسير: