పొగడ్తలన్నీ పూర్వ నమూనా లేకుండా ఆకాశములను,భూమిని సృష్టించినవాడైన అల్లాహ్ కే చెందుతాయి. ఆయనే దైవదూతలను సందేశాలను చేరవేసేవానిగా చేశాడు వారు ఆయన విధి ఆదేశాలను నిర్వర్తిస్తుంటారు మరియు వారిలో నుండి దైవప్రవక్తలకు దైవ వాణిని చేరవేసేవారు ఉన్నారు. మరియు ఆయన వారికి ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించటంపై బలమును చేకూర్చాడు. అయితే వారిలో నుండి కొందరు రెండు రెక్కల వారు,మూడు రెక్కల వారు,నాలుగు రెక్కల వారు ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాలను నిర్వర్తించటానికి వారు వాటి ద్వారా ఎగురుతారు. అల్లాహ్ సృష్టి లో నుండి ఎవరికి తలచుకుంటే వారికి అవయములను గాని అందమును గాని స్వరమును గాని అధికం చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
నిశ్చయంగా ప్రతీ వస్తువు యొక్క తాళములు అల్లాహ్ చేతిలో ఉన్నవి. అయితే ఆయన ప్రజల కొరకు ఆహారోపాధిని,సన్మార్గమును,ఆనందమును తెరిస్తే ఎవరూ దాన్ని ఆపలేరు. మరియు వాటిలో నుండి ఆయన దేన్ని ఆపినా, ఆపిన తరువాత దాన్ని ఎవడూ పంపించలేడు. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వశక్తిమంతుడు, తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
ఓ ప్రజలారా మీరు మీపై ఉన్నఅనుగ్రహములైన మీ హృదయములను,మీ నాలుకలను,మీ పనిచేసే మీ అవయవాలను గుర్తు చేసుకోండి. ఏమీ మీ కొరకు అల్లాహ్ ను వదిలి ఆకాశము నుండి మీపై వర్షం కురిపించటం ద్వారా మీకు ఆహారోపాధిని ప్రసాదించే మరియు భూమి నుండి ఫలములను,పంటలను మొలకెత్తించి మీకు ఆహారోపాధిని ప్రసాదించే సృష్టికర్త ఎవరైనా ఉన్నారా ?. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవరూ లేరు. అటువంటప్పుడు దీని తరువాత మీరు ఎలా ఈ సత్యము నుండి మరలిపోయి,అల్లాహ్ పై కల్పించుకుని అల్లాహ్ కొరకు భాగస్వాములు ఉన్నారని భావిస్తున్నారు. వాస్తవానికి ఆయనే మిమ్మల్ని సృష్టించాడు మరియు మీకు ఆహారోపాధిని ప్రసాదించాడు.