ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية - عبد الرحيم بن محمد

external-link copy
161 : 3

وَمَا كَانَ لِنَبِیٍّ اَنْ یَّغُلَّ ؕ— وَمَنْ یَّغْلُلْ یَاْتِ بِمَا غَلَّ یَوْمَ الْقِیٰمَةِ ۚ— ثُمَّ تُوَفّٰی كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟

మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం (బూటీ) కొరకు నమ్మక ద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మకద్రోహానికి పాల్పడినవాడు పునరుత్థాన దినమున తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.[1] info

[1] ఉ'హుద్ యుద్ధం రోజు దైవప్రవక్త ('స'అస) విలుకాండ్రను: ఎట్టి పరిస్థితిలో కూడా వారు తమ స్థలాలను వదలరాదని, ఆదేశిస్తారు. కాని వారు యుద్ధబూటీ వ్యామోహంలో తమ స్థానాలను వదలి యుద్ధబూటీ ప్రోగు చేయటానికి వెళ్తారు. కార్యాన్నే ఖండిస్తూ, అల్లాహ్ (సు.తా.) అన్నాడు: "ఏ ప్రవక్త కూడా తన తోటివారికి అన్యాయం చేయడు." కాబట్టి వారు తమ ప్రవక్తయందు విశ్వాసముంచుకొని, బూటీలోని తమ హక్కు తమకు తప్పక దొరుకుతుందని, తమ చోట్లలో స్థిరంగా ఉండటమే వారి కర్తవ్యము. ఈ ఆయత్ ప్రతి వ్యవహారానికి వర్తిస్తుంది.

التفاسير: