ఎవరైతే తమ సంపదను (అల్లాహ్ మార్గంలో) రేయింబవళ్ళు బహిరంగంగానూ మరియు రహస్యంగానూ ఖర్చు చేస్తారో, వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా![1]
[1] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 504.