మీరు ఈ నరకాగ్ని వేడిని చవి చూడండి మరియు దాన్ని అనుభవించండి. దాని వేడిని అనుభవించటంపై మీరు సహనం చూపండి లేదా సహనం చూపకండి. మీ సహనం చూపటం,మీ సహనం చూపకపోవటం సమానము. ఇహలోకంలో మీరు చేసుకున్న అవిశ్వాసము మరియు పాపకార్యములకు మాత్రమే ఈ రోజు మీరు ప్రతిఫలం ప్రసాదించబడుతారు.
التفاسير:
17:52
اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّنَعِیْمٍ ۟ۙ
నిశ్ఛయంగా తమ ప్రభువుకు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడే వారు అంతంకాని స్వర్గ వనముల్లో మరియు అనుగ్రహముల్లో ఉంటారు.
తినే,త్రాగే,వివాహం లాంటి అల్లాహ్ వారికి ప్రసాదించిన రుచులను వారు అనుభవిస్తారు. మరియు పరిశుద్ధుడైన వారి ప్రభువు నరక శిక్ష నుండి వారిని రక్షించాడు. కాబట్టి వారు తాము ఆశించిన ఆనందాలను పొంది కష్టాల నుండి తమను రక్షించుకోవటం ద్వారా సాఫల్యం పొందారు.
మరియు వారితో ఇలా పలకబడును : మీరు మీ మనసుకు నచ్చిన వాటిని హాయిగా తినండి మరియు త్రాగండి. మీరు తినే వాటి విషయంలో గాని లేదా త్రాగే వాటి విషయంలో గాని ఎటువంటి కీడు,బాధ గురించి భయపడకండి. ఇహలోకములోని మీ సత్కర్మలకు ఇది మీకు ప్రతిఫలము.
అలంకరించబడి ఒక దానికి ఒకటి ఎదురుగా పెట్టబడిన ఆసనాలపై ఆనుకుని కూర్చుని ఉంటారు. మరియు మేము వారిని విశాలమైన తెల్లటి కన్నులు కల స్త్రీలతో వివాహం చేయిస్తాము.
మరియు ఎవరయితే విశ్వసించి వారి సంతానము విశ్వాసములో వారిని అనుసరించి ఉంటే మేము వారి ద్వారా వారి కంటికి చలువను కలిగించటానికి వారితో వారిని కలుపుతాము. ఒక వేళ వారు వారి కర్మలకు చేరకుండా ఉంటే మేము వారి కర్మల పుణ్యములో నుంచి ఏమీ తగ్గించము. ప్రతీ మనిషి తాను సంపాదించుకున్న దుష్కర్మకు తాకట్టుగా ఉంటాడు. అతని నుండి అతని కర్మను ఏమాత్రం ఇతరులు మోయరు.
నిశ్చయంగా మేము మా ఇహలోక జీవితంలో ఆయనను ఆరాధించేవారము. మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి రక్షించమని ఆయనను మేము వేడుకునేవారము. నిశ్చయంగా ఆయన తన దాసులకు తాను చేసిన వాగ్దానములో సత్యవంతుడైన ఉపకారి,వారిపై అపారంగా కరుణించేవాడును. మమ్మల్ని ఆయన విశ్వాసమునకు మర్గం చూపటం మరియు మమ్మల్ని స్వర్గములో ప్రవేశింపజేయటం మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి దూరం చేయటం మాపై ఉన్న ఆయన ఉపకారము మరియు ఆయన కారుణ్యములోనిదే.
ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ ద్వారా హితోపదేశం చేయండి. అల్లాహ్ మీపై అనుగ్రహించిన విశ్వాసం మరియు బుద్ధి వలన జిన్నుల్లోంచి ఇష్టపడే మీరు ఏ జ్యోతిష్యులు కారు. మరియు మీరు పిచ్చివారు కాదు.
లేదా ఈ తిరస్కారులు నిశ్చయంగా ముహమ్మద్ ఒక ప్రవక్త కాదు. కాని అతను ఒక కవి,అతన్ని మరణం ఎత్తుకుపోవాలని ఎదురుచూస్తున్నాము. అప్పుడు మేము అతని నుండి మనశ్శాంతి పొందుతాము అని అంటున్నారా ?.
ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : మీరు నా మరణం గురించి ఎదురు చూడండి. మరియు మీరు నన్ను తిరస్కరించటం వలన మీపై కురిసే శిక్ష గురించి నేనూ నిరీక్షిస్తాను.
التفاسير:
من فوائد الآيات في هذه الصفحة:
• الجمع بين الآباء والأبناء في الجنة في منزلة واحدة وإن قصر عمل بعضهم إكرامًا لهم جميعًا حتى تتم الفرحة.
తాత ముత్తాతలు మరియు సంతానము స్వర్గములో ఒకే స్థానములో సమీకరించబడటం ఒక వేళ వారిలోని కొందరి ఆచరణలు తక్కువ ఉన్నా వారందరికి గౌరవముగా సంతోషము పూర్తయ్యే వరకు.
• خمر الآخرة لا يترتب على شربها مكروه.
పరలోక మధ్యమును త్రాగటం ఎటువంటి అసహ్యకరమైన ఫలితాన్ని ఇవ్వదు.
• من خاف من ربه في دنياه أمّنه في آخرته.
ఎవరైతే తన ప్రభువుతో ఆయన ఇహలోకంలో భయపడుతాడో ఆయన అతనికి తన పరలోకంలో రక్షణను కల్పిస్తాడు.