ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية - عبد الرحيم بن محمد

سورة الجن - అల్-జిన్

external-link copy
1 : 72

قُلْ اُوْحِیَ اِلَیَّ اَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوْۤا اِنَّا سَمِعْنَا قُرْاٰنًا عَجَبًا ۟ۙ

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "నాకు ఈ విధంగా దివ్యసందేశం పంపబడింది; నిశ్చయంగా, ఒక జిన్నాతుల సమూహం[1] - దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విని - తమ జాతి వారితో ఇలా అన్నారు: 'వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం (ఖుర్ఆన్) విన్నాము! info

[1] నఫరున్: అంటే 3 నుండి 10 వరకు ఉండే సంఖ్యల సమూహం. నఖ్ లా లోయలో దైవప్రవక్త ('స'అస) తమ అనుచరు(ర.'ది.'అన్హుమ్)లతో సహా ఫజ్ర్ నమా'జ్ చేస్తుండగా అక్కడి నుండి కొందరు జిన్నాతులు పోతూ వారి ఖుర్ఆన్ విని ప్రభావితులయి విశ్వసిస్తారు. ఈ విషయం 46:29 లో వచ్చింది. జిన్నాతులు ఖుర్ఆన్ విన్నది దైవప్రవక్త ('స'అస) కు తెలియదు. అది వ'హీ ద్వారా తెలుపబడిందని ఇక్కడ పేర్కొనబడింది.

التفاسير:

external-link copy
2 : 72

یَّهْدِیْۤ اِلَی الرُّشْدِ فَاٰمَنَّا بِهٖ ؕ— وَلَنْ نُّشْرِكَ بِرَبِّنَاۤ اَحَدًا ۟ۙ

అది సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. కావున మేము దానిని విశ్వసించాము[1]. మరియు మేము మా ప్రభువుకు ఎవ్వడిని కూడా భాగస్వామిగా సాటి కల్పించము. info

[1] ఖుర్ఆన్ ను వినగానే జిన్నాతులు విశ్వసించారు. కాని మానవులు మాత్రం దానిని మళ్ళీ మళ్ళీ విని కూడా విశ్వసించడం లేదు.

التفاسير:

external-link copy
3 : 72

وَّاَنَّهٗ تَعٰلٰی جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَّلَا وَلَدًا ۟ۙ

మరియు నిశ్చయంగా, మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఎవ్వడినీ భార్యగా (సాహిబతున్ గా) గానీ, కుమారునిగా గానీ చేసుకోలేదు. info
التفاسير:

external-link copy
4 : 72

وَّاَنَّهٗ كَانَ یَقُوْلُ سَفِیْهُنَا عَلَی اللّٰهِ شَطَطًا ۟ۙ

మరియు నిశ్చయంగా, మనలోని అవివేకులు, కొందరు అల్లాహ్ విషయంలో దారుణమైన మాటలు పలుకుతున్నారు. info
التفاسير:

external-link copy
5 : 72

وَّاَنَّا ظَنَنَّاۤ اَنْ لَّنْ تَقُوْلَ الْاِنْسُ وَالْجِنُّ عَلَی اللّٰهِ كَذِبًا ۟ۙ

మరియు వాస్తవానికి మనం మానవులు గానీ, జిన్నాతులు గానీ అల్లాహ్ ను గురించి అబద్ధం పలకరని భావించేవారము. info
التفاسير:

external-link copy
6 : 72

وَّاَنَّهٗ كَانَ رِجَالٌ مِّنَ الْاِنْسِ یَعُوْذُوْنَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوْهُمْ رَهَقًا ۟ۙ

మరియు వాస్తవానికి, మానవులలో నుండి కొందరు పురుషులు, జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు, వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు[1]. info

[1] చివరి వాక్యానికి కొందరు వ్యాఖ్యాతలు ఈ విధంగా తాత్పర్యం చెప్పారు : "కాని వారు, వారి (మానవుల) పాపాన్ని అవిశ్వాసాన్ని మరింత అధికం చేశారు." ఇస్లాంకు ముందు 'అరబ్బులు తమ ప్రయాణాలలో ఎక్కడైనా ఆగితే, అక్కడి జిన్నాతులతో శరణు కోరేవారు. ఇస్లాం దీనిని నిషేధించింది మరియు కేవలం ఒకే ఒక్క ప్రభువు, అల్లాహ్ (సు.తా.) తో శరణు కోరటాన్ని మాత్రమే విధిగా చేసింది. చూడండి, 15:23.

