ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించనంత వరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!" మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని మరియు సత్యతిరస్కారాన్ని మాత్రమే పెంచుతుంది.[1] కావున నీవు సత్యతిరస్కార ప్రజలను గురించి విచారించకు.