ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية - عبد الرحيم بن محمد

سورة الحج - అల్-హజ్

external-link copy
1 : 22

یٰۤاَیُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمْ ۚ— اِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَیْءٌ عَظِیْمٌ ۟

ఓ మానవులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి! నిశ్చయంగా, ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది. info
التفاسير:

external-link copy
2 : 22

یَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّاۤ اَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَی النَّاسَ سُكٰرٰی وَمَا هُمْ بِسُكٰرٰی وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِیْدٌ ۟

ఆ రోజు ఆవరించినప్పుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ, తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు. కానీ (వాస్తవానికి) వారు త్రాగి (మత్తులో) ఉండరు. కాని అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది. info
التفاسير:

external-link copy
3 : 22

وَمِنَ النَّاسِ مَنْ یُّجَادِلُ فِی اللّٰهِ بِغَیْرِ عِلْمٍ وَّیَتَّبِعُ كُلَّ شَیْطٰنٍ مَّرِیْدٍ ۟ۙ

మరియు ప్రజలలో ఒకడుంటాడు, జ్ఞానం లేనిదే, అల్లాహ్ ను గురించి వాదులాడే వాడు మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ ను అనుసరించేవాడు. info
التفاسير:

external-link copy
4 : 22

كُتِبَ عَلَیْهِ اَنَّهٗ مَنْ تَوَلَّاهُ فَاَنَّهٗ یُضِلُّهٗ وَیَهْدِیْهِ اِلٰی عَذَابِ السَّعِیْرِ ۟

అతడిని (షైతాన్ ను) గురించి వ్రాయబడిందేమిటంటే, వాస్తవానికి ఎవడైతే అతడి వైపునకు మరలుతాడో, వాడిని నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టుడిగా చేస్తాడు మరియు వాడికి మండే నరకాగ్ని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. info
التفاسير:

external-link copy
5 : 22

یٰۤاَیُّهَا النَّاسُ اِنْ كُنْتُمْ فِیْ رَیْبٍ مِّنَ الْبَعْثِ فَاِنَّا خَلَقْنٰكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِنْ مُّضْغَةٍ مُّخَلَّقَةٍ وَّغَیْرِ مُخَلَّقَةٍ لِّنُبَیِّنَ لَكُمْ ؕ— وَنُقِرُّ فِی الْاَرْحَامِ مَا نَشَآءُ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ۚ— وَمِنْكُمْ مَّنْ یُّتَوَفّٰی وَمِنْكُمْ مَّنْ یُّرَدُّ اِلٰۤی اَرْذَلِ الْعُمُرِ لِكَیْلَا یَعْلَمَ مِنْ بَعْدِ عِلْمٍ شَیْـًٔا ؕ— وَتَرَی الْاَرْضَ هَامِدَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَیْهَا الْمَآءَ اهْتَزَّتْ وَرَبَتْ وَاَنْۢبَتَتْ مِنْ كُلِّ زَوْجٍ بَهِیْجٍ ۟

ఏ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, [1] తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు;[2] అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది. info

[1] 'మట్టితో సృష్టించాము.' ఇటువంటి ఇతర ఆయతులకు చూడండి, 3:59, 11:61, 18:37, 30:20, 23:12. [2] చూడండి, 16:70.

التفاسير: