ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية - عبد الرحيم بن محمد

external-link copy
34 : 2

وَاِذْ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اَبٰی وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: "మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్[1] తప్ప మిగతా వారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు;[2] అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్యతిరస్కారులలోని వాడయ్యాడు. info

[1] ఇబ్లీస్: అంటే, He Despaired, ఆశ వదులుకొన్న, నిరాశ చెందిన వాడు. ఇది షై'తాన్ పేరు. అతడు జిన్నాతులలోని వాడు. షై'తాన్: He was, or became, distant or remote (from the mercy of Allah) అంటే, అల్లాహ్ (సు.తా.), సానుభూతి, లేక దయ నుండి దూరమై పోయిన వాడు, Rebelious, తిరగబడిన, అవిధేయుడైన, ఎదురు తిరిగిన వాడు, అధికారాన్ని ప్రతిఘటించిన వాడు. [2] సజ్దా: నుదుటితో సహా ఎనిమిది అంగాలను భూమికి ఆనించటం (సాష్టాంగం చేయటం). దీనిలో నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళ వ్రేళ్ళు భూమికి తగులుతూ ఉండాలి. ఇది కేవలం అల్లాహుతా'లా కొరకే ప్రత్యేకించబడింది. ఇక్కడ దైవదూతలు అల్లాహ్ (సు.తా.) ఆదేశాన్ని శిరసావహించటానికే ఆదమ్ ('అస) కు సజ్దా చేశారు. ము'హమ్మద్ ('స'అస) షరీయత్ లో, మానవుడు గౌరవార్థం కూడా ఎవ్వరికీ సజ్దా చేయగూడదు.

التفاسير: