[1] గ్రంథం అంటే ఖుర్ఆన్, ఎన్నుకున్నవారు అంటే అంటే ము'హమ్మద్ ('స'అస) ను అనుసరించేవారు, ముస్లింలు అని అర్థం. ఇటువంటి ఆయత్ కు చూడండి, 2:143.
[2] ము'హమ్మద్ ('స'అస) ఉమ్మత్ లో మూడు రకాల వారున్నారు. వీరు మొదటి రకానికి చెందినవారు : తమకు తాము అన్యాయం చేసుకునే వారున్నారు. వీరు కొన్ని విధు(ఫ'రాయద్)లను ఉపేక్షిస్తారు. మరియు కొన్ని 'హరామ్ - నిషిద్ధ విషయాల నుండి దూరంగా ఉండరు, కాబట్టి వీరిని తమకు తాము అన్యాయం చేసుకున్నవారు అన్నారు. వీరు తమకు తాము అన్యాయం చేసుకున్నందుకు ఇతర రెండు రకాల వారి స్థానాలకు చేరలేక పోతారు. చూడండి, 7:46.
[3] వీరు రెండో రకానికి చెందినవారు, మధ్యస్థంగా ఉండేవారు. వీరు కొన్నిసార్లు ముస్త'హబ్ విషయాలను విడిచి పెడతారు. మరియు కొన్ని ము'హర్రమాత్ లను పాటించరు.
[4] వీరు మూడో రకానికి చెందినవారు, మొదట పేర్కొన్న ఇద్దరికంటే ధర్మ విషయాలలో మున్ముందు ఉండేవారు.
[1] "ఏ పురుషులైతే ఇహలోకంలో పట్టు, బంగారు ధరిస్తారో, వారు పరలోకంలో వాటిని ధరించలేరు." ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం) స్వర్గపు వస్త్రాల కొరకు చూడండి, 18:31.
[1] అంటే మిమ్మల్ని మరల భూమిలోకి పంపినా మీరు సత్కార్యాలు చేయరని, అల్లాహ్ (సు.తా.)కు బాగా తెలుసు. ఇంకా చూడండి, 6:28.