التفاسير:

external-link copy
7 : 72

وَّاَنَّهُمْ ظَنُّوْا كَمَا ظَنَنْتُمْ اَنْ لَّنْ یَّبْعَثَ اللّٰهُ اَحَدًا ۟ۙ

మరియు వాస్తవానికి, వారు (మానవులు) కూడా మీరు (జిన్నాతులు) భావించినట్లు, అల్లాహ్ ఎవ్వడినీ కూడా సందేశహరునిగా పంపడని భావించారు. info
التفاسير:

external-link copy
8 : 72

وَّاَنَّا لَمَسْنَا السَّمَآءَ فَوَجَدْنٰهَا مُلِئَتْ حَرَسًا شَدِیْدًا وَّشُهُبًا ۟ۙ

మరియు నిశ్చయంగా, మేము ఆకాశాలలో (రహస్యాలను) తొంగి చూడటానికి ప్రయత్నించినపుడు, మేము దానిని కఠినమైన కావలివారితో మరియు అగ్ని జ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము[1]. info

[1] చూడండి, 15:17-18. ఆకాశాలలో దైవదూతలు ('అలైహిమ్.స.), ఇతరులు అక్కడి మాటలు వినకుండా కాపలాకాస్తూ ఉంటారు మరియు ఈ అగ్నికణాలు (షుహుబున్) ఆకాశాలలోని మాటలు వినటానికి పైకి పోయే జిన్నాతులపై పడతాయి. షుహుబున్ - షిహాబున్ బ.వ.

التفاسير:

external-link copy
9 : 72

وَّاَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ؕ— فَمَنْ یَّسْتَمِعِ الْاٰنَ یَجِدْ لَهٗ شِهَابًا رَّصَدًا ۟ۙ

మరియు వాస్తవానికి పూర్వం అక్కడి మాటలు వినటానికి మేము రహస్యంగా అక్కడ కూర్చునేవారం[1]. కాని ఇప్పుడు ఎవడైనా (రహస్యంగా) వినే ప్రయత్నం చేస్తే, అతడి కొరకు అక్కడ ఒక అగ్నిజ్వాల పొంచి ఉంటుంది[2]. info

[1] మరియు ఆకాశాల మాటలు విని జ్యోతిష్కులకు చెప్పేవారము. వాటిలో వారు తమ వైపునుండి నూరు అబద్ధాలు కలిపి చెప్పేవారు.
[2] కాని దైవప్రవక్త ('స'అస) వచ్చిన తరువాత నుండి ఈ పని ఆపబడింది. ఇప్పుడు ఎవడైనా పైకి పోవటానికి ప్రయత్నిస్తే అగ్నికణం అతనిపై పడుతుంది.

التفاسير:

external-link copy
10 : 72

وَّاَنَّا لَا نَدْرِیْۤ اَشَرٌّ اُرِیْدَ بِمَنْ فِی الْاَرْضِ اَمْ اَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا ۟ۙ

మరియు వాస్తవానికి భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశింపబడిందా, లేక వారి ప్రభువు వారికి సరైన మార్గం చూపగోరుతున్నాడా అనే విషయం మాకు అర్థం కావడం లేదు. info
التفاسير:

external-link copy
11 : 72

وَّاَنَّا مِنَّا الصّٰلِحُوْنَ وَمِنَّا دُوْنَ ذٰلِكَ ؕ— كُنَّا طَرَآىِٕقَ قِدَدًا ۟ۙ

మరియు వాస్తవానికి, మనలో కొందరు సద్వర్తనులున్నారు, మరికొందరు దానికి విరుద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మనం విభిన్న మార్గాలను అనుసరిస్తూ వచ్చాము[1]. info

[1] జిన్నాతులలో కూడా వేర్వేరు జాతుల వారు, యూదులు, క్రైస్తవులు, ముస్లింలు మరియు సత్యతిరస్కారులు మొదలైనవారు ఉన్నారు.

التفاسير:

external-link copy
12 : 72

وَّاَنَّا ظَنَنَّاۤ اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ فِی الْاَرْضِ وَلَنْ نُّعْجِزَهٗ هَرَبًا ۟ۙ

మరియు నిశ్చయంగా, మేము అల్లాహ్ నుండి భూలోకంలో తప్పించుకోలేము, అని అర్థం చేసుకున్నాము. మరియు పారిపోయి కూడా ఆయన నుండి తప్పించుకోలేము. info
التفاسير:

external-link copy
13 : 72

وَّاَنَّا لَمَّا سَمِعْنَا الْهُدٰۤی اٰمَنَّا بِهٖ ؕ— فَمَنْ یُّؤْمِنْ بِرَبِّهٖ فَلَا یَخَافُ بَخْسًا وَّلَا رَهَقًا ۟ۙ

మరియు నిశ్చయంగా, మేము ఈ మార్గదర్శకత్వాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు దానిని విశ్వసించాము. కావున ఎవడైనా తన ప్రభువును విశ్వసిస్తాడో అతడికి తన సత్కర్మల ఫలితంలో నష్టాన్ని గురించీ మరియు శిక్షలో హెచ్చింపును గురించీ భయపడే అవసరం ఉండదు. info
التفاسير: