ఒక వేళ మేము దైవ దూతనే ప్రవక్తగా పంపిస్తే అతనిని మేము మానవుని రూపంలో చేస్తాము.అప్పుడు వారు అతనిని వినగలుగుతారు,అతనిని కలుసుకోగలుగుతారు.దైవ దూతను ఏ రూపంలో నైతే అల్లాహ్ అతనిని సృష్టించాడో ఆ రూపంలో ఇదంతా సాధ్యం కాదు.ఒక వేళ మేము మానవుని రూపంలో చేస్తే అది వారిని సందేహంలో పడవేస్తుంది.
ఒక వేళ వారందరు మీతో పాటు దూతను అవతరింపజేసే వారి కోరిక విషయంలో అవహేళన చేస్తే మీకన్న పూర్వం జాతులవారు తమ ప్రవక్తలను అవహేళనకు గురి చేశారు.అయితే ఏ శిక్ష ద్వారానైతే వారు భయపెట్టబడేటప్పుడు దానిని వారు తిరస్కరించారో,హేళన చేశారో ఆ శిక్ష వారిని చుట్టుముట్టుకుంది.
ఓ ప్రవక్తా అవహేళన చేసే ఈ తిరస్కారులందరితో ఇలా తెలియజేయండి-: మీరు భూమిలో సంచరించండి.ఆ తరువాత అల్లాహ్ ప్రవక్తలను తిరస్కరించిన వారి ముగింపు ఏ విధంగా జరిగినదో చూడండి.వారికి బలం,బలగం ఉండి కూడా వారిపై అల్లాహ్ శిక్ష వచ్చి పడినది.
ఓ ప్రవక్త వారందరితో అనండి : భూమిలో అధికారము,ఆకాశములలో అధికారము,వాటిలో ఉన్న సమస్తము పై అధికారము ఎవరిది ?.మీరు అనండి : వాటన్నింటి పై అధికారము అల్లాహ్ దే.అతను తన దాసులపై అనుగ్రహంగా కనికరమును తన పై అవశ్యం చేసుకున్నాడు.వారిని శిక్షించటంలో తొందర పడడు.చివరికి వారు పశ్చ్యాత్తాప్పడక పోయినప్పుడు వారందరిని ప్రళయదినాన సమీకరిస్తాడు.ఆ దినము ఎటువంటి సందేహము లేని దినము.అల్లాహ్ పై అవిశ్వాసం వలన తమకు తామే నష్టమును కలిగించుకున్న వారు విశ్వసించరు. ఈ విధంగా వారు తమను నష్టం నుండి రక్షించుకోవాలనుకుంటారు.
మరియు పగలు,రాత్రి స్ధిరపడ్డ ప్రతి వస్తువు పై అధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే.ఆయన వారి మాటలను వినేవాడును,వారి కర్మలను తెలుసుకునేవాడును,త్వరలోనే వాటి పరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
ఓ ప్రవక్త అల్లాహ్ తోపాటు ఇతరులను విగ్రహాలు,మొదలుగు వాటిని ఆరాధించే బహుదైవారాధకులతో ఇలా తెలపండి-: నేను అల్లాహ్ ను వదిలి వేరే వారిని సహాయకునిగా చేసుకుని అతనితో సహాయమును అర్ధిస్తే ఇది అర్ధం చేసుకునే విషయమా?.ఆయన పూర్వ నమూనా లేకుండా భూమ్యాకాశాలను సృష్టించాడు. ఆ రెండింటిని సృష్టించటంలో ఆయనకన్న ముందు ఎవడూ లేడు.అతనే తన దాసుల్లోంచి ఎవరిని తలచుకుంటే వారిని ఆహారాన్ని ప్రసాధించేవాడు.ఆయన దాసుల్లోంచి ఆయనకు ఎవరూ ఆహారాన్ని ప్రసాధించ లేరు.ఆయన తన దాసుల అవసరం లేనివాడు.ఆయన దాసులు ఆయన అవసరం కలవారు.ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియజేయండి-: పరిశుద్ధుడైన నా ప్రభువు నన్ను ఈ జాతిలోంచి అల్లాహ్ కొరకు మొట్ట మొదట విధేయత చూపే వానిగా,వినయ నిమమ్రతలు చూపే వానిగా అవ్వమని ఆదేశించాడు.మరియు ఆయనతోపాటు వేరే వారిని సాటి కల్పించే వారిలోంచి అవ్వడం నుండి నన్ను వారించాడు.
ఓ ప్రవక్త మీరు ఇలా తెలియ పరచండి-: ఒక వేళ నేను అల్లాహ్ నాపై నిషేధించిన షిర్కును,తదితర కార్యాలను చేసి లేదా నన్ను ఆదేశించిన విధేయతకు గురిచేసే విశ్వాసము,తదితర కార్యాలను వదిలివేసి అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడితే ఆయన నన్ను ప్రళయదినాన పెద్ద శిక్షకు గురి చేస్తాడని నిశ్చయంగా నేను భయపడుతున్నాను.
ప్రళయ దినాన అల్లాహ్ ఎవరినైతే ఈ శిక్ష నుండి దూరం చేస్తాడో అతడు అల్లాహ్ కారుణ్యము ద్వారా సాఫల్యం చెందుతాడు.శిక్ష నుండి ఈ మోక్షమే స్పష్టమైన సాఫల్యం.దానికి సమానమైన సాఫల్యం ఏది ఉండదు.
ఓ ఆదం కుమారుడా ఒక వేళ అల్లాహ్ వద్ద నుండి ఏదైన ఆపద నీపై వస్తే అల్లాహ్ తప్ప ఇంకెవరు నీపై నుండి ఆ ఆపదను తొలగించేవారుండరు.ఒక వేళ ఆయన వద్ద నుండి ఏదైన మేలు నీకు చేరితే దానిని ఆపేవాడు ఎవడూ ఉండడు.ఆయన అనుగ్రహమును ఎవరూ మరలించలేరు.ఆయనే ప్రతీ వస్తువుపై అధికారము కలవాడు.ఆయనను ఏదీ అశక్తులు చేయలేవు.
మరియు అతడు తన దాసులపై ఆధిఖ్యతను చూపేవాడు వారిని తన అదుపులో ఉంచుకునేవాడు,అన్ని విధాలుగా వారిపై ఆధిఖ్యతను ప్రదర్శించేవాడు ఆయనను ఏదీ అశక్తుడు చేయలేవు.ఆయనపై ఎవరూ ఆధిఖ్యతను ప్రదర్శించలేరు.సమస్తము ఆయన ఆదీనంలో ఉన్నవి.పరిశుద్ధుడైన ఆయనకు తగినట్లు తన దాసులపై ఆధిఖ్యమున్నది.అతడే తన సృష్టించటంలో,పర్యాలోచనలో,తన శాసనాలను శాసించటంలో వివేకవంతుడు.అన్నీ తెలిసినవాడు,ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
التفاسير:
من فوائد الآيات في هذه الصفحة:
• بيان حكمة الله تعالى في إرسال كل رسول من جنس من يرسل إليهم؛ ليكون أبلغ في السماع والوعي والقبول عنه.
అల్లాహ్ ఎవరి వైపు ప్రవక్తను పంపించిన అతడిని వారు వినటానికి,విన్నవాటిని పొందుపరచటానికి,స్వీకరించటానికి అనుకూలంగా ఉండటానికి ఆ ప్రవక్త వారి జాతివారిలోంచి పంపించటం అల్లాహ్ యొక్క వివేకము అని తెలియజేయటం జరిగింది.
• الدعوة للتأمل في أن تكرار سنن الأوّلين في العصيان قد يقابله تكرار سنن الله تعالى في العقاب.
అవిధేయతలో పూర్వీకుల సాంప్రదాయాలు పదేపదే జరగటం దానికి సమానంగా అల్లాహ్ యొక్క శిక్ష సాంప్రదాయం కొనసాగటంలో ధ్యానం వహించమని పిలుపునివ్వటం జరిగింది.
• وجوب الخوف من المعصية ونتائجها.
అవిధేయత,దాని పరిణామాల నుండి భయపడటం తప్పనిసరి.
• أن ما يصيب البشر من بلاء ليس له صارف إلا الله، وأن ما يصيبهم من خير فلا مانع له إلا الله، فلا رَادَّ لفضله، ولا مانع لنعمته.
మానవులకు సంభవించే ఏ ఆపదైన దానిని మరల్చేవాడు అల్లాహ్ తప్ప ఇంకెవడూ లేడు.మరియు వారికి కలిగే మేలును అల్లాహ్ తప్ప ఇంకెవరూ ఆపలేరు.ఆయన అనుగ్రహమును మరల్చేవాడు ఎవడు లేడు.ఆయన ప్రసాధించే అనుగ్రహమును ఆపేవాడు ఎవడూ లేడు.