আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - তেলেগু অনুবাদ- আব্দুৰ ৰহীম বিন মুহাম্মদ

পৃষ্ঠা নং:close

external-link copy
82 : 11

فَلَمَّا جَآءَ اَمْرُنَا جَعَلْنَا عَالِیَهَا سَافِلَهَا وَاَمْطَرْنَا عَلَیْهَا حِجَارَةً مِّنْ سِجِّیْلٍ ۙ۬— مَّنْضُوْدٍ ۟ۙ

మా తీర్పు సమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళను ఎడతెగకుండా కురిపించాము.[1] info

[1] ఇటువంటి గులకరాళ్ళు 7:84 మరియు 105:4 లలో కూడా పేర్కొనబడ్డాయి.

التفاسير:

external-link copy
83 : 11

مُّسَوَّمَةً عِنْدَ رَبِّكَ ؕ— وَمَا هِیَ مِنَ الظّٰلِمِیْنَ بِبَعِیْدٍ ۟۠

అవి నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడినవి. అది (ఆ శిక్ష) ఈ దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు. info
التفاسير:

external-link copy
84 : 11

وَاِلٰی مَدْیَنَ اَخَاهُمْ شُعَیْبًا ؕ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— وَلَا تَنْقُصُوا الْمِكْیَالَ وَالْمِیْزَانَ اِنِّیْۤ اَرٰىكُمْ بِخَیْرٍ وَّاِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ مُّحِیْطٍ ۟

ఇక మద్ యన్ వారి వద్దకు వారి సహోదరుడైన షుఐబ్ ను పంపాము.[1] అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. కొలతల్లో మరియు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. నేను నిశ్చయంగా, మిమ్మల్ని (ఇప్పుడు) మంచి స్థితిలో చూస్తున్నాను; కాని వాస్తవానికి మీపై ఆరోజు చుట్టు ముట్టబోయే శిక్షను గురించి నేను భయపడుతున్నాను. info

[1] మద్ యన్ వారి గాథ కొరకు చూడండి, 7:85.

التفاسير:

external-link copy
85 : 11

وَیٰقَوْمِ اَوْفُوا الْمِكْیَالَ وَالْمِیْزَانَ بِالْقِسْطِ وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْیَآءَهُمْ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟

"మరియు ఓ నా జాతి ప్రజలారా! మీరు న్యాయంగా మరియు సరిగ్గా కొలవండి మరియు తూకం చేయండి. మరియు ప్రజలకు వారి వస్తువులను తక్కువ జేసి ఇవ్వకండి.[1] మరియు భూమిలో అనర్థాన్ని, కల్లోల్లాన్ని వ్యాపింపజేయకండి. info

[1] చూడండి, 83:1-3.

التفاسير:

external-link copy
86 : 11

بَقِیَّتُ اللّٰهِ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۚ۬— وَمَاۤ اَنَا عَلَیْكُمْ بِحَفِیْظٍ ۟

"మీరు విశ్వాసులే అయితే, (ప్రజలకు వారి హక్కు ఇచ్చిన తరువాత) అల్లాహ్ మీ కొరకు మిగిల్చినదే మీకు మేలైనది.[1] మరియు నేను మీ రక్షకుడను కాను."[2] info

[1] చూడండి, 18:46 మరియు 19:76. 'అల్లాహ్ (సు.తా.) మీ కొరకు మిగిల్చేది,' అంటే మీరు న్యాయంగా నడుచుకొని మీ వ్యాపారాలలో సరిగ్గా కొలిచి, తూచి ఇచ్చిన తరువాత మీకు మిగిలే లాభం, అని అర్థం. [2] నేను మీకు చేసే ఉపదేశం కేవలం అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞప్రకారం చేస్తున్నాను. మిమ్మల్ని దుష్టకార్యాల నుండి ఆపటం గానీ లేక శిక్షించటం గానీ నా పని కాదు. అది కేవలం అల్లాహ్ (సు.తా.) పని మాత్రమే.

التفاسير:

external-link copy
87 : 11

قَالُوْا یٰشُعَیْبُ اَصَلٰوتُكَ تَاْمُرُكَ اَنْ نَّتْرُكَ مَا یَعْبُدُ اٰبَآؤُنَاۤ اَوْ اَنْ نَّفْعَلَ فِیْۤ اَمْوَالِنَا مَا نَشٰٓؤُا ؕ— اِنَّكَ لَاَنْتَ الْحَلِیْمُ الرَّشِیْدُ ۟

వారు (వ్యంగంగా) అన్నారు: "ఓ షుఐబ్! ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధించే దేవతలను మేము వదలిపెట్టాలని, లేదా మా ధనాన్ని నీ ఇష్ట ప్రకారం ఖర్చు చేయాలని, నీకు నీ నమాజ్ నేర్పుతుందా?[1] (అయితే) నిశ్చయంగా, ఇక నీవే చాలా సహనశీలుడవు, ఉదాత్తుడవు!"[2] info

[1] సలాతున్: అంటే ఇక్కడ ధర్మం, ఆరాధన అని అర్థం. [2] అర్-రషీద్: The Director to the Right path, Leader. సన్మార్గం చూపువాడు. నీతిపరుడు, సన్మార్గగామిని, ఋజువర్తనుడు.

التفاسير:

external-link copy
88 : 11

قَالَ یٰقَوْمِ اَرَءَیْتُمْ اِنْ كُنْتُ عَلٰی بَیِّنَةٍ مِّنْ رَّبِّیْ وَرَزَقَنِیْ مِنْهُ رِزْقًا حَسَنًا ؕ— وَمَاۤ اُرِیْدُ اَنْ اُخَالِفَكُمْ اِلٰی مَاۤ اَنْهٰىكُمْ عَنْهُ ؕ— اِنْ اُرِیْدُ اِلَّا الْاِصْلَاحَ مَا اسْتَطَعْتُ ؕ— وَمَا تَوْفِیْقِیْۤ اِلَّا بِاللّٰهِ ؕ— عَلَیْهِ تَوَكَّلْتُ وَاِلَیْهِ اُنِیْبُ ۟

అప్పుడు అతను (షుఐబ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీరు చూశారా (ఆలోచించారా) ? ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉండి మరియు ఆయన నాకు తన తరఫు నుండి మంచి జీవనోపాధిని కూడా ప్రసాదించినపుడు (నేను ఇలా కాకుండా మరేమి అనగలను)? నేను మిమ్మల్ని నిషేధించిన దానికి వ్యతిరేకంగా చేయ దలచుకోలేదు. నేను మాత్రం మిమ్మల్ని నా శక్తి మేరకు సంస్కరించ దలచుకున్నాను. నా కార్యసిద్ధి కేవలం అల్లాహ్ పైననే ఆధారపడి వుంది. నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతాను. info
التفاسير: