ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية - عبد الرحيم بن محمد

external-link copy
89 : 5

لَا یُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِیْۤ اَیْمَانِكُمْ وَلٰكِنْ یُّؤَاخِذُكُمْ بِمَا عَقَّدْتُّمُ الْاَیْمَانَ ۚ— فَكَفَّارَتُهٗۤ اِطْعَامُ عَشَرَةِ مَسٰكِیْنَ مِنْ اَوْسَطِ مَا تُطْعِمُوْنَ اَهْلِیْكُمْ اَوْ كِسْوَتُهُمْ اَوْ تَحْرِیْرُ رَقَبَةٍ ؕ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ ثَلٰثَةِ اَیَّامٍ ؕ— ذٰلِكَ كَفَّارَةُ اَیْمَانِكُمْ اِذَا حَلَفْتُمْ ؕ— وَاحْفَظُوْۤا اَیْمَانَكُمْ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

మీరు ఉద్దేశం లేకుండానే చేసిన ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని (తప్పకుండా) పట్టుకుంటాడు. కావున దానికి (ఇలాంటి ప్రమాణ భంగానికి) పరిహారంగా మీరు మీ ఇంటి వారికి పెట్టే, మధ్యరకమైన ఆహారం పది మంది పేదలకు పెట్టాలి. లేదా వారికి వస్త్రాలు ఇవ్వాలి. లేదా ఒక బానిసకు స్వాతంత్ర్యం ఇప్పించాలి. ఎవడికి ఈ శక్తి లేదో! అతడు మూడు దినాలు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, ఇది దానికి పరిహారం (కఫ్ఫారా)[1]. మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞులై ఉండటానికి అల్లాహ్ తన ఆజ్ఞలను ఈ విధంగా మీకు విశదపరుస్తున్నాడు.[2] info

[1] ప్రమాణం: ఇది 'అరబ్బీలో 'హలఫ్ లేక అయ్ మాన్ అనబడుతుంది. ఇవి మూడు రకాలు: 1)ల'గ్వున్: ఇది మానవుడు మాటి మాటికి ఆలోచించకుండా చేసే ప్రమాణం. దీనికెట్టి పరిహారం (కఫ్ఫారా) లేదు. 2) 'గమూసున్: మానవుడు ఇతరులను మోసపుచ్చటానికి చేసే బూటక ప్రమాణం. ఇది మహాపాపం. దీనికెట్టి పరిహారం (కఫ్ఫారా) ఉపయోగకరం కాదు. 3) ము'అఖ్ఖదతున్: మానవుడు సహృదయంతో పూర్తి విశ్వాసంతో చేసే ప్రమాణం. దీనిని భంగపరిస్తే పరిహారం (కఫ్పారా) ఇవ్వాలి. అది ఈ ఆయత్ లో పేర్కొనబడింది. [2] చూడండి, 2:224-225; 38:44.

التفاسير: