మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును.