Prijevod značenja časnog Kur'ana - Prijevod na telugu jezik - Abdurahim b. Muhamed

external-link copy
8 : 16

وَّالْخَیْلَ وَالْبِغَالَ وَالْحَمِیْرَ لِتَرْكَبُوْهَا وَزِیْنَةً ؕ— وَیَخْلُقُ مَا لَا تَعْلَمُوْنَ ۟

మరియు ఆయన గుర్రాలను[1], కంచర గాడిదలను మరియు గాడిదలను, మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన, మీకు తెలియనివి (అనేక ఇతర సాధనాలను) కూడా సృష్టించాడు[2]. info

[1] ఇక్కడ గుర్రాల విషయం స్వారీ చేయటానికి అని వచ్చింది. అవి స్వారీ కొరకు చాలా విలువైనవి కాబట్టి సాధారణంగా వాటిని, వాటి మాంసాన్ని తినటానికి ఉపయోగించరు. 'స. బు'ఖారీ, కితాబ్ అల్ - 'హజ్జ్, జు'బాయ'హ్, బాబ్ ల'హుమ్ అల్ 'ఖైల్; మరియు స 'హీ ముస్లిం, కితాబ్ అ'స్సైద్, బాబ్ ఫి అక్ల్ ల'హుమ్ అల్ - 'ఖైల్, జావబిర్ (ర'ది. 'అ.) ఉల్లేఖనం ప్రకారం పై ఇద్దరు 'హదీస్'వేత్తలు పేర్కొన్నట్లు గుర్రాల మాంసము తినటానికి 'హలాలే. ఇంతేగాక దైవప్రవక్త ('స'అస) సమక్షంలో 'ఖైబర్ మరియు మదీనాలలో గుర్రాలను కోసి తిన్నట్లు ఉల్లేఖనా (రివాయత్)లు ఉన్నాయి. దైవప్రవక్త ('స'అస) వారిని నివారించలేదు. ('స. ముస్లిం, ముస్నద్ అ'హ్మద్, అబూ దావూద్, ఇబ్నె కసీ'ర్ వ్యాఖ్యానం). [2] వెంటనే అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: 'మీకు తెలియని ఇంకా ఎన్నో సాధనాలను కూడా సృష్టిస్తాను.' కాబట్టి ఈ ఆయత్ ఎల్లప్పటికి నిజమే. ఈనాడు విమానాలు, రాకెట్లు వచ్చాయి. ఇంకా మున్నుందు ఏమేమి వస్తాయో అల్లాహుతా'ఆలాకే తెలుసు. చూడండి, 36:42.

التفاسير: