《古兰经》译解 - 泰卢固语翻译 - 阿布杜·拉赫曼·本·穆罕默德。

external-link copy
45 : 5

وَكَتَبْنَا عَلَیْهِمْ فِیْهَاۤ اَنَّ النَّفْسَ بِالنَّفْسِ ۙ— وَالْعَیْنَ بِالْعَیْنِ وَالْاَنْفَ بِالْاَنْفِ وَالْاُذُنَ بِالْاُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ ۙ— وَالْجُرُوْحَ قِصَاصٌ ؕ— فَمَنْ تَصَدَّقَ بِهٖ فَهُوَ كَفَّارَةٌ لَّهٗ ؕ— وَمَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟

మరియు ఆ గ్రంథం (తౌరాత్) లో వారికి మేము: "ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను మరియు గాయాలకు బదులుగా సరిసమానమైన ప్రతీకారం వ్రాశాము.[1] కాని ఎవరైనా దానిని క్షమిస్తే, అది అతనికి పాపపరిహారం (కఫ్ఫారా)! మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరో అలాంటి వారు! వారే దుర్మార్గులు.[2] info

[1] ఈ శిక్షలకు చూడండి, బైబిల్ (Old Testament), నిర్గమకాండం - (Exodus) 21:23-36. [2] పూర్వ గ్రంథ ప్రజలు తమ ధర్మగ్రంథానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అంటే అల్లాహ్ (సు.తా.) శాసనాన్ని అనుసరించటం లేదు. ఎవరైతే అల్లాహుతా'ఆలా శాసనాన్ని అనుసరించరో అలాంటి వారే "జాలిమూన్ - దుర్మార్గులు, ఫాసిఖూన్ - అవిధేయులు (దుష్టులు) మరియు కాఫిరూన్ - సత్యతిరస్కారులు అనబడతారు. అలాంటి వారే అల్లాహుతా'ఆలా ఆగ్రహానికి గురి అయ్యావారు.

التفاسير: