আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - তেলেগু অনুবাদ- আব্দুৰ ৰহীম বিন মুহাম্মদ

পৃষ্ঠা নং:close

external-link copy
118 : 11

وَلَوْ شَآءَ رَبُّكَ لَجَعَلَ النَّاسَ اُمَّةً وَّاحِدَةً وَّلَا یَزَالُوْنَ مُخْتَلِفِیْنَ ۟ۙ

మరియు నీ ప్రభువు సంకల్పిస్తే, సర్వ మానవులను (ఒకే ధర్మాన్ని అవలంబించే) ఒకే ఒక్క సంఘంగా చేసేవాడు. అయినా వారు అభిప్రాయ భేదాలు లేకుండా ఉండ లేక పోయేవారు[1] - info

[1] చూడండి, 2:253 మరియు 5:48.

التفاسير:

external-link copy
119 : 11

اِلَّا مَنْ رَّحِمَ رَبُّكَ ؕ— وَلِذٰلِكَ خَلَقَهُمْ ؕ— وَتَمَّتْ كَلِمَةُ رَبِّكَ لَاَمْلَـَٔنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ اَجْمَعِیْنَ ۟

నీ ప్రభువు కరుణించినవాడు తప్ప![1] మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు.[2] మరియు నీ ప్రభువు: "నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను!" అని అన్నమాట నెరవేరుతుంది.[3] info

[1] చూడండి, 7:172. [2] చూడండి, 2:30-34. [3] చూడండి, 7:18, 32:13.

التفاسير:

external-link copy
120 : 11

وَكُلًّا نَّقُصُّ عَلَیْكَ مِنْ اَنْۢبَآءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِهٖ فُؤَادَكَ ۚ— وَجَآءَكَ فِیْ هٰذِهِ الْحَقُّ وَمَوْعِظَةٌ وَّذِكْرٰی لِلْمُؤْمِنِیْنَ ۟

మరియు (ఓ ప్రవక్తా!) నీ హృదయాన్ని స్థిరపరచటానికి, మేము ప్రవక్తల గాథలను నీకు వినిపిస్తున్నాను. మరియు ఇందు (ఈ సూరహ్) లో నీకు సత్యం వచ్చింది మరియు విశ్వాసులకు హితబోధ మరియు జ్ఞాపిక. info
التفاسير:

external-link copy
121 : 11

وَقُلْ لِّلَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ اعْمَلُوْا عَلٰی مَكَانَتِكُمْ ؕ— اِنَّا عٰمِلُوْنَ ۟ۙ

మరియు విశ్వసించని వారితో ఇలా అను: "మీరు మీ శక్తి మేరకు మీ పనులు చేయండి. నిశ్చయంగా, మేము కూడా మా శక్తి మేరకు మా పనులు చేస్తాము. info
التفاسير:

external-link copy
122 : 11

وَانْتَظِرُوْا ۚ— اِنَّا مُنْتَظِرُوْنَ ۟

మరియు మీరు వేచి చూడండి; మేము కూడా వేచి ఉంటాము." info
التفاسير:

external-link copy
123 : 11

وَلِلّٰهِ غَیْبُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاِلَیْهِ یُرْجَعُ الْاَمْرُ كُلُّهٗ فَاعْبُدْهُ وَتَوَكَّلْ عَلَیْهِ ؕ— وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟۠

మరియు ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క సర్వ అగోచర విషయాలు కేవలం అల్లాహ్ కే తెలుసు.[1] మరియు సర్వ విషయాలు ఆయన వద్దకే మరలింపబడతాయి కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయననే నమ్ముకోండి. మరియు మీరు చేసే కర్మలు నీ ప్రభువు ఎరుగకుండా లేడు. info

[1] చూడండి, 2:3.

التفاسير: