ఓ ప్రవక్తా మీ సహచరులు యుద్ధప్రాప్తి గురించి దానిని ఏ విధంగా పంచిపెట్టాలి ?,దానిని ఎవరికి పంచిపెట్టాలి ? అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఓ ప్రవక్తా మీరు వారి ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా పలకండి : యుద్ధప్రాప్తి అల్లాహ్ కు ,ప్రవక్తకు చెందినది. దాన్ని ఖర్చు చేయటం గురించి,పంచిపెట్టటం గురించి ఆదేశము అల్లాహ్ ది,ఆయన ప్రవక్తది. అయితే కేవలం మీరు దానిని అనుసరించాలి,అంగీకరించాలి. ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. మరియు మీ మధ్య ఉన్న సంబంధాలను త్రెంచుకోవటం, ముఖము చాటి వేయటంను పరస్పర ప్రేమతో,బంధుత్వాలను కలపటం ద్వారా,మంచి నడవడితో,మన్నింపు వైఖరితో సరిదిద్దుకోండి. మరియు మీరు నిజంగా విశ్వాసపరులే అయితే అల్లాహ్ పై విధేయతను,ఆయన ప్రవక్తపై విధేయతను మీపై తప్పనిసరి చేసుకోండి. ఎందుకంటే విశ్వాసము విధేయత చూపటంపై,అవిధేయత కార్యాల నుండి దూరంగా ఉండటంపై ప్రోత్సహిస్తుంది. ఈ ప్రశ్న బదర్ సంఘటన జరిగిన తరువాతది.
వాస్తవంగా విశ్వాసపరులు అల్లాహ్ ప్రస్తావన జరిగినప్పుడు వారి హృదయాలు భయపడుతాయి. వారి హృదయాలు,వారి శరీరాలు విధేయత కొరకు నడవసాగుతాయి. వారి ముందు అల్లాహ్ ఆయతులు పఠించబడినప్పుడు వారు అందులో యోచన చేస్తారు. వారిలో విశ్వాసం పెరుగుతుంది. తమకు ప్రయోజనాలు కలగటంలో,తమ నష్టాలు తొలిగి పోవటంలో ఒక్కడైన తమ ప్రభువు పైనే నమ్మకమును కలిగి ఉంటారు.
వారే నమాజును దాని పరిపూర్ణ లక్షణాలతో దాని వేళలో పాటించటంలో స్థిరత్వాన్ని చూపుతారు. మేము వారికి ప్రసాదించిన వాటిలో నుంచి వారు అనివార్యమైన,అభిలాషణీయమైన ఖర్చులను చేస్తారు.
ఈ లక్షణాలు కలిగిన వీరందరే వారి విశ్వాస,ఇస్లామ్ ప్రత్యక్ష లక్షణాల సముదాయం వలన నిజమైన విశ్వాసపరులు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు వద్ద ఎత్తైన భవనాలు,వారి పాపములకు మన్నింపు,మర్యాదపూరకమైన ఆహారోపాధి ఉంటాయి. అది అల్లాహ్ వారి కోసం తయారు చేసి ఉంచిన అనుగ్రహాలలోనిది.
యుద్ధప్రాప్తి పంచటం విషయంలో మీ మధ్య ఉన్న విభేదాల,తగాదాల తరువాత దానిని పంచే అధికారమును అల్లాహ్ మీ నుండి తీసుకుని దానిని తనకు మరియు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు చేసినట్లే అదేవిధంగా ఓ ప్రవక్తా మీ ప్రభువు మీపై అవతరింపజేసిన వహీ ద్వారా మీరు ముష్రికులతో యుద్ధం చేయటానికి మిమ్మల్ని మదీనా నుండి బయలదేరమని విశ్వాసపరుల్లోంచి ఒక వర్గం దానిని ఇష్టపడకపోయిన ఆదేశించాడు.
ఓ ప్రవక్తా ముష్రికులతో యుద్దం సంభవిస్తుందని విశ్వాసపరుల్లోంచి ఈ వర్గమునకు స్పష్టమైన తరువాత కూడా ముష్రికులతో యుద్ధ విషయంలో మీతో అది వాదిస్తుంది. ఎలాగంటే వారు మృత్యువు వైపునకు తరుమబడుతున్నట్లు,వారు దాన్ని కళ్ళారా చూస్తున్నట్లు (వాదిస్తుంది). ఇదంతా యుధ్ధం కోసం బయలుదేరటంలో వారి అయిష్టత ఎక్కువగా ఉండటం వలన. ఎందుకంటే వారు దాని కొరకు ఆయుధాలను తీసుకో లేదు,దానికి తగ్గట్టుగా వారు సిద్ధం కాలేదు.
ఓ వాదించే విశ్వాసపరులారా ముష్రికుల రెండు పక్షాల్లోంచి ఒక దానిపై మీకు విజయం ప్రాప్తిస్తుందని అల్లాహ్ మీకు వాగ్ధానం చేసినప్పటి సంఘటనను ఒక సారి మీరు గుర్తు చేసుకోండి. అది వర్తక బృంధం (కారవాన్) ,అది తీసుకుని వస్తున్న సంపద కావచ్చు. దానిని మీరు యుద్ధప్రాప్తిగా తీసుకుంటారు. లేదా అది యుద్ధబృంధం కావచ్చు. మీరు వాళ్ళతో పోరాడుతారు. వారిపై మీరు విజయం పొందుతారు. మరియు మీరు వర్తక బృంధం పై విజయమును దాన్ని వశపరచుకోవటం యుద్ధం కన్న సులభతరం,సౌలభ్యం కావటం వలన కోరుకున్నారు. మరియు అల్లాహ్ ఇస్లాం బలం బహిర్గతం అయ్యేంత వరకు మీరు ముష్రికుల నాయకులను హతమార్చటం కొరకు,వారిలోంచి చాలా మందిని ఖైదీలుగా చేసుకోవటం కొరకు మిమ్మల్ని యుద్ధ ఆదేశమిచ్చి సత్యాన్ని సత్యంగా తేట తెల్లం చేయాలని కోరుకున్నాడు.
అల్లాహ్ ఇస్లామునకు,ముస్లిములకు ఆధిపత్యమును కలిగించి సత్యాన్ని సత్యంగా నిరూపించాలని అది సత్యం అయ్యే విషయంలో దాని ఆధారాలను బహిర్గతం చేయటం ద్వారా జరుగుతుంది. మరియు అల్లాహ్ అసత్యమును అసత్యముగా అది అసత్యము అవటానికి ఆధారాలను బహిర్గతం చేసి నిరూపించటానికి ఒక వేళ ముష్రికులు దానిని ఇష్టపడక పోయిన అల్లాహ్ దానిని బహిర్గతం చేస్తాడు.
التفاسير:
من فوائد الآيات في هذه الصفحة:
• ينبغي للعبد أن يتعاهد إيمانه ويُنمِّيه؛ لأن الإيمان يزيد وينقص، فيزيد بفعل الطاعة وينقص بضدها.
దాసుడు తన విశ్వాసమును పరిరక్షించటం,దానిని ఆశించటం తప్పనిసరి. ఎందుకంటే విశ్వాసం పెరుగుతుంది ,తరుగుతుంది. విధేయత కార్యాల ద్వారా పెరుగుతుంది,దానికి విరుద్ధ కార్యాల (అవిధేయ కార్యాల ) ద్వారా తరుగుతుంది.
• الجدال محله وفائدته عند اشتباه الحق والتباس الأمر، فأما إذا وضح وبان فليس إلا الانقياد والإذعان.
సత్యం సందేహస్పదంగా ఉన్నప్పుడు,ఆదేశము గందరగోళం అయినప్పుడు వాదనకు స్థానం ఉన్నది,దాని ప్రయోజనం ఉన్నది. (సత్యం) స్పష్టమైనప్పుడు,బహిర్గతం అయినప్పుడు అనుసరించటం,స్వీకరించటం తప్ప వేరే మార్గం లేదు.
• أَمْر قسمة الغنائم متروك للرّسول صلى الله عليه وسلم، والأحكام مرجعها إلى الله تعالى ورسوله لا إلى غيرهما.
యుద్ధప్రాప్తిని పంచి పెట్టే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అప్పజెప్పటం జరిగింది. ఆదేశాల అభయ స్థానము అల్లాహ్,ఆయన ప్రవక్త వైపున కలదు వారిరువురు కాకుండా ఇతరుల వైపు కాదు.
• إرادة تحقيق النّصر الإلهي للمؤمنين؛ لإحقاق الحق وإبطال الباطل.
విశ్వాసపరుల కొరకు దైవిక విజయాన్ని సాధించాలనే సంకల్పం సత్యాన్ని సత్యంగా,అసత్యాన్ని అసత్యంగా నిరుపించటం కొరకే.